Weight Loss Nuts: ప్రతిరోజూ పిస్తా పప్పు తినడం వల్ల అధిక బరువును నియంత్రించుకోవచ్చు!

Weight Loss Nuts: డ్రై ఫ్రూట్స్ అన్నీ మన ఆరోగ్యానికి మేలు చేస్తాయి. అందులో మరీ ముఖ్యంగా పిస్తాపప్పు మరింత ప్రయోజనకరంగా ఉంటుంది. పిస్తా పప్పును రోజూ ఆహారంలో తీసుకోవడం వల్ల అధిక బరువు కూడా తగ్గే అవకాశం ఉంది. అదెలాగో ఇది చదివి తెలుసుకోండి.   

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 18, 2022, 05:53 PM IST
Weight Loss Nuts: ప్రతిరోజూ పిస్తా పప్పు తినడం వల్ల అధిక బరువును నియంత్రించుకోవచ్చు!

Weight Loss Nuts: మారుతున్న జీవనశైలి కారణంగా చాలా మంది అధిక బరువుతో బాధపడుతున్నారు. ఈ క్రమంగా ఫిట్ గా మారేందుకు అనేక ప్రయత్నాలు చేస్తుంటారు. పండ్లు, పచ్చి కూరగాయలు, డ్రైఫ్రూట్స్ వంటి వాటితో అధిక బరువును తగ్గించుకునే ప్రయత్నం చేస్తున్నారు. పండ్లు, డ్రైఫ్రూట్స్ వల్ల శరీరానికి అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ముఖ్యంగా డ్రైఫ్రూట్స్ లో పిస్తా వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. పిస్తా పప్పు వల్ల అధిక బరువును నియంత్రించుకోవచ్చు. 

బరువు తగ్గేందుకు..

పిస్తా వల్ల మన ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. అవాంఛిత ఆకలిని పిస్తా పప్పు తినడం వల్ల నియంత్రించవచ్చు. దీంతో శరీర బరువును తగ్గించడంలో ఇది సహకరిస్తుంది. పిస్తా పప్పు రోజూ ఆహారంలో తీసుకోవడం ద్వారా తలనొప్పి, చికాకు వంటి సమస్యలకు స్వస్తి చెప్పవచ్చు. 

మెదడు పనితీరు మెరుగ్గా..

కళ్ళు, మెదడు పనితీరు మెరుగు పరచడం సహా శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రించేందుకు పిస్తా పప్పు చాలా ప్రయోజనకరంగా మారుతుంది. పిస్తాపప్పులో కార్డియోప్రొటెక్టివ్ యాక్టివిటీ, న్యూరోప్రొటెక్టివ్ యాక్టివిటీ వంటి పోషకాలు ఉంటాయి. అవి నాడీ, గుండె పనితీరును మెరుగుపరుస్తాయి. మానసిక సామర్థ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి. 

గాఢ నిద్ర కోసం..

రాత్రిపూట పాలల్లో పిస్తా కలిపి తాగితే మంచి నిద్ర వస్తుంది. ఇలా తాగడం వల్ల అధిక రక్తపోటు కూడా అదుపులోకి వస్తుంది. పిస్తాలో యాంటీఆక్సిడెంట్ కెరోటినాయిడ్స్, పాలీ, మోనో-అసంతృప్త కొవ్వు ఆమ్లాలు లుటిన్, ఆల్ఫాతో పాటు బీటా కెరోటిన్ పుష్కలంగా ఉన్నాయి. ఇవి మానసిక ఆరోగ్యంపై మంచి ప్రభావాన్ని చూపుతాయి. 

కళ్లకు రక్షణ

పిస్తా పప్పు రోజూ తినడం వల్ల సూర్యని నుంచి వచ్చే అతినీలలోహిత కిరణాలు, కళ్లను రక్షిస్తాయి. ఇందులో ఫైబర్, విటమిన్ B6 మూలకాలతో పాటు ఫైబర్, కార్బోహైడ్రేట్లు, అమైనో ఆమ్లాలు, కొవ్వులు కూడా ఉన్నాయి. ఇవి నోటి నుంచి దుర్వాసన, విరేచనాలు, దురద తగ్గించడం సహా జ్ఞాపకశక్తి పెరుగుదలకు సహాయపడతాయి.

(నోట్: పైన పేర్కొన్న సమాచారమంతా కొన్ని నివేదికల నుంచి గ్రహించబడింది. ఈ చిట్కాలను పాటించే ముందు సంబంధిత వైద్యుడ్ని సంప్రదించడం మంచిది. దీన్ని ZEE తెలుగు News ధ్రువీకరిచడం లేదు.)     

Also Read: Traditional Holi Colours: హోలీలో సంప్రదాయ రంగులు.. వీటి వల్ల చర్మానికి ఎంతో ప్రయోజనం!

Also Read: Empty Stomach Issues: ఉదయాన్నే ఖాళీ కడుపుతో పొరపాటున కూడా ఈ పని చేయకండి!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News