Cauliflower disadvantage: పొరపాటున ఈ వ్యాధులున్నవారు కాలీఫ్లవర్ తింటున్నారా.. ఇక అంతే సంగతి..

Unknown Facts About Cauliflower: శీతాకాలంలో చాలామంది కాలీఫ్లవర్ ను అతిగా వినియోగిస్తుంటారు. అయితే ఇలా దానితో తయారుచేసిన ఆహారాలను తినడం వల్ల శరీరానికి చాలా రకాల దుష్ప్రభావాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా పలు రకాల తీవ్ర అనారోగ్య సమస్యలు కూడా రావొచ్చని అంటున్నారు.  

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 23, 2022, 09:26 AM IST
Cauliflower disadvantage: పొరపాటున ఈ వ్యాధులున్నవారు కాలీఫ్లవర్ తింటున్నారా.. ఇక అంతే సంగతి..

Unknown Facts About Cauliflower: కాలీఫ్లవర్ (ఫూల్‌గోభి) దాదాపు ప్రతి సీజన్‌లో మార్కెట్లో లభించే కూరగాయ. భారత దేశంలో కాలీఫ్లవర్ కు ప్రత్యేక గుర్తింపు ఉంది ఎందుకంటే దీనిని వినియోగించే వారి సంఖ్య చాలా అధికం. కొందరు కాలిఫ్లవర్ ను మంచురియాకు వినియోగిస్తే.. మరికొందరైతే ఆహార రుచిని పెంచుకునేందుకు వినియోగిస్తారు. ఏ ఆహార పదార్థాలైన అతిగా తినడం వల్ల శరీరానికి తీవ్ర దుష్ప్రభావాలు కలిగే అవకాశాలు ఉన్నాయి. అయితే కాలీఫ్లవర్ ను కూడా అతిగా తినడం వల్ల తీవ్ర అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. వీటిని అతిగా తీసుకోవడం వల్ల శరీరానికి ఎలాంటి అనారోగ్య సమస్యలు వస్తాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం..

కాలీఫ్లవర్ ను అతిగా తీసుకుంటే ఈ అనారోగ్య సమస్యలు తప్పవా.?
కాలీఫ్లవర్ లో కాల్షియం, ఫాస్పరస్, ప్రొటీన్, కార్బోహైడ్రేట్లు, ఐరన్, విటమిన్లు A, B, C, అయోడిన్, పొటాషియం అధిక పరిమాణంలో లభిస్తుంది. వీటిని క్రమం తప్పకుండా తినడం వల్ల శరీరానికి ప్రయోజనాలు కలుగుతాయి. కానీ చాలామంది వీటిని విచ్చలవిడిగా తింటున్నారు. ఇలా తినడం వల్ల ఈ క్రింది అనారోగ్య సమస్యలు వస్తాయి. 

శీతాకాలంలో కాలీఫ్లవర్ ను అతిగా తినడం వల్ల కిడ్నీలలో రాళ్ల సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా ఇప్పటికే రాళ్ల సమస్యతో బాధపడుతున్న వారికి తీవ్రనొప్పి ఇతర సమస్యలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి రాళ్ల సమస్యలతో బాధపడుతున్న వారు కాలీఫ్లవర్ ను అతిగా తినకపోవడం చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు భావిస్తున్నారు.

దీనిని అతిగా తినడం వల్ల పొట్టలో గ్యాస్ ఇతర అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా శీతాకాలంలో నైతే పొట్ట సమస్యలతో బాధపడుతున్న వారు వీటితో తయారు చేసిన ఆహార పదార్థాలు తినకపోవడం చాలా మంచిది. అయితే ఇది యూరిక్ యాసిడ్ సమస్యలకు కూడా దారి తీయొచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

థైరాయిడ్ సమస్యలతో బాధపడుతున్న వారికి కాలీఫ్లవర్ ఆహారంలో తీసుకోవడం అంత మంచిది కాదని ఆరోగ్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇందులో ఉండే కొన్ని మూలకాలు థైరాయిడ్ సమస్యను పెంచే అవకాశాలు ఉన్నాయి కాబట్టి తప్పకుండా ఈ వ్యాధితో బాధపడుతున్న వారు వీటితో తయారుచేసిన ఆహారాలను తీసుకోకపోవడం చాలా మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.

కాలీఫ్లవర్ ప్రయోజనాలు ఇవే:
కాలీఫ్లవర్ లో యాంటీ ఆక్సిడెంట్ల పరిమాణాలు అధికంగా ఉంటాయి. కాబట్టి వీటిని క్రమం తప్పకుండా ఆహారంలో తినడం వల్ల గుండెకు చాలా రకాల ప్రయోజనాలను చేకూర్చుతాయి. అంతేకాకుండా ఇందులో ఉండే గుణాలు శరీరంలోని ఎముకలను బలోపేతం చేయడానికి సహాయపడతాయి. కాబట్టి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు ముఖ్యంగా గుండె వ్యాధులు ఉన్నవారు తప్పకుండా కాలీఫ్లవర్ ను ఆహారం తీసుకోవాల్సి ఉంటుంది.

బరువు తగ్గాలనుకునే వారికి కూడా కాలీఫ్లవర్ ప్రభావవంతంగా సహాయపడుతుంది. ఇందులో ఉండే గుణాలు శరీరంలోని కొలెస్ట్రాల్ను తగ్గించేందుకు దోహదపడతాయి. అంతేకాకుండా ఇందులో ఫైబర్ కంటెంట్ కూడా అధికంగా ఉంటుంది కాబట్టి శరీర బరువును సులభంగా నియంత్రిస్తాయి.

Also Read : Dhamaka Twitter Review : ధమాకా ట్విట్టర్ రివ్యూ.. అవుట్ డేటెడ్ స్టోరీ కానీ!

Also Read : 18 Pages Movie Twitter Review: 18 పేజెస్ ట్విట్టర్ రివ్యూ.. సినిమా హిట్టా, ఫట్టా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News