Side Effects Of Turmeric Milk: పసుపు మరియు పాలు రెండూ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. ఈ రెండు కలిపి తీసుకోవడం కూడా బాడీకి చాలా మంచిది. ఈ పాలలో చాలా పోషకాలు ఉంటాయి. పసుపు పాలు ఎన్నో రకాల వ్యాధులను నయం చేస్తుంది. అయితే ఈ పసుపు పాలు కొందరికి హాని చేస్తాయి. ఈ సమస్యలు ఉన్నవారు పసుపు పాలు అస్సలు తాగకూడదు. ఒక వేళ తీసుకున్నారంటే అనారోగ్యం కొనితెచ్చుకున్నట్లే.
ఇలాంటి వారు పసుపు పాలు తాగకూడదు
1. కడుపు నొప్పి ఉన్నవారు..
ఉదర సంబంధిత సమస్యలతో బాధపడేవారు పసుపు పాలు తాగకూడదు. ఎందుకంటే ఇది శరీరంలో గ్యాస్‌తోపాటు వేడి కూడా పెంచుతుంది. దీని వల్ల జీర్ణక్రియ సరిగ్గా అవ్వదు. పసుపులో ఉండే కర్కుమిన్ కారణంగా మీరు అతిసారం బారిన పడే అవకాశం ఉంది. వాంతులు కూడా అవ్వచ్చు.
2. సంతానం లేని పురుషులు..
పెళ్లి అయిన ప్రతి వ్యక్తి తండ్రి కావాలనుకుంటాడు. ఒక వేళ మీరు పసుపు పాలు తీసుకుంటే అది మీ స్పెర్మ్ నాణ్యతను తగ్గిస్తుంది. దీని కారణంగా మీకు సంతానోత్పత్తి కలగకపోవచ్చు.
3. కాలేయం, గాల్ బ్లాడర్ వ్యాధితో బాధపడుతున్న వారు
కాలేయం మరియు పిత్తాశయం రెండూ మన శరీరంలో చాలా ముఖ్యమైన భాగాలు. లివర్ మరియు గాల్ బ్లాడర్ సమస్యలతో బాధపడేవారు పసుపు పాలుకు దూరంగా ఉండాలి, లేకపోతే మీ సమస్య మరింత పెరుగుతుంది
4. గర్భిణీ స్త్రీలు దూరంగా ఉండాలి
గర్భిణీ స్త్రీలు పసుపు పాల అస్సలు తాగకూడదు. ఇది గర్బాశయంపై చెడు ప్రభావాన్ని చూపుతుంది. అంతేకాకుండా రక్తస్రావ సమస్యలకు దారి తీస్తుంది.
(Disclaimer: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు మరియు సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దీనిని స్వీకరించే ముందు వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)
Also Read: Summer food: ఎండాకాలంలో వేడిని తగ్గించే ఆహారాలు ఇవే..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook