Facials at Home: ప్రతి రెండు వారాలకి.. ఒకసారి పార్లర్ కి వెళ్లి వేలకి వేలు డబ్బులు వదిలించుకోవడం కంటే ఇంట్లోనే సులువుగా ఈ ప్యాక్స్ చేసుకుని.. ట్రై చేస్తే చాలా మంచిది. వీటిల్లో ఎటువంటి కృత్రిమ రంగులు, రసాయనాలు ఉండవు.. కాబట్టి ఎటువంటి భయం లేకుండా చాలా త్వరగా వీటిని తయారు చేసుకోవచ్చు.
బేసన్ ప్యాక్:
శనగపిండి మన చర్మానికి చాలా మంచిది. ఇది రంధ్రాలను శుభ్రం చేసి ముఖం తిరిగి.. కాంతులీనేలా చేస్తుంది. దీనిలో కొద్దిగా పెరుగు చేరిస్తే ట్యాన్ తొలగించడానికి కూడా బాగా సహాయపడుతుంది.
రోజ్ వాటర్ - సాండల్‌వుడ్ ప్యాక్:
సాండల్‌వుడ్ చర్మాన్ని చల్లబరుస్తుంది. రోజ్ వాటర్ కి కూడా అవే.. లక్షణాలు ఉంటాయి. రెండు టేబుల్ స్పూన్స్ సాండల్‌వుడ్ పౌడర్, ఒక టేబుల్ స్పూన్ రోస్ వాటర్ కలపండి. దీనిని చర్మానికి రుద్ది.. ఒక 10 నిమిషాలు ఆరనిచ్చాక ముఖాన్ని కడగండి.
పప్పాయా ప్యాక్:
పప్పాయా లో విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండటంతో.. అవి మన చర్మాన్ని ప్రకాశవంతంగా చేస్తాయి. బాగా పండిన పప్పాయా ముక్కలను బాగా మెత్తగా చేసి కొద్దిగా తేనె, పాలు కలపండి. ముఖానికి, మెడకు రాసి ఆరాక కడిగేయండి.
కుంకుమపువ్వు ప్యాక్:
కుంకుమపువ్వు చర్మాన్ని మెరిపించడానికి బాగా ఉపయోగపడుతుంది. 3-4 కుంకుమపువ్వు రేకులు.. గోరువెచ్చని పాలలో రాత్రంతా నానబెట్టండి. మరుసటి రోజు కొబ్బరి నూనె లేదా పెరుగును కలపండి. ముఖానికి అప్లై చేసుకుని ఆరిపోయాక కడిగేయండి.
కీరా ప్యాక్:
కీరా చర్మానికి కావాల్సిన తేమను అందించి డీ హైడ్రెట్ అవ్వకుండా చేస్తుంది. కొద్దిగా చల్లని కీరాను ముక్కలుగా చేసి ఒక టీ స్పూన్.. చక్కెర కలపండి. ఈ మిశ్రమాన్ని ముఖానికి.. రాసి పొడిబారనివ్వండి. తర్వాత చల్లటి నీటితో కడగండి.
అలొవేరా ఫేస్ మాస్క్
అలొవేరా చర్మం నుండి అదనపు నూనెను తొలగిస్తుంది. మంచి పోషణ ఇస్తుంది. తాజా అలొవేరా జెల్, పసుపు, నిమ్మరసం బాగా కలిపి ఆ మిశ్రమాన్ని చర్మానికి రాయాలి. బాగా ఆరాక ముఖాన్ని కడగండి.
టీ ట్రీ ఆయిల్ ఫేస్ ప్యాక్:
టీ ట్రీ ఆయిల్ పింపుల్స్ తగ్గించడంలో.. చాలా బాగా పనిచేస్తుంది. ఒక టేబుల్ స్పూన్ చార్కోల్ పొడి, 1-2 చుక్కలు టీ ట్రీ ఆయిల్, ఒక టేబుల్ స్పూన్ నీరు కలపండి. ముఖానికి రాసుకోండి. పొడిబారాక చల్లటి నీటితో కడగండి.
కాఫీ ప్యాక్:
కాఫీ చర్మాన్ని మెరిసేలా చేస్తుంది. రక్త ప్రసరణను కూడా పెంచుతుంది. ఒక టేబుల్ స్పూన్ కాఫీ, రెండు టేబుల్ స్పూన్స్ చల్లని పాలు కలపండి. ముఖానికి రాసి పొడిబారనివ్వండి. తర్వాత చల్లటి నీటితో కడగండి.
ఓట్స్-తేనె ప్యాక్:
ఓట్స్ కూడా చర్మానికి చాలా మంచిది. తేనె, పెరుగు చర్మాన్ని.. చాలా మృదువుగా చేస్తాయి. కొద్దిగా వేడి నీటిలో ఓట్స్ పొడి కలపండి. కొంచెం తేనె, పెరుగు కూడా కలిపి ముఖానికి బాగా రుద్దుతూ అప్లై చేయాలి. దానిని పొడిబారనివ్వండి. ఆ తర్వాత కడిగేయండి.
ఈసారి ఎప్పుడైనా మీ ముఖం డల్ గా ఉంది అనిపించినా, గ్లో పోయింది అనిపించినా.. వెంటనే బ్యూటీ పార్లర్ కి వెళ్లకుండా ఇంట్లోనే ఇలా హోమ్ మేడ్ ఫేస్ ప్యాక్ ట్రై చేయండి.
Read more: DSC Aspirants Protest: ఓయూలో హైటెన్షన్.. ఆందోళనకారుల వెంట పడి మరీ అరెస్టులు.. వీడియో వైరల్..
Read more: Rat in Chutney: చట్నీలో చిట్టెలుక ఎంత బాగా ఈత కొడుతుందో చూశారా..?.. వీడియో ఇదిగో..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి