తందూరి టీ.. రుచి చూశారా!

మనం ఇప్పటి వరకు తందూరి రోటీ, తందూరి చికెన్ గురించి విని ఉంటాం.

Last Updated : May 30, 2018, 12:52 PM IST
తందూరి టీ.. రుచి చూశారా!

మనం ఇప్పటి వరకు తందూరి రోటీ, తందూరి చికెన్ గురించి విని ఉంటాం. కానీ తందూరి టీ, తందూరి కాఫీల గురించి వినలేదు. ఈ తందూరి టీ రుచి చూడాలంటే పుణెకు వెళ్లాల్సిందే. అక్కడ ఓ హోటల్‌లో బొగ్గుల కుంపటిలో తేనీటి కుండలను ప్రత్యేకంగా వేడిచేసి.. ఓ మోస్తరుగా తయారైన తేనీటిని కుండల్లో పోయడంతో బుడగలతో టీ బయటకు వచ్చి ప్రత్యేకమైన ఫ్లేవర్‌గా తయారవుతుంది. దీన్ని మరో కప్పు/కుండలో పోసి అందిస్తారు. తమ హోటల్‌లో ప్రత్యేకంగా ఉండే ఈ ఛాయ్‌ను తాగడానికి చాలా మంది వస్తారని.. తాగి ఆస్వాదిస్తారని నిర్వాహకులు తెలిపారు. చాయ్ మాత్రమే కాదు తందూరి కాఫీ కూడా ఈ హోటల్‌లో అందిస్తున్నారు.  

'టీ రుచి కూడా ప్రత్యేకమైంది. తందూరి రుచి కనిపిస్తుంది. ఇంతకు ముందు ఇలాంటి రుచి చూడలేదు. టీ చాలా బాగుంది' అని టీ తాగిన వారు చెబుతున్నారు. సంప్రదాయతకు అధునాతన జోడించి తందూరి టీ తయారీ ఉంటుందని నిర్వాహకులు చెబుతున్నారు. మార్నింగ్ వాక్, ఈవినింగ్ వాక్‌లకు వచ్చేవారు, ఉద్యోగులు, పాదచారులు.. తందూరి టీ తాగుతూ.. పరవశం చెందుతున్నారు.  

 

ఎక్కడ ఉంది: విల్ టెక్ హౌస్, టెక్ సాస్ టవర్స్, జెంసర్ ఖరది, పూణే
సమయం: ఉదయం 6 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు
ధర: 20 రూపాయలు

Trending News