Black Hair Home Remedies: పొడవాటి, ఒత్తుగా ఉండే జుట్టు అందరి కల. దీని కోసం మార్కెట్లో లభించే వివిధ రకాల షాంపూలు, క్రీములు, అధిక కెమికల్స్ కలిగిన హెయిర్ కండీషనర్లను ఉపయోగించడం వల్ల జుట్టు సమస్యలు మరింత పెరుగుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. మరికొంత మంది జుట్టు రాలే సమస్యలతో బాధపడుతుంటారు. దీనికి ఎన్నోరకాల కారణాలు ఉన్నాయి.
జుట్టు పెరగకపోడాని కారణాలు:
ఆహారం: జుట్టు పెరుగుదలకు ప్రోటీన్లు, విటమిన్లు (A, B, C, D, E) ఖనిజాలు చాలా ముఖ్యం. పండ్లు, కూరగాయలు, గింజలు, గోధుమలు, పాలు, గుడ్లు వంటి ఆహారాలను తీసుకోకపోవడం వల్ల జుట్టు సమస్యలు కలుగుతాయి.
ఒత్తిడి: అధిక ఒత్తిడి జుట్టు రాలడానికి ఒక ముఖ్య కారణం. యోగా, ధ్యానం వంటి వాటి ద్వారా ఒత్తిడిని తగ్గించుకోవాలి.
నిద్ర: తగినంత నిద్ర లేకపోవడం వల్ల జుట్టు పెరుగుదల మందగిస్తుంది. రోజుకు 7-8 గంటలు నిద్రించడం చాలా ముఖ్యం.
జన్యువులు: కొంతమందికి జన్యువుల కారణంగా జుట్టు పెరగడం మందగిస్తుంది.
హార్మోన్లు: హార్మోన్ల అసమతుల్యత కూడా జుట్టు రాలడానికి కారణమవుతుంది.
షాంపూలు: అన్ని షాంపూలు అన్ని రకాల జుట్టుకు సరిపోవు. దీని వల్ల జుట్టు బలహీనంగా మారుతుంది.
హెయిర్ స్టైలింగ్: అధిక ఉష్ణం, రసాయనాలు వాడడం వల్ల జుట్టు దెబ్బతింటుంది.
ఈ సమస్యను తగ్గించుకోవడానికి కొన్ని చిట్కాలను పాటించాల్సి ఉంటుంది. ముఖ్యంగా జుట్టుకు ఉపయోగించే ప్రొడెక్ట్స్, క్రీములు, ఇతర పదార్థాలు తగ్గించి సహాజంగా ఇంట్లోనే తయారు చేసుకొనే క్రీములు, షాంపూలను ఉపయోగించాల్సి ఉంటుంది. అయితే ఎలాంటి టిప్స్‌ను పాటించాలి? ఏ పదార్థాలు ఉపయోగించడం వల్ల జుట్టు ఆరోగ్యంగా తయారు అవుతుంది అనేది మనం తెలుసుకుందాం.
కాఫీ పౌడర్, దాల్చిన చెక్క, తేనె వంటి ఇంటి చిట్కాలు జుట్టు పెరుగుదలకు సహాయపడతాయని చాలా మంది నమ్ముతారు. ఈ హెయిర్ మాస్క్‌ను తయారు చేసుకోవడం ఎంతో సులభం.
కావలసినవి:
2 టేబుల్ స్పూన్లు కాఫీ పొడి
1 టేబుల్ స్పూన్ దాల్చిన చెక్క పొడి
2 టేబుల్ స్పూన్లు తేనె
కొద్దిగా నీరు
తయారీ:
ఒక బౌల్లో కాఫీ పొడి, దాల్చిన చెక్క పొడి, తేనె కొద్దిగా నీరు కలిపి మృదువైన పేస్ట్ తయారు చేసుకోండి. ఈ పేస్ట్‌ను మీ తలకు, జుట్టుకు మసాజ్ చేయండి. 30 నిమిషాల పాటు అలాగే ఉంచి, తరువాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోండి. ఇలా చేయడం వల్ల కాఫీలో ఉండే కాఫీన్ జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. దాల్చిన చెక్క రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది, ఇది జుట్టు ఆరోగ్యానికి ముఖ్యం. తేనె జుట్టును మృదువుగా మరియు మెరిసేలా చేస్తుంది.
జుట్టు పెరగడానికి చిట్కాలు:
తల చర్మం శుభ్రంగా ఉంచడం: రోజుకు ఒకసారి తల స్నానం చేయడం మంచిది.
తలకు మసాజ్ చేయడం: తలకు మసాజ్ చేయడం వల్ల రక్త ప్రసరణ మెరుగుపడుతుంది.
హెయిర్ ఆయిల్స్ వాడడం: ఆలివ్ ఆయిల్, నారింజ పండు పై తొక్కల నూనె వంటివి తలకు పట్టించడం వల్ల జుట్టు మృదువుగా, ఒత్తుగా ఉంటుంది.
ఆరోగ్యకరమైన జీవనశైలి: ఆరోగ్యకరమైన ఆహారం, తగినంత నిద్ర, వ్యాయామం చేయడం వల్ల జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది.
గమనిక:
ఈ సమాచారం కేవలం సాధారణ సమాచారం కోసం మాత్రమే. మీకు ఏదైనా ఆరోగ్య సమస్య ఉంటే, తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించండి.
ఇది కూడా చదవండి: 2024 Bajaj Pulsar N250: మార్కెట్లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.