Tomatoes Facts: టామోటో రోజు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

Unknown Facts About Tomatoes In Telugu: టామోటోలను ప్రతి రోజు ఆహారాల్లో వినియోగించడం వల్ల శరీరానికి బోలెడు లాభాలు కలుగుతాయి. దీంతో పాటు దీర్ఘకాలిక వ్యాధులు కూడా రాకుండా ఉంటాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అలాగే శరీరానికి ఇతర ప్రయోజనాలు కూడా కలుగుతాయి. 

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : Oct 2, 2024, 01:27 PM IST
 Tomatoes Facts: టామోటో రోజు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

Unknown Facts About Tomatoes In Telugu: ఏ కూరలోనైనా వాటి రుచిని పెంచుకోవడానికి టామోటోలను వినియోగిస్తారు. ఇవి టెస్ట్‌ను పెంచడమే కాకుండా శరీరానికి బోలెడు లాభాలను అందిస్తాయి. టామోటోల్లో శరీరానికి కావాల్సిన అనేక రకాల పోషకాలు లభిస్తాయి. కాబట్టి ప్రతి రోజు ఆహారాల్లో వినియోగించడం వల్ల బాడీకి తగిన పోషకాలు లభిస్తాయి. అంతేకాకుండా ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ శరీరానికి వివిధ రకాల ప్రయోజనాలను అందిస్తుంది. అలాగే దీర్ఘకాలిక వ్యాధుల నుంచి విముక్తి కలిగించేందుకు కూడా కీలక పాత్ర పోషిస్తుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇవే కాకుండా ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకోండి.

టామోటోలను తినడం వల్ల కలిగే లాభాలు:
గుండె ఆరోగ్యానికి మేలు: 

టామోటోల్లో లైకోపీన్ అనే శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్ పుష్కలంగా లభిస్తుంది. ఇది గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఈ లైకోపీన్ రక్తనాళాలను ఆరోగ్యంగా చేసేందుకు కూడా కీలక పాత్ర పోషిస్తుంది. దీంతో పాటు చెడు కొలెస్ట్రాల్‌ను నియంత్రించేందుకు కూడా ఎంతో సహాయపడుతుంది. అలాగే దీర్ఘకాలిక వ్యాధుల నుంచి విముక్తి కలిగించేందుకు కీలక పాత్ర పోషిస్తుంది. 

క్యాన్సర్: 
టామోటోలోని లైకోపీన్ కొన్ని రకాల క్యాన్సర్ల ప్రమాదాన్ని తగ్గించడానికి కీలక పాత్ర పోషిస్తుంది. దీంతో పాటు ప్రోస్టేట్ క్యాన్సర్, కొలొరెక్టల్ క్యాన్సర్ వంటి నియంత్రించేందుకు ఎంతగానో సహాయపడుతుందని ఆరోగ్య నిపుణులు తెలుపతున్నారు.

చర్మ ఆరోగ్యానికి మేలు: 
టామోటోలు క్రమం తప్పకుండా తినడం వల్ల శరీరానికి తగిన విటమిన్ సి, లైకోపీన్ అందుతుంది. దీని కారణంగా చర్మ ఆరోగ్యంగా ఉంటుంది. అంతేకాకుండా మెరిసేలా కూడా తయారవుతుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అలాగే చర్మాన్ని మృదువుగా చేస్తుంది. ఇవే కాకుండా ఇతర ప్రయోజనాలను కూడా చేకూర్చుతుంది. 

కంటి ఆరోగ్యానికి: 
టామోటోలలో విటమిన్ ఎ పుష్కలంగా ఉంటుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇది కంటి చూపును మెరుగుపరిచి, కంటి ఆరోగ్యాన్ని పెంచుతుంది. అలాగే ఎలాంటి కంటి సమస్యలు రాకుండా రక్షిస్తుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. 

ఇది కూడా చదవండి: 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!

జీర్ణక్రియకు మేలు: 
టామోటోలలో ఫైబర్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఇది జీర్ణక్రియను ఆరోగ్యం చేసి మలబద్ధకాన్ని నివారించడానికి కీలక పాత్ర పోషిస్తుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. దీంతో పాటు జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుంది.

ఇది కూడా చదవండి: 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News