Tomato Beauty Benefits: టమాటాతో 10 నిమిషాలు ఇలా చేస్తే .. రెండురోజుల్లో మంగుమచ్చలు మాయం..

Tomato Beauty Benefits: టమాటాలు ప్రతిరోజూ వంటల్లో వినియోగిస్తాం. ఇది మంచి రంగులో ఉంటుంది. దీని రుచి పుల్లగా ఉంటుంది. అయితే, టమాటాలు మన స్కిన్‌ కేర్‌ రొటీన్లో చేర్చుకోవడం వల్ల కూడా సౌందర్య పరంగా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి.

Written by - Renuka Godugu | Last Updated : Jun 5, 2024, 12:23 PM IST
Tomato Beauty Benefits: టమాటాతో 10 నిమిషాలు ఇలా చేస్తే .. రెండురోజుల్లో మంగుమచ్చలు మాయం..

Tomato Beauty Benefits: టమాటాలు ప్రతిరోజూ వంటల్లో వినియోగిస్తాం. ఇది మంచి రంగులో ఉంటుంది. దీని రుచి పుల్లగా ఉంటుంది. అయితే, టమాటాలు మన స్కిన్‌ కేర్‌ రొటీన్లో చేర్చుకోవడం వల్ల కూడా సౌందర్య పరంగా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ఎందుకంటే టమాటాలో విటమిన్స్, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది ఆరోగ్యంతోపాటు అందానికి సహాయపడుతుంది.

ముఖకాంతి..
టమాటాల్లో సహజసిద్ధమైన యాసిడ్స్‌ ఉంటాయి. ఇది చర్మాన్ని ఎక్స్‌ఫోలియేట్‌ చేసి డల్‌ స్కిన్‌ను కాంతివంతం చేస్తాయి. టమాటాల్లోని ఆస్ట్రిజెంట్‌ గుణాలు ముఖరంధ్రాలను తగ్గించి చర్మం టైట్‌ చేసి ముఖంపై పేరుకున్న అదనపు నూనెను కూడా తగ్గించేస్తుంది.

ఇలా వాడండి..
టమాటాతో ఫేస్‌ మాస్క్‌ తయారీకి ఒక పండిన టమాట, చెంచా పెరుగు, తేనె కలిపి పేస్ట్‌ బాగా కలపాలి. దీన్ని ముఖం, మెడ భాగానికి అప్లై చేసి ఓ 15 నిమిషాలపాటు ఆరనివ్వాలి. ఆ తర్వాత గోరువెచ్చని నీటితో ఫేస్ వాష్‌ చేయాలి. ఇలా చేయడం వల్ల ముఖానికి సహజసిద్ధమైన గ్లో వస్తుంది.

యాక్నే..
టమాటాలోని యాసిడిటీ వల్ల సెబం ఉత్పత్తిని తగ్గించడంలో సహాయపడుతుంది. ph స్థాయిలను సమతులం చేస్తుంది. ఇది యాక్నే అతిగా ఉన్నవారు వినియోగిస్తే ఎఫెక్టీవ్‌గా పనిచేస్తుంది.

వాడే విధానం..
టమాటా జ్యూ్‌లో కొన్ని చుక్కల టీ ట్రీ ఆయిల్‌ వేసి ముఖానికి అప్లై చేయడం వల్ల ముఖంపై దీన్ని ఓవర్‌ నైట్‌ అప్లై చేయడం వల్ల వాపు, మంట సమస్యను తగ్గిస్తుంది. 

ఇదీ చదవండి: హోటళ్లలో తిన్న ఆహారమేకాదు.. ఇలా వండుకుంటే ఇంట్లో వండుకున్నా అనారోగ్యం బారినపడతారు..

ఆయిల్‌ నియంత్రణ..
టమాటాల్లో ఉండే నేచురల్‌ ఆస్ట్రిజెంట్‌ గుణాలు ముఖం పై అదనపు నూనె ఉత్పత్తిని తగ్గిస్తుంది. దీంతో ముఖం కాంతివంతంగా మారుతుంది.

ఇలా వాడండి..
టమాటా జ్యూస్‌తో టోనర్‌లా పనిచేస్తుంది. పచ్చి టమాట రసం, యాపిల్‌ సైడర్‌ వెనిగర్‌ లేదా రోజ్‌ వాటర్‌ కలిపి ముఖానికి టోనర్‌ మాదిరి పనిచేయాలి. మీ ముఖానికి క్లెన్సర్‌లా పనిచేస్తుంది. ఓ కాటన్‌ ప్యాడ్‌ సహాయంతో ముఖానికి అప్లై చేస్తే ముఖంపై రంధ్రాలు తగ్గి, రోజంతా ముఖం మెరిసిపోతుంది.

ఇదీ చదవండి: హోటళ్లలో తిన్న ఆహారమేకాదు.. ఇలా వండుకుంటే ఇంట్లో వండుకున్నా అనారోగ్యం బారినపడతారు..

సన్‌బర్న్‌  ఉపశమనం..
టమాటాలో లైకోపీన్‌ ఉండటం వల్ల ముఖంపై హానికర యూవీ కిరణాల డ్యామేజ్‌ కాకుండా రక్షిస్తుంది. ఇది చర్మాన్ని మృదువుగా మార్చి సన్‌ బర్న్‌ తగ్గిస్తుంది. బాగా పండిన టమాటాను, కీరదోసకాయతో కలిపి బ్లెండ్ చేయాలి. దీన్ని సన్‌బర్న్‌ ప్రదేశంలో అప్లై చేసుకుంటే ముఖానికి హైడ్రేషన్‌ ఇస్తుంది.

యాంటీ ఏజింగ్‌ లాభాలు..
టమాటాల్లో లైకోపీన్‌,విటమిన్‌ సీ వంటి యాంటీ ఆక్సిడెంట్ గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఫ్రీ రాడికల్స్‌ రాకుండా వ్యతిరేకంగా పోరాడతాయి. అంతేకాదు ఇది ఇది త్వరగా వృద్ధాప్య ఛాయలు రాకుండా నివారిస్తాయి. టమాటా గుజ్జులో ఒక స్పూన్‌ ఆలివ్‌ ఆయిల్‌, ఓట్మీల్‌ వేసి ముఖానికి మాస్క్‌లా వేసుకోవాలి. ఓ 20 నిమిషాల తర్వాత ఫేస్ వాష్‌ చేయాలి. (Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది. Zee News Media కి దీనిని ధృవీకరించడం లేదు. )

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News