Hug Day 2022: నేడు హగ్​ డే- మీ ప్రేమను ఇలా వ్యక్తపరచండి!

Hug Day 2022: వాలెంటైన్స్​ వారంలో నేడు హగ్​ డే. మరి ఈ రోజు హగ్​డేను మరింత ప్రత్యేకంగా ఎలా జరుపుకోవచ్చు అనేది ఇప్పుడు చూద్దాం.

Written by - ZH Telugu Desk | Edited by - ZH Telugu Desk | Last Updated : Feb 12, 2022, 11:28 AM IST
  • వాలెంటైన్​ వీక్​లో నేడు ఐదో రోజు
  • హగ్​ డేగా జరుపుకోవడం ఈ రోజు ప్రత్యేకత
  • ప్రియమైన వారిని హత్తుకోవడం ప్రేమను వ్యక్తపరిచే స్పెషల్ డే
Hug Day 2022: నేడు హగ్​ డే- మీ ప్రేమను ఇలా వ్యక్తపరచండి!

Hug Day 2022:ప్రతి ఏటా ఫిబ్రవరి 7 నుంచి 14 వరకు వాలెంటైన్ వీక్​ జరుపుకుంటారు. ఇందులో ఒక్కో రోజుకు ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. ఇందులో ఇవాళ (ఫిబ్రవరి 12) హగ్​ డేగా జరుపుకుంటారు.

మరి హగ్​డేను మరింత అందగా జరుపుకోవడం ఎలాగో ఇప్పుడు చూద్దాం.

టెడ్డీ హగ్​..

మీకు ప్రియమైన ఓ టెడ్డీ బైర్​ గిఫ్ట్​గా ఇచ్చి హగ్​ డే సెలెబ్రేట్ చేసుకోవచ్చు. టెడ్డీని గట్టిగా హత్తుకునేందుకు ఎవరు మాత్రం ఇష్టపడరు.

అందుకే ఇలా గిఫ్ట్ ద్వారా కూడా హగ్​డేని సెలెబ్రేట్ చేసుకోవచ్చు. వేరు వేరు ప్రాంతాల్లో ఉంటూ.. ఒకరిని ఒకరు కలుసుకోలేని ప్రేమికులకు ఇది సరిగ్గా సరిపోతుంది. ఇలా చేయడం వల్ల ఒకరిపై ఒకరికి ఉన్న స్వచ్ఛమైన ప్రేమను వ్యక్తపరిచేందుకు వీలవుతుంది.

టైట్ హగ్..

ఎవరైతో ప్రేమలో ఉంటారో.. వారు ఇలా ప్రయత్నించొచ్చు. ఒకరిని ఒకరు గట్టిగా హత్తుకోవడం ద్వారా.. ఒకరిపై ఒకరికి నమ్మకం పెరుగుతుంది. అంతే కాకుండా.. ప్రపంచంలోనే అత్యంత సంతోషకరమైన క్షణాలను అనుభూతి చెందుతారు.

సైడ్ హగ్​..

ఎవరితోనైనా.. మీరు ప్రేమతో లేకుంటే.. ఈ రోజు వారికి హగ్​ డే శుభాకాంక్షలు తెలపాలనుకుంటే మాత్రం సైడ్ హగ్​ ఇవ్వడం మంచిది. ఇలా చేయడం ద్వారా ఒకరిపై ఎంత కేర్​ చూపిస్తున్నారో తెలియజేయొచ్చు.

ఆశ్చర్యపరుస్తూ హగ్​..

మీ ప్రియమైన వారికి మీ ప్లాన్స్​ గురించి ఏ మాత్రం చెప్పకుండా.. ఓ మధురమైన కౌగిలంతతో ఆశ్చర్యపరచొచ్చు. మీ ప్రియురాలు లేదా ప్రియుడు మిమ్మల్ని మిస్​ అవుతున్నట్లు భావిస్తే.. అలా వెనక నుంచి వచ్చి హత్తుకోవడం ద్వారా వారిలో సంతోషాన్ని కలిగించడంతో పాటు.. అద్భుతమైన అనుభూతిని అందించొచ్చు.

Also read: Bed Room Facts: శోభనం రాత్రి పడక గది గులాబీ పూల రెక్కలతోనే ఎందుకు అలంకరిస్తారో తెలుసా ?

Also read: Valentines Day: వాలెంటైన్ డే అంటే ఒక్కరోజే కాదు..వారం రోజుల వేడుక, అవేంటో చూద్దామా

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News