Petrol Bunk Cheating: బంకుల్లో ఇదొక్కటి గమనిస్తే మోసపోకుండా ఫుల్‌ పెట్రోల్‌ మీ సొంతం

Petrol Trick: బంకుల్లో అనేక మోసాలు జరుగుతుంటాయి. మనం అప్రమత్తత లేకపోతే చెల్లించిన నగదుకు సరిపడా విలువైన ఇంధనం మీ వాహనాల్లో ఉండదు. అందుకే ఎప్పటికప్పుడు బంక్‌ల మోసాలపై అవగాహన పెంచుకోవాలి. తాజాగా బంకుల్లో మరో మార్పు జరిగింది. ఈ మార్పు మీరు తెలుసుకుంటే మీ నగదుకు తగ్గ ఇంధనం మీరు పొందవచ్చు.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Feb 4, 2024, 07:19 PM IST
Petrol Bunk Cheating: బంకుల్లో ఇదొక్కటి గమనిస్తే మోసపోకుండా ఫుల్‌ పెట్రోల్‌ మీ సొంతం

Petrol Bunk Fraud: ఉరుకుల పరుగుల జీవితంలో పరుగులు పెట్టేందుకు మనకు వాహనాల వినియోగం తప్పనిసరి. వ్యక్తిగత వాహనదారులు నిత్యం వాహనాలు వినియోగిస్తుంటారు. వాహనానికి సరిపడా పెట్రోల్‌, డీజిల్‌ కోసం బంకులకు వెళ్తుంటారు. మీకు ఎంత మోతాదులో కావాలో చెప్పి పెట్రోల్‌, డీజిల్‌ పోయించుకుంటారు. అయితే పోసేటప్పుడు అక్కడి మీటర్‌ను గమనించకపోతే మోసపోయినట్టే. బంకుల్లో మీటర్‌లపై ఓ కన్నేసి ఉంచాలి. మొదట ఆ మీటర్‌పై అవగాహన పెంచుకోవాల్సి ఉంది.

Also Read: Most Wanted Escape Prison: జైలు నుంచి మాఫియా కింగ్‌ పరార్‌.. ఎలా అనేది వింటే మీరు పరేషాన్‌ అవుతారు

ఇప్పటికే పెట్రోల్‌, డీజిల్‌ డబ్బులకు తగ్గట్టు రావడంపై కొంత అవగాహన పెంచుకున్నారు. రౌండ్‌ ఫిగర్‌ అంటే రూ.50, 100, 150, 200, 500 ఇలా పోయించుకోవద్దనే అవగాహన వచ్చింది. రూ.60, 90, 120, 170, 230 ఇలా పోయించుకుంటున్నారు. అయితే ఇది మంచి పద్ధతే కానీ. అయితే వాహనదారుల తెలివిని గమనించిన పెట్రోల్‌ బంక్‌ల యజమానులు వాళ్లు కూడా జాగ్రత్త పడుతున్నారు. ఈ విధంగా కూడా మోసాలకు పాల్పడేలా మీటర్‌లలో ఏర్పాట్లు చేసుకుంటున్నారు.

Also Read: Ayodhya Temple BBC: అయోధ్య ఆలయంపై బ్రిటన్‌ పార్లమెంట్‌లో లొల్లి లొల్లి.. తప్పుడు కథనాలపై ఆగ్రహం

ఇవన్నీ కాకుండా అసలు పెట్రోల్‌ బంక్‌ యాజమాన్యాలు మోసాలకు చిక్కకుండా ఫుల్‌ పెట్రోల్‌, డీజిల్‌ పొందాలంటే ఒక చిన్న చిట్కా ఉంది. అది పాటిస్తే మీ నగదుకు తగినంత ఇంధనం వస్తుంది. అదేమిటంటే బంక్‌లపై అవగాహన పెంచుకోవాలి. ప్రస్తుతం బంక్‌ల మీటర్లు అప్‌డేట్‌ అవుతున్నాయి. గతంలో అయితే పది చొప్పున మారుతుండేవి. కొత్తగా వచ్చిన విధానంలో రూ.5 చేరుస్తూ మీటర్‌ తిరుగుతుంది. అంటే 5, 10, 15, 20, 25 ఇలా మీటర్‌లో రూపాయి మారుతుంటుంది. ఇలా మీటర్‌లలో ఐదు చొప్పున మారే బంక్‌లు కొత్త మీటర్‌ విధానం అమలు చేస్తున్నాయని గ్రహించాలి. దీని ద్వారా మనం వెచ్చించిన నగదుకు తగ్గట్టు ఇంధనం వస్తుంది. 

రూ.10,20,30 కలుపుతూ మీటర్ తిరిగితే ఆ బంకుల్లో మోసం జరుగుతుందని గ్రహించాలి. పది రూపాయల చొప్పున మారే బంకుల్లో అసలు పెట్రోల్‌, డీజిల్‌ కొట్టించుకోవద్దు. ఈ మోసాలు పాత పెట్రోల్‌ బంకుల్లో జరుగుతున్నాయి. కొత్త విధానం అమలు చేస్తున్న బంకుల్లో మోసం జరగడం లేదు. అందుకే మీరు బంకులకు వెళ్లినప్పుడు మీటర్‌లో పది చొప్పున కాకుండా ఐదు చొప్పున మీటర్‌ తిరిగే బంకుల్లోనే ఇంధనం వినియోగించండి. 

పది చొప్పున మీటర్‌ తిరిగే బంకుల వద్దకు వెళ్లకండి. ఒకవేళ వెళ్లినా మీరు మీటర్‌ అప్‌గ్రేడ్‌ చేసుకోలేదని బంక్‌ యాజమాన్యానికి చెప్పండి. మీరు అవగాహన పొందండి.. ఇతరులకు అవగాహన కల్పించండి. అప్‌గ్రేడ్‌ అయిన బంక్‌ల వద్దనే పోయించుకుంటే మీ నగదుకు తగిన విలువ కలిగిన ఇంధనం మీ సొంతమవుతుంది. వినియోగదారుల అవగాహన కోసం కేంద్ర ప్రభుత్వం చాలా కార్యక్రమాలు నిర్వహిస్తోంది. పెట్రోల్‌ మోసాలపై కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న సూచనలు నిత్యం అవగాహన పొందుతుంటే మీ డబ్బుకు తగ్గ ఇంధనం పొందవచ్చు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News