ఈ పిజ్జా ధర 77 లక్షలు

  

Last Updated : Nov 4, 2017, 08:03 PM IST
ఈ పిజ్జా ధర 77 లక్షలు
మీరు పిజ్జా అభిమానులా.. అయితే ఈ వార్త మీకు తప్పకుండా తెలియాల్సిందే. పిజ్జా అనేది తొలుత ఇటలీలోనే తయారైంది. ఇప్పుడు అదే ఇటాలియన్ వంటల నిపుణులు మరో అడుగు ముందుకు వేసి ఒక ప్రయోగం చేశారు. 
 
ప్రపంచంలోనే ఖరీదైన పిజ్జా తయారుచేసేందుకు శ్రీకారం చుట్టారు. లూయిస్ 13 పేరుతో తయారయ్యే ఈ పిజ్జా క్రస్ట్‌ను ఆర్డరుకి దాదాపు 72 గంటల ముందు ప్రత్యేకంగా తయారుచేస్తారు.
 
రెమీ మార్టిన్ లూయిస్ 13 అనే ఖరీదైన బ్రాందీని ఉపయోగించి ఈ పిజ్జాని ప్రత్యేకమైన పద్ధతుల ద్వారా తయారుచేయడం వల్ల ఒక అద్భుతమైన టేస్టు వస్తుందట. ఆ టేస్టును రుచి చూడాలంటే మాత్రం... డబ్బులు మాత్రం దండిగా ఉండాల్సిందే.
 
20 సెంటీమీటర్ల చుట్టుకొలతతో ఇద్దరికి సరిపోయే ఈ పిజ్జాని.. ముగ్గురు నిష్ణాతులైన ఇటాలియన్ వంటగాళ్లు తయారుచేయడానికి మూడు రోజులు తీసుకుంటారట. ఈ పిజ్జాలో వాడే దినుసులు మాత్రం ఫ్రాన్స్ నుండి రప్పిస్తారు.
 
ఈ నాన్ వెజ్ పిజ్జాలో వాడే సీఫుడ్‌ మెడిటేరియన్ సముద్రం నుండి మాత్రమే వస్తుంది. అలాగే ఈ పిజ్జాలో వాడే పింక్ సాల్ట్‌ను ఆస్ట్రేలియాలోని ముర్రే నది నుండి మాత్రమే రప్పిస్తారు. అలాగే ఈ పిజ్జాపై అలంకరణ చేయడానికి కూడా ఒక టీమ్ ఉంది. 
 

Trending News