Vitamin A Deficiency Symptoms: శరీరం దృఢంగా ఉండాలి అంటే అనేక రకాల విటమిన్‌లు అవసరం. అందులో విటమిన్ ఎ ఒకటి. విటమిన్ ఎ శరీరానికి అవసరమైన పోషకం. దీనిని వల్ల అవయవాలకు ఎంతో మేలు కలుగుతుంది. విటిమిన్ ఎ కంటి చూపు మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ముఖ్యంగా రెటీనాలోని ఒక ముఖ్యమైన భాగమైన రెటినల్ ను తయారు చేయడంలో సహాయపడుతుంది, ఇది కాంతిని విద్యుత్ సంకేతాలుగా మార్చడానికి అవసరం, ఇది మెదడు ద్వారా చిత్రాలుగా అర్థం చేసుకోబడుతుంది.
అంతేకాకుండా రోగనిరోధక శక్తిని పెంచడంలో కీలక ప్రాత పోషిస్తుంది. ఇది ఇన్ఫెక్షన్లతో పోరాడటానికి మనకు సహాయపడుతుంది. విటమిన్ ఎ చర్మ కణాల పెరుగుదల, పునరుత్పత్తికి అవసరం, ఇది ఆరోగ్యకరమైన చర్మాన్ని కాపాడుకోవడంలో సహాయపడుతుంది. గర్భధారణ సమయంలో విటమిన్ ఎ చాలా అవసరం ఇది పిండం సరైన అభివృద్ధికి అవసరానికి ముఖ్యంగా దాని కళ్ళు, నరాలకు ఉపయోగపడుతుంది. అయితే కొన్ని సార్లు మన శరీరంలో విటమిన్ లోపం తలెత్తతుతంది. విటమిన్ ఎ లోపంను ఎలా గుర్తించాలి అనేది మనం తెలుసుకుందాం.
విటమిన్ ఎ లోపం లక్షణాలు:
శరీరంలో విటమిన్ లోపం వల్ల అనారోగ్య సమస్యలు కలుగుతాయి. లోపంను వెంటనే గుర్తించి చికిత్స పొందడం చాలా అవసరం. అయితే విటమిన్ ఎ లోపం కలిగినప్పుడు మీరు ఈ లక్షణాలను గుర్తించుకోవాల్సి ఉంటుంది.
విటమిన్ ఎ లోపం కారణంగా రాత్రి పూట కళ్ళు తక్కువ కాంతిలో చూడటంలో ఇబ్బంది కలుగుతుంది. అలాగే కంటిలో తీవ్రమైన వాపు కలుగుతుంది. ఇది శాశ్వత దృష్టి కోలిపోడం జరుగుతుంది. అంతేకాకుండా అంధత్వానికి దారి తీస్తుందని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. అయితే కాకుండా న్యూమోనియా వంటి తీవ్రమైన శ్వాసకోశ ఇన్ఫెక్షన్ల్‌కు కూడా కలిగే ప్రమాదం ఉంటుంది. వేసవికాలంలో విటమిన్ ఎ కారణంగా విపరీతమైన డీహైడ్రేషన్ సమస్య, పోషకహార లోపం వంటి సమస్యలు తలెత్తుతాయి. చాలా మంది పిల్లలు అతిసారం వల్ల డీహైడ్రేషన్ బారిన పడుతుంటారు. అలాగే చర్మం సమస్యలు కూడా కలుగుతాయి. చర్మం పొడిబారడం, పగులు, దురద వంటి సమస్యలు కలుగుతాయి. రోగనిరోధక శక్తి తగ్గినప్పుడు తరుచుగా జలుబు, దగ్గు, జ్వరం వంటి సమస్యలు కలుగుతాయి.దీనికి కారణం విటమిన్ ఎ లోపం. విటమిన్ ఎ ఉన్న ఆహారపదార్థాలను తీసుకోవడం వల్ల ఈ సమస్య తగ్గుతుంది.
విటమిన్ ఎ లోపం వల్ల కలిగే ప్రమాదాలను నివారించడానికి:
విటమిన్ ఎ లోపం ఉన్నవారు కొన్ని పండ్లు, కూరగాయలను తీసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా క్యారెట్, బచ్చలికూర, చిలగడదుంపలు, గుడ్డు, పాలు, యాపిల్ తీసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా విటమిన్ ఎ సప్లిమెంట్ తీసుకోవాలనుంటే మీరు ముందుగా వైద్యుడిని కలవాల్సి ఉంటుంది. పిల్లలు విటమిన్ ఎ లోపంతో ఇబ్బంది పడుతుంటే వారికి డైట్ ప్లాన్‌ను పాటించడం చాలా అవసరం. వీటితో పాటు అనేన పోషకాలు కలిగిన ఆహారపదార్థాలను కూడా తీసుకోవాల్సి ఉంటుంది.
అతిగా విటమిన్ ఎ తీసుకోవడం వల్ల అనారోగ్య సమస్యలు కలుగుతాయి. కాబట్టి వైద్యుడి తెలిపిన పద్ధతిలో మీరు విటమిన్ ఎ తీసుకోవడం చాలా మంచిది.
Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి