Weight Loss Tips With Dates: ఖర్జూరాలు చాలా రుచికరమైన పండ్లు మాత్రమే కాకుండా, అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంటాయి. వీటిని బరువు తగ్గడానికి కూడా ఉపయోగించవచ్చని చాలామంది నమ్ముతారు. ఖర్జూరం అనేది ఎడారి ప్రాంతాల్లో పెరిగే ఒక రకమైన తీపి పండు. ఇది పోషకాలతో నిండి ఉంటుంది. ఇందులో విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్‌తో నిండి ఉంటాయి. ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ఎక్కువ సేపు నిండుగా ఉంచుతుంది. ఖర్జూరాలు సహజంగా చక్కెరను కలిగి ఉంటాయి. ఇవి మన శరీరానికి వెంటనే శక్తిని అందిస్తాయి. అందుకే వ్యాయామం చేసే ముందు లేదా తర్వాత ఒకటి రెండు ఖర్జూరాలు తినడం వల్ల శక్తి స్థాయిలు పెరుగుతాయి. ఇందులో ఉండే ఫైబర్ మన జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది, మలబద్ధకం వంటి సమస్యలను తగ్గిస్తుంది. ఖర్జూరాలలో పొటాషియం అధికంగా ఉంటుంది. ఇది రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది. అంతేకాకుండా, ఖర్జూరాలలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. ఖర్జూరాలలో కాల్షియం, మెగ్నీషియం వంటి ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఎముకలను దృఢంగా తయారు చేస్తుంది. అయితే అధిక బరువు ఉన్నవారు కూడా ఈ ఖర్జూరాన్ని తినడం వల్ల శరీరంలో ఉండే కొవ్వు తగ్గుతుంది.
ఖర్జూరం బరువు ఎలా తగ్గిస్తుంది:
ఖర్జూరాలలో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఫైబర్ మనల్ని ఎక్కువ సేపు నిండుగా ఉంచుతుంది. దీని వల్ల మనం తినే ఆహారం తగ్గుతుంది. ఇవి శరీరంలో ఉండే కొవ్వును కరిగించడంలో మేలు చేస్తుంది. ఖర్జూరాలను మితంగా తీసుకోవాలి. ఒక రోజుకు 2-3 ఖర్జూరాలు సరిపోతాయి. ఖర్జూరాలతో పాటు ఇతర ఆరోగ్యకరమైన ఆహారాలను కూడా తీసుకోవాలి. ఖర్జూరం నేరుగా తినడానికి ఇష్టపడనివారు దీని నీటిని పరగడుపును తీసుకోవడం మంచిది. అయితే ఇవి ఒక అద్భుతమైన ఆహారం కాదు. బరువు తగ్గడానికి సమగ్రమైన విధానం అవసరం. ఖర్జూరాలను ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల బరువు తగ్గడం లక్ష్యాన్ని సాధించడానికి సహాయపడుతుంది.
ఖర్జూరాలను నీటిలో ఎలా నానబెట్టాలి:
రాత్రి పూట 4-5 ఖర్జూరాలను ఒక గ్లాసు నీటిలో నానబెట్టండి.
ఉదయం లేచిన వెంటనే ఈ నీటిని తాగి, నానబెట్టిన ఖర్జూరాలను తినండి. ఇలా వారంలో రెండు సార్లు చేస్తే శరీరంలో ఉండే కొవ్వు తగ్గుతుంది.
గమనిక: ఈ సమాచారం కేవలం సాధారణ సమాచారం కోసం మాత్రమే. ఏదైనా ఆరోగ్య సమస్య ఉంటే మీ వైద్యుడిని సంప్రదించండి.
Also Read: Trump vs Kamala Harris: అమెరికా అధ్యక్ష పదవి రేసులో ఎవరు గెలిస్తే భారతీయులకు మేలు జరుగుతుంది..?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.
Dates: ఖర్జూరం పండు .. సీక్రెట్ తెలిస్తే అసలు వదలరు...