Tamarind Chutney Recipe: చింతపండుతో తయారు చేసిన ఆహారాలు ప్రతి రోజు తినడం వల్ల శరీరానికి బోలెడు లాభాలు కలుగుతాయి. చింతపండులో విటమిన్ సి, విటమిన్ బి కాంప్లెక్స్, విటమిన్ కె అధిక పరిమాణంలో లభిస్తాయి. అంతేకాకుండా ఇందులో కాల్షియం, ఫాస్ఫరస్, పొటాషియం, మెగ్నీషియం కూడా అధిక మోతాదులో లభిస్తాయి. కాబట్టి ఆహారాల్లో క్రమం తప్పకుండా చింతపండును తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అంతేకాకుండా పొట్ట సమస్యలు కూడా రాకుండా ఉంటాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అయితే చాలా మంది చింతపండుతో తయారు చేసిన చట్నీని తినేందుకు ఇష్టపడతారు. ఈ చట్నీని తినడం వల్ల కూడా శరీరానికి బోలెడు లాభాలు కలుగుతాయి. అయితే దీనిని ఎలా తయారు చేసుకోవాలో? కావాల్సిన పదార్థాలేంటో ఇప్పుడు తెలుసుకోండి.
కావలసిన పదార్థాలు:
చింతపండు - 1 ముద్ద
పచ్చిమిరపకాయలు - 5-6
వెల్లుల్లి రెబ్బలు - 4-5
ఉప్పు - రుచికి తగినంత
ఆవాలు - 1/2 టీస్పూన్
జీలకర్ర - 1/4 టీస్పూన్
కరివేపాకు - కొన్ని రెబ్బలు
నూనె - 1 టేబుల్ స్పూన్
తయారీ విధానం:
ముందుగా ఈ చట్నీని తయారు చేసుకోవడానికి చింతపండును గోరువెచ్చటి నీటిలో 15 నుంచి 20 నిమిషాల పాటు నానబెట్టుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత అందులో నుంచి గింజలు తీసి.. పక్కన పెట్టుకోవాల్సి ఉంటుంది.
ఆ తర్వాత మిక్సీ జార్‌లో నానబెట్టిన చింతపండు, పచ్చిమిరపకాయలు, వెల్లుల్లి రెబ్బలు, ఉప్పు వేసి మెత్తగా మిక్సీ చేసుకోవాల్సి ఉంటుంది.
ఇలా మిశ్రమం తయారు చేసుకున్న తర్వాత ఒక పాత్ర నూనె వేసుకుని వేడి చేసి.. అందులో ఆవాలు, జీలకర్ర వేసి చిటపటలాడేవరకు వేయించాల్సి ఉంటుంది.
ఆ తర్వాత రుచికి తగినంత ఉప్పు వేసి కాస్త పులుపు వేసుకుని బాగా మరిగించుకోండి. ఆ తర్వాత అందులోనే ఎండు మిరపకాయలు వేసుకుని ఉడికించుకోవాల్సి ఉంటుంది.
ఇలా తయారు చేసిన చట్నీని ఇడ్లీ లేదా అన్నంలోకి చాలా బాగుంటుంది.
చిట్కాలు:
చింతపండు పులుపు మీరు ఎంత ఇష్టపడతారో.. అంత వేసుకుని మరిగించుకోవడం చాలా మంచిది.
ఈ చింతపండు పులుసులో కాస్త మసాలాలు కూడా వేసుకోండి. ఇలా వేసుకుంటే రుచి చాలా అద్భుతంగా ఉంటుంది.
ఈ చింతపండు చట్నీ మరింత రుచి పెంచుకోవడానికి మీక్సీ పట్టుకోవడం చాలా మంచిది.
ఇదీ చదవండి: మాజీ మంత్రి ఎన్సీపీ లీడర్ బాబా సిద్ధిఖీ దారుణ హత్య.. సల్మాన్ ఖాన్‌కు ఈ మర్డర్‌తో ఉన్న లింక్ అదేనా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.