Healthy Drinks: రోజంతా నీరసం ఎక్కువగా ఉంటోందా, హెల్తీ డ్రింక్స్‌తో ఇన్‌స్టంట్ ఎనర్జీ

Healthy Drinks: ఆధునిక జీవనశైలిలో తరచూ అనారోగ్యం, తీవ్రమైన అలసట, రోగ నిరోధక శక్తి లోపించడం వంటి సమస్యలు సర్వ సాధారణంగా మారిపోయాయి. అయితే కొన్ని హెల్త్ డ్రింక్స్‌తో ఈ సమస్యల్నించి ఉపశమనం పొందవచ్చంటున్నారు ఆరోగ్య నిపుణులు.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Sep 25, 2022, 10:29 PM IST
Healthy Drinks: రోజంతా నీరసం ఎక్కువగా ఉంటోందా, హెల్తీ డ్రింక్స్‌తో ఇన్‌స్టంట్ ఎనర్జీ

Healthy Drinks: ఆధునిక జీవనశైలిలో తరచూ అనారోగ్యం, తీవ్రమైన అలసట, రోగ నిరోధక శక్తి లోపించడం వంటి సమస్యలు సర్వ సాధారణంగా మారిపోయాయి. అయితే కొన్ని హెల్త్ డ్రింక్స్‌తో ఈ సమస్యల్నించి ఉపశమనం పొందవచ్చంటున్నారు ఆరోగ్య నిపుణులు.

ప్రస్తుత రోజుల్లో మనం తినే ఆహారంలో బలం ఉండటం లేదు. పాతతరం అంటే ఇంట్లో పెద్దవారి ఆరోగ్యం, ఇప్పటి తరం ఆరోగ్యం పోల్చితే..పాతతరం వారిలోనే బలమెక్కువగా కన్పిస్తుంది. దీనికి ప్రధాన కారణం అప్పటి ఆహారానికి ఇప్పటి ఆహారానికి తేడా ఉండటమే. అందుకే తరచూ అనారోగ్యం, తీవ్రమైన అలసట, రోగ నిరోధక శక్తి లోపించడం వంటివి కన్పిస్తున్నాయి. ఈ సమస్యల్నించి ఉపశమనం పొందేందుకు కొన్ని రకాల హెల్త్ డ్రింక్స్ తీసుకోవాలంటున్నారు వైద్య నిపుణులు. ఈ డ్రింక్స్‌లో ఉంటే న్యూట్రియంట్ల కారణంగా ఫుల్ ఎనర్జీ లభిస్తుంది. 

హెల్తీ డ్రింక్స్ ఏం తీసుకోవాలి

అల్లోవెరా జ్యూస్ ప్రతిరోజూ ఉదయం తాగడం ఆరోగ్యానికి చాలా మంచిది. ఆయుర్వేదంలో ఔషధమొక్కగా ప్రాచుర్యం పొందింది. అనాదిగా వివిధ రకాల చికిత్సా పద్ధతుల్లో వినియోగిస్తున్నదే. శతాబ్దాల తరబడి అల్లోవెరా వాడకం ప్రాచుర్యంలో ఉంది. ఇందులో శరీరానికి అవసరమైన న్యూట్రియెంట్లు పుష్కలంగా ఉన్నాయి. అల్లోవెరా జ్యూస్ అనేది ఆరోగ్యానికి, చర్మానికి, కేశ సంరక్షణకు చాలా మంచిది.

కొబ్బరి నీళ్లను అత్యంత ఉత్తమమైన డ్రింక్‌గా చెప్పవచ్చు. ఇది సహజసిద్ధమైన స్వీట్నెస్‌ను కలిగి ఉండటమే కాకుండా హైడ్రేషన్‌పరంగా, శరీరానికి అవసరమైన న్యూట్రియెంట్ల పరంగా చాలా మంచిది. కొబ్బరినీళ్లతో అధిక బరువు సమస్య నుంచి విముక్తి పొందవచ్చు. 

తేనె, దాల్చినచెక్క అనేది ఆరోగ్యానికి చాలా మంచిది. రెండు స్పూన్ల తేనెలో కొద్దిగా దాల్చిన చెక్క పౌడర్ ఓ గ్లాసు నీళ్లలో కలుపుకుని ఉదయం వేళ తీసుకుంటే బెస్ట్ ఎనర్జెటిక్ డ్రింక్‌గా ఉంటుంది. దాల్చినచెక్క గ్రీన్ టీలో చాలా ఆరోగ్యకర ప్రయోజనాలున్నాయి. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. కడుపు నొప్పి సమస్యలు దూరమౌతాయి. 

నిమ్మరసం అనేది ఆరోగ్యానికి అవసరమైన అత్యుత్తమ విటమిన్ సి. ఉదయం వేళ ప్రతిరోజూ క్రమం తప్పకుండా నిమ్మరసం తాగడం వల్ల శరీరం డిటాక్స్ అవుతుంది. టీ, కాఫీలకు మంచి ప్రత్యామ్నాయం కాగలదు. 

దానిమ్మ జ్యూస్ లేదా టీ అనేది ఆరోగ్యానికి చాలా మంచిది. అరకప్పు చిల్డ్ గ్రీన్ టీలో దానిమ్మ జ్యూస్ కలుపుకుని తాగితే మంచి ఫలితాలుంటాయి. రోజూ ఉదయం తీసుకుంటే..ఆ రోజంతా బాగుంటుంది. దానిమ్మతో టీ కూడా చేసుకోవచ్చు.

Also read: Walking Rules: మార్నింగ్ వాక్ ఎలా చేయాలి, ఏ తప్పులు చేయకూడదు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu 

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News