Summer Skin Care Tips: ఎండాకాలంలో ఎదురయ్యే ట్యానింగ్ సమస్య నుంచి ఉపశమనం పొందేందుకు మార్కెట్‌లో చాలా రకాల క్రీమ్స్ ఉంటాయి. వీటితో ఈ సమస్య పూర్తిగా నయం కాదు సరికదా..దుష్పరిణామాలు ఎదురౌతాయి. అయితే ప్రకృతిలో లభించే పదార్ధాలతోనే సహజసిద్ధంగా ఈ సమస్య నుంచి గట్టెక్కవచ్చు. అదెలాగో తెలుసుకుందాం..
ఎండల తీవ్రత రోజురోజుకూ పెరుగుతుండటంతో సూర్య కిరణాలకు ప్రభావితమై ట్యానింగ్ సమస్య ఏర్పడుతుంది. ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు అద్భుతమైన హోమ్ రెమిడీస్ ఉన్నాయి. ముఖ్యంగా కీరా వాటర్ ఇందుకు అద్భుతంగా ఉపయోగపడుతుంది. కీరా వాటర్ ఎండల్నించి కూడా ఉపశమనం కల్గిస్తుంది. కీరాతో ట్యానింగ్ సమస్య చాలా సులభంగా తొలగించుకోవచ్చు. కీరా అనేది ఒక సూపర్ ఫుడ్. ఇందులో 95 ఉండేది నీరే. అందుకే ఆరోగ్యపరంగా చాలా మంచిది. వేసవిలో డీ హైడ్రేషన్ కాకుండా కాపాడుతుంది. కీరా అనేది ఆరోగ్యపరంగానే కాకుండా మీ అందాన్ని కూడా పరిరక్షిస్తుంది. ట్యానింగ్ సమస్యను నిర్మూలించడంలో కీరా వాటర్ చాలా బాగా ఉపయోగపడుతుంది. చర్మం లోపల్నించి హైడ్రేట్ చేయడం వల్ల డ్రై స్కిన్ సమస్య తొలగిపోతుంది. కీరా అనేది యాంటీ ఏజియింగ్ ప్రక్రియలో అద్భుతంగా ఉపయోగపడుతుంది.
కీరా ట్యానింగ్ రిమూవల్ వాటర్ తయారు చేసేందుకు 2 చెంచాల కీరా రసం, స్పూన్ రోజ్ వాటర్ సరిపోతాయి. ముందు ఒక గిన్నె తీసుకుని అందులో కీరా రసం, రోజ్ వాటర్ వేయాలి. ఆ తరువాత ఈ రెండింటినీ బాగా మిక్స్ చేయాలి. అంతే ట్యానింగ్ దూరం చేసే కీరా వాటర్ తయారైనట్టే.
ట్యానింగ్ సమస్యకు కీరా వాటర్ రాసేముందు ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ఆ తరువాత దూది సహాయంతో ఈ కీరా వాటర్ ముఖానికి అప్లై చేయాలి. ఆ తరువాత కాస్సేపు వదిలేయాలి. ఓ 15 నిమిషాలుంచితే మంచిది. తరువాత చల్లని నీళ్లతో వాష్ చేసుకోవాలి. వారంలో 2-3 సార్లు ఇలా చేస్తే మంచి ఫలితాలుంటాయి. ట్యానింగ్ సమస్య చాలా త్వరగా పోతుంది.
Also read: Weight Loss tips: ఈ వెజిటబుల్ సూప్స్ ట్రై చేస్తే వారాల్లోనే అధిక బరువు, బెల్లీ ఫ్యాట్‌కు చెక్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook