Soya Chunks Facts: మీల్‌మేకర్స్‌ తింటే ఏమౌంతుందో తెలుసా? నమ్మలేని ఎన్నో నిజాలు!

Soya Chunks Facts: ప్రతి రోజు మీల్‌మేకర్స్‌ను తినడం వల్ల శరీరానికి బోలెడు లాభాలు కలుగుతాయి. ఇందులో ఉండే గుణాలు దీర్ఘకాలిక వ్యాధుల నుంచి విముక్తి కలిగిస్తుంది. ఇవే కాకుండా ఇతర ప్రయోజనాలను కలిగిస్తుంది.

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : Oct 8, 2024, 04:11 PM IST
Soya Chunks Facts: మీల్‌మేకర్స్‌ తింటే ఏమౌంతుందో తెలుసా? నమ్మలేని ఎన్నో నిజాలు!

Soya Chunks Facts: మీల్‌మేకర్స్‌నే చాలా మంది సోయా చంక్స్‌గా కూడా పిలుస్తారు. దీనిని చాలా మంది శాకాహారులు మాంసానికి బదులుగా వినియోగిస్తారు. ఇందులో శరీరానికి కావాల్సిన ప్రోటీన్‌, ఫైబర్‌ కూడా లభిస్తుంది. అలాగే ఈ మీల్‌మేకర్స్‌లో పోషకాలు కూడా అధిక పరిమాణంలో అందుబాటులో ఉంటుంది. కాబట్టి క్రమం తప్పకుండా ఆహారాల్లో తీసుకోవడం వల్ల శరీరానికి బోలెడు లాభాలు కలుగుతాయి. ఇందులో ఉండే పోషకాలు శరీరానికి ఎలాంటి ప్రయోజనాలను కలిగిస్తుందో ఇప్పడు తెలుసుకోండి.

మీల్‌మేకర్స్‌ తినడం వల్ల కలిగే లాభాలు:
ప్రోటీన్ రిచ్‌: 

మీల్‌మేకర్స్‌లో ప్రోటీన్‌ అధిక పరిమాణంలో లభిస్తుంది. ఇది శరీరానికి కణాల నిర్మాణానికి, మరమ్మతులు, కణజాలాల పెరుగుదలకు కీలక పాత్ర పోషిస్తుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.

గుండె ఆరోగ్యానికి మంచిది: 
మీల్‌మేకర్స్‌లో కొలెస్ట్రాల్ ఉండదు కాబట్టి వీటిని క్రమం తప్పకుండా తినడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. అంతేకాకుండా గుండె సమస్యలు కూడా రాకుండా ఉంటాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అలాగే ఇతర వ్యాధుల ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది. 

బరువు తగ్గడానికి సహాయపడుతుంది: 
మీల్‌మేకర్స్‌లో ఫైబర్‌ అధికంగా ఉంటుంది. ఇది ఆకలిని నియంత్రించేందుకు కీలక పాత్ర పోషిస్తుంది. అంతేకాకుండా బరువు తగ్గాలనుకునేవారు తరచుగా సలాడ్స్‌లో వీటిని చేర్చుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. అలాగే సులభంగా బరువు కూడా తగ్గుతారు. 

ఇదీ చదవండి:  Motorola G85 5G Discount Offer: ఇంత తగ్గింపా? ఫ్లిఫ్‌కార్ట్‌లో రూ.9,200కే Motorola G85 5G మొబైల్‌.. మరెన్నో డిస్కౌంట్‌ ఆఫర్స్‌!

ఎముకల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది:
మీల్‌మేకర్‌లో క్యాల్షియం ఎక్కువగా ఉంటుంది.. ఇది ఎముకల ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అలాగే ఆస్టియోపోరోసిస్ వంటి ఎముకల వ్యాధులను తగ్గించేందుకు కూడా కీలక పాత్ర పోషిస్తుంది.

క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది: 
మీల్‌మేకర్‌లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటుంది. ఇవి కణాలను నష్టం నుంచి రక్షించడానికి సహాయపడతాయి.  కొన్ని రకాల క్యాన్సర్‌ల ప్రమాదాన్ని తగ్గించేందుకు కూడా సహాయపడుతుంది.

ఇదీ చదవండి:  Motorola G85 5G Discount Offer: ఇంత తగ్గింపా? ఫ్లిఫ్‌కార్ట్‌లో రూ.9,200కే Motorola G85 5G మొబైల్‌.. మరెన్నో డిస్కౌంట్‌ ఆఫర్స్‌!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News