Skin Glowing Face Mask: ప్రస్తుతం చాలా మంది మచ్చలేని చర్మాన్ని పొందడానికి మార్కెట్‌లో లభించే చాలా రకాల ప్రోడక్ట్స్ వినియోగిస్తున్నారు. ఖరీదైన సౌందర్య ఉత్పత్తులు వినియోగించినప్పటికీ మెరిసే చర్మాన్ని పొందలేకపోతున్నారు. కాబట్టి చర్మ సమస్యలతో బాధపడుతున్నవారు, చర్మాన్ని మెరిపించుకోవడానికి తప్పకుండా ఆయుర్వేద నిపుణులు సూచించిన పలు చిట్కాలు పాటించాల్సి ఉంటుంది. దీనిని వినియోగించడం వల్ల చర్మంలోని మురికి దూరమవ్వడమేకాకుండా చర్మానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయని ఆయుర్వేద నిపుణులు తెలుపుతున్నారు. ఇలాంటి సమస్యలతో బాధపడుతున్నవారు తప్పకుండా బియ్యం పిండి ఫేస్ మాస్క్ వినియోగించాల్సి ఉంటుంది. ఈ ఫేస్ మాస్క్ ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
బియ్యప్పిండి ఫేస్ మాస్క్ పదార్థాలు:
- 1 టేబుల్ స్పూన్ బియ్యం పిండి
- కప్పు టమోటా రసం
- 1/2 టీస్పూన్ శనగ పిండి
ఈ ఫేస్ మాస్క్ తయారి విధానం:
- బియ్యం పిండి ఫేస్ మాస్క్‌ను తయారు చేయడానికి ముందుగా ఒక గిన్నెను తీసుకోవాల్సి ఉంటుంది.
- ఆ గిన్నెలో బియ్యప్పిండి, టొమాటో రసం, శెనగపిండి వేయాలి.
- ఈ మూడు మిశ్రమాలను బాగా కలుపుకుని మిశ్రమంగా తయారు చేసుకోవాల్సి ఉంటుంది.
- అంతే సులభంగా బియ్యం పిండి ఫేస్ మాస్క్ తయారైనట్లే..
ఈ మాస్క్‌ను ఎలా వినియోగించాలో తెలుసా?:
- ఈ మాస్క్‌ను వినియోగించే ముందు ముఖాన్ని శుభ్రం చేసుకోవాల్సి ఉంటుంది.
- ముఖంతో పాటు మెడపై అప్లై చేసి మసాజ్ చేయాలి.
- ఆ తర్వాత 25 నిమిషాల పాటు ఆరనివ్వాలి.
- తేలికపాటి చేతులతో మీ ముఖాన్ని వృత్తాకారంలో మసాజ్ చేయాలి.
- ఆ తర్వాత ముఖాన్ని గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోండి.
(నోట్: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)
Also read: Shani Jayanti 2023: శని జయంతి రోజు ఈ ఉపాయాలు పాటిస్తే శని దోషం, దుష్ప్రభావాల్నించి ఉపశమనం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook