Skin Cancer Symptoms: ప్రమాదకరంగా మారుతున్న చర్మ క్యాన్సర్‌..ఈ లక్షణాలుంటే క్యాన్సరే..!

Skin Cancer Symptoms: ప్రస్తుతం మారుతున్న జీవన శైలి కారణంగా ప్రపంచంలో క్యాన్సర్ కేసులు నిరంతరం పెరుగుతున్నాయి. ముఖ్యంగా వాటిలో చర్మనికి సంబంధించిన క్యాన్సర్‌ కేసులు పెరగడం అందరినీ గుబులు పుట్టిస్తోంది.

Written by - ZH Telugu Desk | Last Updated : Jun 9, 2022, 01:03 PM IST
  • ప్రమాదకరంగా మారుతున్న చర్మ క్యాన్సర్‌..
  • 49 ఏళ్ల మహిళకు చర్మ క్యాన్సర్
  • స్త్రీలో ఈ క్యాన్సర్‌ చర్మాన్ని పాడు చేస్తుంది
Skin Cancer Symptoms: ప్రమాదకరంగా మారుతున్న చర్మ క్యాన్సర్‌..ఈ లక్షణాలుంటే క్యాన్సరే..!

Skin Cancer Symptoms: ప్రస్తుతం మారుతున్న జీవన శైలి కారణంగా ప్రపంచంలో క్యాన్సర్ కేసులు నిరంతరం పెరుగుతున్నాయి. ముఖ్యంగా వాటిలో చర్మనికి సంబంధించిన క్యాన్సర్‌ కేసులు పెరగడం అందరినీ గుబులు పుట్టిస్తోంది. ఈ క్యాన్సర్‌ చర్మంలో వివిధ భాగాలను పాడు చేస్తుంది. అయితే స్కిన్ క్యాన్సర్‌ ఎలా వస్తుంది..అస్సలు ఈ క్యాన్సర్‌కు కారణాలేంటో తెలుసుకుందాం..

49 ఏళ్ల మహిళకు చర్మ క్యాన్సర్:

'ది సన్' నివేదిక ప్రకారం...బ్రిటన్‌లో చలి తీవ్రత అధికంగా ఉంటుంది. కావున అక్కడి ప్రజలు సన్ బాత్ చేయడం సర్వసాధారణం. యూకేలోని నార్త్ యార్క్‌షైర్‌లో నివసిస్తున్న డెబ్బీ లిండ్లీ (49) అనే మహిళ ఈ చర్మ క్యాన్సర్‌తో బాధపడుతున్నారు. తన కన్ను, చెంప కింద కణితి ఏర్పడి సమస్యగా మారింది.

స్త్రీలో ఈ క్యాన్సర్‌ చర్మాన్ని పాడు చేస్తుంది:

డెబ్బీ లిండ్లీ తన భర్త గ్రాహం వోక్స్, 17 ఏళ్ల కుమార్తె మేగాన్‌తో కలిసి నార్త్ యార్క్‌షైర్‌లోని నారెస్‌బరో ప్రాంతంలో నివసిస్తున్నారు. ఎండలో కూర్చోవడం తనకెప్పుడూ ఇష్టం లేనందునే..ఈ వ్యాధి వచ్చిందని ఆమె పేర్కొంది. స్కిన్ క్యాన్సర్ కారణంగా తన ముఖం వేగంగా మార్పులు వచ్చి చెడిపోయిందని ఆమె తెలిపింది. ఈ కాన్సర్‌ రాక ముందు ఆమె చాలా అందంగా ఉండెనని డెబ్బీ భర్త పేర్కొన్నారు.

డాక్టర్ కంటి కింద దద్దుర్లు గమనించారు:

 క్యాన్సర్‌ బాధితురాలు డెబ్బీ తన కుడి కన్నుపై అలెర్జీ దద్దుర్లు చూపించడానికి 2020 మార్చిలో డాక్టర్‌ను సంప్రదించారని తెలిపారు. ముందుగా డాక్టర్లు దద్దుర్లు చూసి ప్రాథమిక పరీక్ష చేశారని ఆమె పేర్కొన్నారు. ఈ పరీక్షలో బేసల్ సెల్ కార్సినోమా ఉన్నట్లు నిర్ధారణ అయినట్లు వైద్యులు చెప్పారు.

ఆపరేషన్ తర్వాత మహిళ పరిస్థితి బాగానే ఉంది:

స్కిన్‌ క్యాన్సర్‌ అని నిర్ధారణ కావడంతో వెంటనే ఆపరేషన్‌ చేయాలని వైద్యులు సూచించారు. కొన్ని రోజులు క్యాన్సర్‌  పరీక్షలు చేసిన తర్వాత, ఆమెకు శస్త్రచికిత్స చేశారు వైద్యులు. ఇప్పుడు ఈ సర్జరీ తర్వాత ఆమె పరిస్థితి బాగానే ఉందని ఆరోగ్య నిపుణులు వెల్లడించారు.

Also Read: Diabetes Control Tips: డయాబెటిస్ పేషెంట్స్‌ ఈ 4 రకాల కూరగాయలు అస్సలు తినకూడదు..!

Also Read: Isabgol For Weight Loss: ఈసబ్ గోల్ ఊకతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News