Rose Remedies: రోజ్ వాటర్‌లో నేచురల్ గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఇందులో చర్మం, జుట్టుకు కావాల్సిన విటమిన్స్, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. మీ బ్యూటీ రొటీన్లో తప్పక చేర్చుకోండి వాడే విధానం ఇదే..
రోజ్ వాటర్ మంచి చర్మ టోనర్‌గా పనిచేస్తుంది. స్కిన్ పీహెచ్ స్థాయిలు సమతులం చేస్తాయి. అదనంగా పేరుకున్న నూనెను నియంత్రిస్తుంది. చర్మానికి హైడ్రేషన్, మాయిశ్చర్ అందిస్తుంది. దీంతో రోజంతా తాజాదనంతో వెలిగి పోతుంది. ముఖంపై యాక్నే సమర్థవంతంగా తగ్గిస్తుంది. ముఖ్యంగా రోజ్ వాటర్‌లో యాంటీ ఇన్ల్ఫమేటరీ గుణాలు కలిగి ఉంటుంది. ఇది చర్మంపై ఎరుపుదనం కూడా తగ్గిస్తుంది. ప్రభావిత ప్రాంతాల్లో రోజ్ వాటర్‌ను ఓ కాటన్‌లో తీసుకుని అప్లై చేయాలి. ఇలా రెగ్యులర్‌గా చేయడం వల్ల దురదలు కూడా తగ్గిపోతాయి.
జుట్టుకు రోజ్ ఆయిల్..
రోజ్ ఆయిల్‌లో విటమిన్స్ కావాల్సిన ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఇది మంచి పోషణ కూడా అందిస్తుంది. ముఖ్యంగా జుట్టు పొడిబారిన సమస్యలకు ఎఫెక్టీవ్ రెమిడీ. ఇది జుట్టుకు సహజసిద్ధమైన మెరుపును అందిస్తుంది. కొబ్బరినూనె లేదా జోజోబా ఆయిల్‌లో కాస్త రోజ్ ఆయిల్ చుక్కలు వేసి కలిపాలి. దీన్ని జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు బాగా మసాజ్ చేయాలి. తలస్నానం చేసే ముందు ఓ గంట ఇలా చేయడం వల్ల మంచి ఫలితాలు కనిపిస్తాయి. ఆ తర్వాత సాధారణ షాంపూతో తలస్నానం చేయడం వల్ల జుట్టు మృదువుగా మెరుస్తుంది.
గులాబీ రేకులతో స్క్రబ్..
ఎండిన గులాబీ రేకుల్లో ఎక్స్‌ఫోలియేటింగ్ గుణాలు ఉంటాయి. వీటిని బరకగా గ్రైండ్ చేసి పొడి చేసుకోవాలి. దీన్ని తేనె, ఓట్మీల్ వేసి కలుపుకొని స్క్రబ్ చేసుకోవాలి. దీంతో డెడ్ స్కిన్ సెల్స్ తొలగిపోయి, ఓపెన్ పోర్స్ సమస్యలకు చెక్ పెడుతుంది. దీంతో చర్మం మృదువుగా, కాంతివంతంగా మారుతుంది.
బాడీ స్క్రబ్..
గులాబీ ఆకులతో బాడీ స్క్రబ్ కూడా తయారు చేసుకోవచ్చు. కొబ్బరినూనె, చక్కెర, రోజ్ పెటల్స్ వేసి బాడీ స్క్రబ్ తయారు చేసుకోవచ్చు. ఇది కూడా మన శరీరంపై ఉండే డెడ్ సెల్స్ ను తొలగిస్తుంది. గులాబీ రేకులతో స్క్రబ్ చేసుకుంటే పొడిబారే సమస్యలకు ఎఫెక్టీవ్ రెమిడీ. వారానికి ఒకసారి ఇలా చేస్తే మీ చర్మం పట్టులా మెరుస్తుంది.
ఇదీ చదవండి: రేపు టీచర్స్ డే సందర్భంగా మీ ఉపాధ్యాయులకు ఈ 5 బహుమతులుగా ఇవ్వచ్చు..
ఫేస్‌మాస్క్..
రోజ్ వాటర్‌తో ఫేస్ మాస్క్ తయారు చేసుకుంటే చర్మం హైడ్రేటెడ్‌గా ఉంటుంది. కూలింగ్ ఏజెంట్‌లా పనిచేస్తుంది. మంట సమస్యను తగ్గిస్తుంది. యాక్నే కూడా తగ్గిపోతుంది. రోజ్ వాటర్, గంధం కలిపి మాస్క్ తయారు చేసుకోవాలి. లేకపోతే ముల్తానీ మట్టితోపాటుమాస్క్ తయారు చేసుకోవాలి. గోరువెచ్చని నీటితో ఫేస్ వాష్ చేసుకోవాలి.
యాంటీ ఏజింగ్..
రోజ్ వాటర్‌లో యాంటీ ఏజింగ్ గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఇందులో యాంటీ ఆక్సిడెంటు గుణాలు ఉంటాయి. ముఖ్యంగా రోజ్ వాటర్‌లో విటమిన్ ఏ, సీ ఉంటాయి. ముఖంపై ఫైన్ లైన్స్ తొలగిపోతాయి. కొన్ని చుక్కల రోజ్‌హిప్ ఆయిల్ రాత్రి పడుకునే ముందు ముఖం, చర్మంపై మసాజ్ చేయాలి. ఇలా చేస్తే కొల్లాజెన్ ఉత్పత్తికి తోడ్పడుతుంది.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం. వీటిని పాటించే ముందు వైద్య సలహా తీసుకోవాలి. ఈ సమాచారాన్ని Zee Media ధృవీకరించలేదు)
ఇదీ చదవండి: వార్షికోత్సవం సందర్భంగా భారీ ఆఫర్లు ప్రకటించిన జియో.. జొమాటో గోల్డ్ మెంబర్‌షిప్, 10 జీబీ డేటా ఫ్రీ..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.