Acidity Home Remedies: ఈ సింపుల్ చిట్కాలతో అసిడిటీ, మలబద్ధకం ఇక 5 నిమిషాల్లో మాయం..

Rid Acidity Reflux In 5 Minutes: చాలా మంది వివిధ రకాల ఆహారాలు తీసుకుని పొట్ట సమస్యల బారిన పడుతున్నారు. అయితే ఈ సమస్యల నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి పలు ఇంటి చిట్కాలను పాటించాల్సి ఉంటుంది.

Written by - ZH Telugu Desk | Last Updated : Oct 23, 2022, 04:11 PM IST
  • సోంపు, ఏలకులు, తులసి, పుదీనా..
  • తీసుకుంటే అసిడిటీ, మలబద్ధకం..
  • సమస్యలు కేవలం 5 నిమిషాల్లో తగ్గుతాయి
Acidity Home Remedies: ఈ సింపుల్ చిట్కాలతో అసిడిటీ, మలబద్ధకం ఇక 5 నిమిషాల్లో మాయం..

Rid Acidity Reflux In 5 Minutes: ఆధునిక జీవన శైలి కారణంగా చాలా మంది ఆయిల్-స్పైసీ ఫుడ్ అధికంగా తీసుకుంటున్నారు. అయితే ఇలాంటి ఆహారాలు తీసుకోవడం వల్ల బరువు పెరగడం పొట్టలో అసిడిటీ, మలబద్ధకం వంటి సమస్యలు వస్తున్నాయి. అయితే ఈ సమస్యలకు చెక్‌ పెట్టడానికి మార్కెట్‌లో లభించే వివిధ రకాల ప్రోడక్ట్‌ వినియోగిస్తున్నారు. అయినప్పటికీ ఈ సమస్యల నుంచి ఉపశమనం పొందలేకపోతున్నారు. అయితే ఈ సమస్యలను కేలవం 5 నిమిషాల్లో ఇంట్లో లభించే పలు రకాల వస్తువులతో ఉపశమనం పొందవచ్చని నిపుణులు తెలుపుతున్నారు. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

కడుపులో అసిడిటీ, మలబద్ధకం, మంట ఉంటే వీటిని తినండి:

సోంపు:
కడుపులో అసిడిటీ, మంటగా ఉంటే ఉపశమనం పొందడానికి సోపుని వినియోగించవచ్చు. దీనిని తినడం సులభంగా అసిడిటీ, మంట వంటి సమస్యలు తగ్గుతాయి. ముఖ్యంగా వేసవిలో మాంసాహారంతో భోజనం చేసిన తర్వాత సోంపును తీసుకుంటే సులభంగా అన్ని పొట్ట సమస్యలకు చెక్‌ పెట్టొచ్చని నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా పొట్టలో గ్యాస్‌ సమస్యలకు కూడా ఈ సోంపు సహాయపడుతుంది.

ఏలకులు:
పొట్టలో చికాకు, మంట, మలబద్దకం, గ్యాస్‌ సమస్యల నుంచి ఉపశమనం పొందడానికి ఏలకులు ప్రభావవంతంగా సహాయపడతాయి. అంతేకాకుండా నొటిని రిఫ్రెష్ చేసేందుకు కూడా సహాయపడతాయి. కడుపులో యాసిడ్ సమస్య వచ్చినప్పుడల్లా ఏలకులు తింటే సులభంగా తగ్గుతుంది.

తులసి:
తులసిలో ఎన్నో రకాల ఔషధ గుణాలుంటాయి. కాబట్టి దీనిని వివిధ రకాల అనారోగ్య సమస్యలకు వినియోగిస్తారు. అయితే ఈ తులసిని పొట్ట సమస్యలకు కూడా ఉపయోగించవచ్చని ఆయుర్వేద నిపుణులు తెలుతుపున్నారు. కడుపులో మంట, గ్యాస్‌, అసిడిటీ సమస్యలతో బాధపడేవారు ఈ ఆకులను క్రమం తప్పకుండా పచ్చిగా నమిలి తింటే పై సమస్యలన్నింటికీ చెక్‌ పెట్టొచ్చు.

పుదీనా:
కడుపులోని వేడిని తగ్గించడానికి పుదీనా ఆకులు దివ్యౌషధంగా పని చేస్తాయి. అంతేకాకుండా సులభంగా అసిడిటీ సమస్య నుంచి ఉపశమనం కలిగిస్తుంది. పుదీనాలో యాంటీ-ఆక్సిడెంట్, యాంటీ బాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ  అధిక పరిమాణంలో లభిస్తాయి. కాబట్టి ఈ ఆకులను టీల తీసుకున్న సులభంగా పొట్ట సమస్యలకు చెక్‌ పెట్టొచని ఆయుర్వేద నిపుణులు తెలుపుతున్నారు.

Read Also: Happy Birthday Sai Dharam Tej : చావు అంచుల దాకా వెళ్లొచ్చిన మెగాహీరో.. 8 ఏళ్లలో ఎన్ని కోట్లు వెనకేశాడో తెలుసా?

Read Also: White king Cobra: 20 అడుగుల రేర్ వైట్ కింగ్ కోబ్రాని చూసారా..? చూస్తే గూస్ బంప్స్ పక్కా

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook 

 

Trending News