Republic Day 2024 Muggulu: మనం ఈ సంవత్సరం 74వ గణతంత్రం ముగించుకొని 75 వ గణతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా భారతీయులు వారిలో ఉన్న దేశభక్తిని వివిధ రూపాల్లో చాటుకుంటారు ముఖ్యంగా మహిళలైతే ఉదయాన్నే ఇంటి ముందు మూడు రంగులతో కూడిన రంగోలిని వేస్తారు. మరికొంతమంది అయితే ఇంటిని అందంగా త్రివర్ణ పతాకంతో అందంగా అలంకరిస్తారు. ఇక ప్రభుత్వ కార్యాలయాలు పాఠశాలలు ఆసుపత్రులలో మూడు రంగుల థీమ్‌తో కూడిన ముగ్గులను ఎక్కువగా వేస్తూ ఉంటారు. అయితే ఈ సంవత్సరం మీరు కూడా ముందు లేదా కార్యాలయంలో మూడు రంగులతో అందమైన రంగోలిని వెయ్యాలనుకుంటున్నారా? మీ ముందుకు మంచి డిజైన్స్ కలిగిన రంగోలీలను తీసుకువచ్చాము..
సులభంగా ఇంటి ముందు లేదా ఆఫీసులో మూడు రంగుల్లో రంగోలి వేయాలనుకునే వారు.. ఎంతో సులభంగా ఈ జై హింద్ అనే రంగోలిని వేయవచ్చు. దీనిని వేయడానికి ముందుగా హాఫ్ సర్కిల్ తీసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత మూడు గుండ్రని సర్కిల్ వేసుకొని అందులో ఆరెంజ్ వైట్ గ్రీన్ కలర్స్‌ను ఫిల్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత అగ్గిపుల్లతో పువ్వు ఆకారంలో గీసుకోవాల్సి ఉంటుంది. తర్వాత ఫోటోలో ఉన్నట్లు చేతితో మూడు రంగులను కలిపి డిజైన్స్ ను గీయాల్సి ఉంటుంది.
ఈ నెమలి డిజైన్ కలిగిన రంగోలిని మెహందీ డిజైన్‌గా కూడా వేసుకోవచ్చు. ముందుగా ఈ రంగోలిని గీసుకోవడానికి..నెమలి ఆకారంలో ఓ ముగ్గురు వేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత అందులోనే రెండు పెద్ద బాక్సులను వేసుకొని మధ్యలో గుండ్రని సర్కిల్ తీసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత రెండు బాక్సుల్లో మొదటి దాంట్లో ఆరెంజ్ కలర్‌ని ఫిల్ చేసుకొని.. ఆ తర్వాత దాంట్లో గ్రీన్ కలర్ను ఫిల్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత మధ్యలో అశోక చక్రాన్ని బ్లూ కలర్ సుద్ధతో గీసుకోవాలి.
మామూలుగా టైల్స్‌తో కూడిన ప్రదేశాల్లో రంగోలిని వేయడం చాలా కష్టం. కాబట్టి అలాంటి వారి కోసం సులభమైన డిజైన్‌ను తీసుకు వచ్చాం. దీనికోసం ముందుగా ఒక చిన్న గాజుతో కూడిన ప్లేటును తీసుకోవాల్సి ఉంటుంది. అందులో మొదట ఆరెంజ్ కలర్‌తో కూడిన కనకాంబరాలను పేర్చుకోవాలి. ఇందులోనే మధ్యలో ఐదు రెక్కల తెల్లని పువ్వులను పేర్చుకోవాల్సి ఉంటుంది. ఇలా చివరకు గ్రీన్ కలర్‌తో కూడిన పచ్చి ఆకులను కట్ చేసుకుని మధ్యలో ఆపరిజాత పువ్వులను పెట్టుకుంటే సులభంగా అందమైన మూడు రంగుల డిజైన్ రెడీ అయినట్లే..
ఈ రంగోలి చూడడానికి ఎంతో కష్టంగా ఉన్నప్పటికీ దీనిని వెయ్యడం చాలా సులభం. ముందుగా ఈ ఫోటోలో కనిపిస్తున్న బోర్డర్‌తో కూడిన డిజైన్‌ను వేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత చిన్నచిన్నని గుండ్రని సర్కిల్స్ వేసుకుని, అందులో ఎల్లో కలర్‌ని నింపుకోవాల్సి ఉంటుంది. అంతే సులభంగా ఈ ముగ్గు రెడీ అయినట్లే..
Also Read Hacking Accounts: తెలంగాణపై హ్యాకర్ల ముప్పేట దాడి.. గవర్నర్, మంత్రి, కవిత ఖాతాలను వదలని హ్యాకర్లు
త్రివర్ణ రంగుల్లో ఉన్న ఈ స్టార్స్‌తో కూడిన ముగ్గురు వేయడం ఎంతో సులభం.. ముందుగా ఈ ముగ్గుకు సంబంధించిన చుక్కలను పెట్టుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత చుక్కలను కలుపుతూ గీతలు గీసుకుంటూ.. రంగోలి ఆకారంలోకి గీయాల్సి ఉంటుంది. ఇదే స్టార్స్‌లో ముందు రెండిట్లో ఆరెంజ్ కలర్‌ని, నింపి ఆ తర్వాత మధ్యలో వాటిలో వైట్ కలర్స్‌తో కూడిన రంగులను నింపాలి. చివరకు ఉన్న రెండు స్టార్స్‌లో గ్రీన్ కలర్స్ నింపి ముగ్గు చుట్టూ పెద్ద సర్కిల్ ని వేసుకోవాలి.
Also Read Hacking Accounts: తెలంగాణపై హ్యాకర్ల ముప్పేట దాడి.. గవర్నర్, మంత్రి, కవిత ఖాతాలను వదలని హ్యాకర్లు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter
Republic Day 2024: గణతంత్ర దినోత్సవ 3 రంగుల ముగ్గులు మీకోసం..ఇలా సులభంగా వాకిలి మొత్తం నింపేయండి!