How To Get Relief Arthritis Pain: పెరుగుతున్న వయస్సు కారణంగా చాలా మందిలో కీళ్ల నొప్పులు వస్తున్నాయి. ఈ సమస్యనే మరికొందరు ఆర్థరైటిస్ అని పిలుస్తారు. అయితే భరింలేని కీళ్ల నొప్పులతో బాధపడుతున్నవారు తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. దీని కారణంగా నడవడంలో కూడా సమస్యలు వస్తున్నాయి. దీని ప్రభావం కొంత మందిలో చర్మం, కళ్ళు, ఊపిరితిత్తులు, గుండె, రక్త నాళాలులో సమస్యలు కూడా వస్తున్నాయి. కాబట్టి ఈ వ్యాధితో బాధపడేవారు తప్పకుండా పలు నివారణలు పాటించాల్సి ఉంటుంది. ఆర్థరైటిస్ సమస్యను సకాలంలో తగ్గించడానికి చాలా రకాల చిట్కాలున్నాయి. వాటిని కూడా వినియోగించాల్సి ఉంటుంది.
జీవనశైలిలో ఈ మార్పులు చేసుకోవాల్సి ఉంటుంది:
రెగ్యులర్ వ్యాయామం:
శరీరానికి శారీరక శ్రమ చాలా ముఖ్యం. అయితే ప్రస్తుతం చాలా మందిలో ఎలాంటి శ్రమ లేకపోవడం వల్ల చాలా రకాల అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. అంతేకాకుండా కీళ్లలో రక్త ప్రసర తగ్గి కీళ్ల నొప్పులు కూడా వస్తున్నాయి. కాబట్టి ఈ సమస్యల నుంచి ఉపశమనం పొందడానికి తప్పకుండా వ్యాయామాలు చేయాల్సి ఉంటుంది.
ఊబకాయం:
శరీర బరువు అతిగా పెరగడం కారణంగా కూడా కీళ్ల నొప్పులు వస్తూ ఉంటాయి. మోకాళ్లపై శరీర బరువు ఒత్తిడి పడడం వల్ల తీవ్ర నొప్పులు వస్తున్నాయి. అయితే ఇలాంటి సమస్యలతో బాధపడేవారు తప్పకుండా శరీర బరువును నియంత్రించాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఆర్థరైటిస్ నొప్పులు అతిగా ఉంటే తప్పకుండా వైద్యులను సంప్రదించాల్సి ఉంటుంది.
డైట్‌లో ఫ్యాటీ యాసిడ్‌లను చేర్చుకోండి:
వృద్ధాప్యంలో దశలో కీళ్ల నొప్పులతో బాధపడేవారు తప్పకుండా ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్‌ను డైట్‌లో చేర్చుకోవడం చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. శరీరంలో ఫ్యాటీ యాసిడ్స్ లోపం ఉండడం వల్ల కూడా ఇలాంటి సమస్యలు వస్తాయి. కాబట్టి తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది.
ఆర్థరైటిస్ నొప్పులను ఇలా వదిలించుకోండి:
ఆర్థరైటిస్ సమస్య తీవ్ర ఇబ్బందులు పడేవారు హాట్ ఫోమెంటేషన్ ఉపశమనం కలిగిస్తుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. దీని కోసం వేడి నీళ్లలో రాళ్ల ఉప్పు వేసి మోకాళ్లపై అప్లై చేయడం వల్ల చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి.
ఆముదము నూనె:
ఆర్థరైటిస్ నొప్పిలతో బాధపడేవారు ఉపశమనం పొందడానికి ఆముదము నూనె నొప్పులు ఉన్న చోట అప్లై చేసి రాత్రంతా అలానే ఉంచి వేడినీటి ప్యాడ్‌తో వాటిని ఫోమెంట్ చేయండం వల్ల చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. అంతేకాకుండా సులభంగా కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం కలుగుతుంది.
Also Read: Investment Tips: కొత్త ఆర్థిక సంవత్సరంలో ఇన్వెస్ట్ చేస్తున్నారా..? ఈ విషయాలను గుర్తుపెట్టుకోండి
Also Read: Kane Williamson: అద్భుతంగా క్యాచ్ పట్టేశాడు.. కానీ వెంటాడిన దురదృష్టం.. సీజన్ మొత్తానికి దూరం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి