Red Banana Benefits In Telugu: ఇప్పటివరకు చాలామంది ఎరుపు రంగుతో కూడిన అరటి పండ్లను చూసి ఉంటారు. ఎందుకంటే ఇవి దక్షిణ భారతదేశంలో కంటే ఎక్కువగా ఉత్తర ప్రాంతాల్లో లభిస్తూ ఉంటాయి. అరటిపండు తొక్క ఎరుపు రంగులో ఉన్నప్పటికీ లోపల ఉండే పండు సాధారణ పసుపు రంగులో లభించే విధంగానే ఉంటుంది. కానీ ఇందులో సాధారణ అరటిపండ్లలో లభించే పోషకాల కంటే ఎక్కువగా లభిస్తాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ఈ ఎరుపు రంగుతో కూడిన అరటిపండును తినడం వల్ల శరీరానికి తగిన మోతాదులో ఫైబర్ లభిస్తుంది. దీని కారణంగా జీర్ణక్రియ కూడా ఆరోగ్యంగా శక్తివంతంగా ఉంటుంది. అయితే ఈ ఎరుపు రంగుతో పండ్లను తినడం వల్ల కలిగే లాభాలేంటో ఇప్పుడు తెలుసుకోండి.
రుచి ఎలా ఉంటుందంటే?
ఈ ఎరుపు రంగుతో కూడిన అరటి పండ్ల రుచి అచ్చం సాధారణంగా లభించే ఎల్లో కలర్‌లో ఉండే బనానా లాగే ఉంటుంది. దీని వాసన మాత్రం కొంత తేడాగా ఉంటుంది. ఇవి సాధారణంగా మార్కెట్లో లభించే బెర్రీల వాసన కలిగి ఉంటాయి. అంతేకాకుండా ఇవి కాస్త పచ్చివాసనను కలిగి ఉంటాయి.
ఫైబర్ పుష్కలంగా లభిస్తుంది:
ఈ ఎరుపు రంగుతో కూడిన అరటి పండ్లలో ఫైబర్ పరిమాణాలు ఎక్కువగా లభిస్తాయి. కాబట్టి దీనిని తినడం వల్ల పొట్ట ఎప్పుడు నిండు గానే ఉంటుంది. అంతేకాకుండా జీర్ణ క్రియ కూడా ఆరోగ్యవంతంగా పనిచేస్తుంది. ఈ ఒక్క అరటి పండులో 90 క్యాలరీలు ఉంటాయి. అంతేకాకుండా తగిన మోతాదులో కార్బోహైడ్రేట్లు కూడా లభిస్తాయి.
కిడ్నీ సమస్యలకు..
ఎరుపు రంగు అరటిపండ్లలో పొటాషియం ఎక్కువ మోతాదులో లభిస్తుంది. కాబట్టి వీటిని ప్రతి రోజు తినడం వల్ల మూత్రపిండాలలోని రాళ్లు సులభంగా తొలగిపోతాయి. దీంతోపాటు కిడ్నీలు కూడా ఎంతో ఆరోగ్యంగా ఉంటాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అలాగే ఇందులో లభించే క్యాల్షియం ఎముకలను దృఢంగా చేసేందుకు కూడా ఎంతగానో సహాయపడుతుంది. అంతేకాకుండా క్యాన్సర్ వంటి ప్రాణాంతకమైన వ్యాధులు రాకుండా ఉంటాయి.
Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!
పైల్స్ నుంచి ఉపశమనం కలిగిస్తుంది:
ఎరుపు రంగుతో కూడిన అరటిలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ప్రతి రోజు తినడం వల్ల మలబద్ధకం వంటి సమస్య నుంచి సులభంగా ఉపశమనం లభిస్తుంది. దీంతోపాటు ఇందులో లభించే కొన్ని మూలకాలు పైల్స్ సమస్య నుంచి కూడా సులభంగా విముక్తి కలిగిస్తుంది. కాబట్టి ప్రతిరోజు మధ్యాహ్నం భోజనం తర్వాత ఒకటి లేదా రెండు అరటి పండ్లను తినడం చాలా మంచిది.
ఒత్తిడిని తగ్గిస్తుంది:
అరటి పండ్లలో ఉండే పొటాషియం ఒత్తిడిని తగ్గించేందుకు కూడా ఎంతగానో సహాయపడుతుంది. ముఖ్యంగా ఇందులో ఉండే గుణాలు శరీరానికి రిలాక్స్‌ను అందిస్తాయి. కాబట్టి ప్రతిరోజు ఈ ఎరుపు రంగు కలిగిన అరటి పండ్లను తినడం చాలా మంచిది.
Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి