Panch Grahi Yog 2022: నేడు మహాశివరాత్రి. అది గాక ఈ నెల పంచ గ్రహ కూటమితో ఆరంభమవుతోంది. కాబట్టి ఈ మాసం చాలా శుభప్రదమైనదిగా పరిగణిస్తారు. అరుదుగా ఏర్పడే పంచ గ్రహ కూటమి కొన్ని రాశుల వారికి అపారమైన సంపద, సంతోషాన్ని కలగజేస్తుంది. పంచ గ్రహ కూటమి రోజున ఒకే రాశిలో ఐదు రాశులు కలుస్తాయి. కుజుడు, బుధుడు, గురుడు, శుక్రుడు, శని ఒకే రాశిలోకి వస్తారు. ఈ పరిణామం రాశిచక్రంపై ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా ఐదు రాశులపై ఆ ప్రభావం ఉంటుంది. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం..
మేష రాశి : పంచగ్రహ యోగంతో ప్రారంభమయ్యే మార్చి నెల, మేష రాశి వారికి కలిసొస్తుంది. కెరీర్ పరంగా అపారమైన ప్రయోజనాలను అందిస్తుంది. ముఖ్యంగా వ్యాపారులు భారీ లాభాలు ఆర్జిస్తున్నారు. ఉద్యోగులకు మరో జాబ్ ఆఫర్ రావొచ్చు. ప్రమోషన్లు దక్కుతాయి. చేపట్టే పనులు సకాలంలో పూర్తవుతాయి.
వృషభం : వృషభ రాశి వారికి పూర్తి అనుకూల సమయం. ప్రతి పనిలో విజయం లభిస్తుంది. కెరీర్లో కొన్ని గొప్ప విజయాలు సాధిస్తారు. ప్రమోషన్ లేదా కొత్త ఉద్యోగం పొందుతారు. ఆర్థిక పరిస్థితి లాభదాయకంగా ఉంటుంది. కుటుంబంలో సంతోషం వెల్లివిరుస్తుంది. ప్రేమ జీవితం ఆనందదాయకంగా ఉంటుంది.
తుల : తులారాశి వారి ప్రేమ, వైవాహిక జీవితం సాఫీగా, సంతోషంగా సాగుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు దక్కుతాయి. పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తవుతాయి. కొత్త పనులు చేపట్టేందుకు అనువైన సమయం.
వృశ్చికం : మార్చి మాసం వృశ్చిక రాశికి చాలా ప్రయోజనాలను కలిగిస్తుంది. ఆదాయం పెరుగుతుంది. మీ ధైర్యం, విశ్వాసం కూడా పెరుగుతాయి. ప్రతి పనిని సులువుగా, సకాలంలో పూర్తి చేస్తారు. కుటుంబంతో సమయం గడుపుతారు. ఆరోగ్యం బాగుంటుంది.
కుంభం : కుంభ రాశి వారికి కొత్త పరిచయాలు, సంబంధాలు ఏర్పడతాయి. వృత్తి, వ్యాపారాలలో బాగా రాణిస్తారు. వ్యాపారం అభివృద్ధి చెందుతుంది. కొత్త జాబ్ ఆఫర్ పొందుతారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఇంట్లో ప్రేమ, సంతోషాలు వెల్లివిరుస్తుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook