Health Benefits Of Orange Seeds: ఆరెంజ్ పండును ఇష్టపడని వారంటూ ఉండరు దీంతో మనం జ్యూస్ లో తయారు చేస్తాము. ఇందులో బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. ముఖ్యంగా విటమిన్ సి అధికంగా లభిస్తుంది. అంతేకాకుండా విటమిన్లు , మినరల్ , ఫైబర్ కూడా ఉంటాయి. అయితే ఈ పండును తినేటప్పుడు గింజలను పక్కకి పెడతాము. కానీ ఈ గింజల్లో కూడా ఎన్నో ఆరోగ్య లాభాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు
ఆరెంజ్ గింజల వల్ల కలిగే ప్రయోజనాలు:
ఆరోగ్యకరమైన కొవ్వులు: ఆరెంజ్ గింజల్లో మోనోఅన్‌శాచురేటెడ్ కొవ్వు ఆమ్లాలు అధికంగా ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యానికి మంచివి.
విటమిన్ సి: ఆరెంజ్ గింజల్లో ఉండే కొన్ని పోషకాలు పెద్ద ప్రేగు క్యాన్సర్ వచ్చే ప్రమాదాన్ని తగ్గిస్తుందని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా DNAకి హాని కలిగించే ఫ్రీ రాడికల్స్‌ను రక్షిస్తుంది.
ఇమ్యూనిటీ బూస్టర్: ఆరెంజ్ గింజలు తీసుకోవడం వల్ల శరీరానికి ఎంతో శక్తి కలుగుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇందులో ఉండే పాల్మిటిక్, ఒలీక్, లినోలిక్ ఆమ్లాలు శక్తిని అందిస్తాయి.
జుట్టు: ఆరెంజ్ పండు మాత్రమేకాకుండా దీని గింజలు జుట్టు సంరక్షణలో మేలు చేస్తాయి. ఆరెంజ్ గింజలతో తయారు చేసే నూనెను ఉపయోగించడం వల్ల జుట్టు సమస్యలకు చెక్ పెట్టవచ్చు.
చర్మకాంతి: విటమిన్ సి చర్మాన్నికి ఎంతో అవసరమైన విటమిన్. ఇది ఆరెంజ్ గింజల్లో ఎక్కువగా దొరుకుతుంది. దీని ఉపయోగించడం వల్ల ముడతలు, మచ్చలు తగ్గుతాయి.
బీపీ అదుపు: ఆరెంజ్ గింజల్లో విటమిన్ బి6 అధికంగా లభిస్తుంది. ఇది హిమోగ్లోబిన్‌ను పెంచడంలో సహాయపడుతుంది. అంతేకాకుండా రక్తపోటును అదుపు చేయడంలో కీలక ప్రాత పోషిస్తుంది.
డయాబెటిస్: షుగర్‌ను అదుపు చేయడంలో ఆరెంజ్ గింజలు ఉపయోగపడుతాయని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. ఇందులోనే సహజమైన షుగర్ ఉంటుంది.
క్యాన్సర్: ఆరెంజ్ గింజలు ప్రతిరోజు తినడం వల్ల చర్మ క్యాన్సర్, ఊపిరితిత్తుల క్యాన్సర్ వంటి సమస్యలను తగ్గిస్తుంది. అంతేకాకుండా ఇందులోని విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు క్యాన్సర్‌తో పోరాడడంలో సహాయపడుతాయి.
మలబద్ధకం నివారణ: నారింజ విత్తనాలు జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. గ్యాస్, అసిడిటీ, ఉబ్బరం వంటి సమస్యలు సలువుగా తగ్గుతాయి.
ఆరెంజ్ విత్తనాలను ఎలా ఉపయోగించాలి?
ఆరెంజ్ పండు విత్తనాల నూనెను చర్మంపైన ఉపయోగించవచ్చు.అలాగే దీని పొడి కూడా మార్కెట్‌లో లభిస్తుంది. ఈ పొడిని ఆహారపదార్థాల్లో కలుపుకొని తినవచ్చు. ఆరెంజ్ విత్తనాల చాయ్‌ను తయారు చేసి తాగవచ్చు.
గమనిక:
ఈ సమాచారం కేవలం సాధారణ అవగాహన కోసం మాత్రమే. ఏదైనా ఆరోగ్య సమస్య ఉన్నట్లయితే, తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించండి.
Also read: Immunity System: రోగనిరోధక శక్తి బలహీనంగా ఉందని తేలిపే 7 సంకేతాలు ఇవే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter