Orange Health Benefits: ఆరెంజ్ పండు ఒక రుచికరమైన, పోషకాలతో నిండిన పండు. ఇందులో విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఇది రోగనిరోధకశక్తిని పెంచి అనారోగ్య సమస్యల బారిన పడకుండా సహాయపడుతుంది. అంతేకాకుండా ప్రతిరోజు ఆరెంజ్ తినడం వల్ల గుండె సంబంధిత సమస్యలతో పాటు అధిక రక్తపోటు సమస్యలను తగ్గించడంలో ఎంతో ఉపయోగపడుతుందని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. ఆరెంజ్ పోషక విలవులు, ఇది గుండెకు అలాగే రక్తపోటు ఎలా సహాయపడుతుంది అనే విషయాలు గురించి తెలుసుకుందాం.
పండ్లు తినడం వల్ల శరీరానికి ఎంతో మేలు కలుగుతుంది. ఇందులో ఉండే పోషకాలు శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. ముఖ్యంగా ఆరెంజ్ పండు శరీరానికి చాలా మంచిది. ఇందులో విటమిన్ సితో పాటు ఫోలేట్, పొటాషియం, ఫైబర్, క్యాల్షియం వంటి ఇతర పోషకాలు అధికంగా ఉంటాయి. విటమిన్ సి రోగనిరోధక శక్తిని మెరుగుపరచడంలో సహాయపడుతే ఫోలేట్ అనేది గర్భిణీ స్త్రీలకు, శిశువుకు ఎంతో మేలు చేస్తుంది. ఇందులో ఉండే పొటాషియం రక్తపోటును అదుపులో ఉంచడంలో ఎంతో మేలు చేస్తుంది. మలబద్ధకం, గ్యాస్, అజీర్ణం వంటి సమస్యలు ఉన్నవారు కూడా ఈ ఆరెంజ్ పండును తివచ్చు. ఇది జీర్ణక్రియ వ్వవస్థకు ఎంతో సహాయపడుతుంది. క్యాల్షియం ఎముకలను దృఢంగా తయారు చేయడంలో ఎంతో మేలు చేస్తుంది. ఇలా ఆరెంజ్ పండు కేవలం రోగనిరోధక శక్తిని మాత్రమే కాకుండా మరికొన్ని ఆరోగ్యలాభాలు పొందవచ్చు.
అయితే ఆరెంజ్ పండు గుండెకు ఎలా సహాయపడుతుంది అనేది అంటే..పొటాషియం రక్తనాళాలను విశ్రాంతి చేయడానికి సహాయపడుతుంది, దీనివల్ల రక్తపోటు తగ్గుతుంది. ఆరెంజ్‌లోని ఫైబర్ చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడానికి సహాయపడుతుంది, ఇది గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. విటమిన్ సి రక్తం గడ్డకట్టడాన్ని నిరోధించడంలో సహాయపడుతుంది, ఇది గుండెపోటు మరియు స్ట్రోక్‌ల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. అలాగే ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు వాపును తగ్గించడానికి సహాయపడతాయి, ఇది గుండె ఆరోగ్యానికి కీలకం. ఈ విధంగా ఆరెంజ్ గుండెకు మేలు చేస్తుంది.
అధిక రక్తపోటు ఉన్నవారికి ఆరెంజ్ ఎలా ఉపయోగపడుతుంది?
పొటాషియం రక్తనాళాలను విశ్రాంతి చేయడానికి సహాయపడుతుంది, దీనివల్ల రక్తపోటు తగ్గుతుంది. సోడియం రక్తపోటును పెంచుతుంది. ఆరెంజ్‌లోని పొటాషియం సోడియం ప్రభావాలను తగ్గించడానికి సహాయపడుతుంది. ఆరెంజ్‌లోని మెగ్నీషియం గుండె స్పందన రేటును నియంత్రించడానికి సహాయపడుతుంది. అధిక రక్తపోటు ఉన్నవారు ఆరెంజ్‌ను ఆహారంలో భాగంగా చేసుకోవచ్చు, కానీ ఇది ఒకే చికిత్స కాదు. ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నవారు ఆరెంజ్‌ను తినే ముందు వైద్యుని సలహా తీసుకోవాలి. ఆరెంజ్‌తో పాటు ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం కూడా ముఖ్యం.
ముగింపు:
ఆరెంజ్ పండు గుండె ఆరోగ్యానికి, అధిక రక్తపోటు నియంత్రణకు చాలా మంచిది. దీనిలో ఉండే పోషకాలు రక్తపోటును తగ్గించడానికి, చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడానికి గుండె స్పందన రేటును నియంత్రించడానికి సహాయపడతాయి. అయినప్పటికీ, ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరించడం చాలా ముఖ్యం.
Also read: Diabetes Precautions: టైప్ 1, టైప్ 2 కాదిప్పుడు టైప్ 1.5 డయాబెటిస్, చాలా ప్రమాదకరమిది
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter