Onion and Garlic Peels: భారతీయులు ఉల్లి, వెల్లుల్లి ప్రతి వంటకంలో వినియోగిస్తారు. ఇది ఆహార రుచిని పెంచడమే కాకుండా శరీరానికి చాలా రకాల పోషక విలువలను అందిస్తుంది. ప్రస్తుతం చాలా మంది కూరలను వండుకునే క్రమంలో ఉల్లి, వెల్లుల్లి పొట్టును తొలచివేస్తూ ఉంటారు. ఎందుకంటే వీటిలో కూడా చాలా పోషకాలుంటాయని తెలియక..! దీనిని తీసేస్తున్నారు. అయితే ఈ పొట్టును తినడం వల్ల శరీరానికి 3 రకాల ప్రయోజనాలు చేకూరుతాయని నిపుణులు తెలుపుతున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
మూడు రకాల ప్రయోజనాలు ఇవే..!
ఉల్లిపాయ, వెల్లుల్లి తొక్కలు జుట్టు అందాన్నిపెంచడాని తోడ్పడతాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అయితే ఉల్లిపాయ, వెల్లుల్లి తొక్కలు శరీరానికి ఎలా ఉపయోగపడతాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం..
1. జుట్టు కోసం:
ఉల్లిపాయ జుట్టుకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇందులో ఉండే సల్ఫర్ జుట్టును మెరిసేలా చేస్తుంది. అంతేకాకుండా జుట్టును కుదుళ్ల నుంచి బలోపేతం చేస్తుంది. దీని కోసం.. ఉల్లిపాయ తొక్కలను నీటిలో మరిగించి, నీటిని చల్లబరిచి, జుట్టుకు షాంపూ చేసిన తర్వాత ఈ నీటితో శుభ్రం చేసుకోండి. ఇలా క్రమం తప్పకుండా చేస్తే త్వరలోనే మంచి లాభాలు పొందుతారు.
2. ఆహారాన్ని రుచిగా చేస్తుంది:
వెల్లుల్లిని ఆహారం వండే క్రమంలో వినియోగించడం వల్ల ఆహారం రుచి పెరుగుతుంది. అంతేకాకుండా వీటిని అతిగా వినియోగించడం వల్ల రుచి మొత్తం మారిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. అయితే ఉల్లిపాయ-వెల్లుల్లి తొక్కలను వేయించి పొడి చేసుకుని ఆహారం చేసే క్రమంలో వేసుకుంటే ఆహారం మరింత రుచిగా మారుతుంది.
3. దురదకు ప్రభావవంతంగా పని చేస్తుంది:
పాదాల మధ్య దురద ఒక సమస్య. అయితే ఈ సమస్య నుంచి విముక్తి పొందడానికి ఉల్లిపాయ-వెల్లుల్లిని ఉపయోగించవచ్చని నిపుణులు తెలుపుతున్నారు. ఉల్లిపాయలు, వెల్లుల్లిని తొక్కతో నీటిలో వేసి మరిగించి, ఆ నీటిలో పాదాలను ఉంచండి.
(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దీనిని స్వీకరించే ముందు, ఖచ్చితంగా వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)
Also read: Bank Holidays July: జూలై నెలలో బ్యాంక్ పనులుంటే సమస్యే..16 రోజులు సెలవులు, ఇదే సెలవుల జాబితా
Also read: Pisces Monthly Horoscope 2022: ఈ రాశి వారికి ఈ నెలంతా లాభాలే.. ఈ జాగ్రత్తలు తప్పకుండా పాటించండి..!
స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook