Omicron Symptoms: ఒమిక్రాన్ వేరియంట్ సోకిన వారిలో రెండు కొత్త ప్రాణాంతక లక్షణాలు?

Omicron Symptoms: గత రెండేళ్లుగా ప్రపంచ దేశాలను గడగడలాడిస్తున్న కరోనా వైరస్.. అనేక వేరియంట్ల రూపంలో ప్రజలను బలి తీసుకుంటుంది. తాజాగా పీఏ2 వైరస్ తీవ్రంగా వ్యాప్తి చెందనుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది. ఈసారి కరోనా వైరస్ బారిన పడిన వారిలో కొత్తగా రెండు ప్రాణాంతక లక్షణాలు కనిపిస్తున్నాయని అధ్యయనంలో తేలింది.   

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 20, 2022, 03:31 PM IST
    • వేగంగా వ్యాపిస్తున్న కరోనా వైరస్ పీఏ2 వేరియంట్
    • ఒమిక్రాన్ వైరస్ సోకిన వారిలో రెండు కొత్త లక్షణాలు
    • ఆ రెండు ప్రాణాంతక లక్షణాలని డబ్ల్యూహెచ్ఓ సూచన
Omicron Symptoms: ఒమిక్రాన్ వేరియంట్ సోకిన వారిలో రెండు కొత్త ప్రాణాంతక లక్షణాలు?

Omicron Symptoms: ప్రపంచ దేశాలను గడగడలాడిస్తున్న కరోనా వైరస్ పుట్టి రెండేళ్లకు పైగా కాలం గడిచింది. డెల్టా, ఒమిక్రాన్ వంటి వేరియంట్ల రూపంలో ప్రపంచవ్యాప్తంగా ఎంతోమందిని బలి తీసుకుంది. అనేక దేశాల్లోని పర్యావరణ పరిస్థితుల నేపథ్యంలో భౌగోళిక ప్రాంతాలలో వైరస్ అనేక వేరియంట్ల రూపంలో ప్రజలకు సోకుతుంది. ఈ మ్యుటేషన్ ప్రక్రియలో భాగంగా వైరస్ తన స్వభావాన్ని మార్చుకుంటూ వ్యాపి చెందుతోంది. ఇటీవలే మూడో సారి ఒమిక్రాన్ రూపంలో ప్రజలపై విరుచుకుపడింది. అయితే ప్రస్తుతం ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి తగ్గిపోతుంది.  

కానీ, ప్రస్తుతం ఒమిక్రాన్ పీఏ2 స్ట్రెయిన్ ప్రభావం ప్రపంచ దేశాల్లో పెరుగుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది. పీఏ2 వేరియంట్.. పీఏ1 కంటే వ్యాప్తి ఎక్కువగా ఉందని డబ్ల్యూహెచ్ఓ తెలిపింది. చైనా, ఇండియా, పాకిస్థాన్, బంగ్లాదేశ్, ఫిలిప్పీన్స్ సహా ఆసియా దేశాల్లో సబ్ - స్ట్రెయిన్ ఆధిపత్యం చలాయిస్తుందని కంపెనీ వెల్లడించింది. గతంలో సోకిన వైరస్ వేరియంట్లతో పోలిస్తే ప్రస్తుతం మరో రెండు ప్రాణాంతక లక్షణాలు వైరస్ సోకిన వారిలో కనిపిస్తున్నాయని వైద్య నిపుణులు అంటున్నారు. 

వైరస్ సోకిన వారిలో ఊపిరితిత్తులపై ఎక్కువ ప్రభావం ఉంటుంది. వీటితో పాటు తీవ్ర అలసట, మైకము కూడా కనిపిస్తుంది. వీటితో పాటు జ్వరం, దగ్గు, గొంతు నొప్పి, తలనొప్పి, కండరాల అలసట, హెవీ హార్ట్ బీట్ వంటి లక్షణాలు ఒమిక్రాన్ పీఏ2 లో కనిపిస్తున్నాయి.  

Also Read: Chocolate Day 2022: చాక్లెట్ డే సందర్భంగా మీరు ఇష్టపడే వారికి ఈ బహుమతులు ఇవ్వండి!

Also Read: Girls Google Searching: 17 శాతం మంది అమ్మాయిలు ఇంటర్నెట్ లో సెక్స్ గురించి సెర్చ్ చేస్తున్నారట!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook 

Trending News