Natural ways to treat Pimples: యవ్వనంలో కలిగే మొటిమలను తగ్గించే సహజ ఔషదాలు & పద్ధతులు

యవ్వనంలో మొటిమల సమస్య చాలా సాధారణమే. వీటి కోసం మనం క్రీములను, రసాయనిక సబ్బులను వాడుతుంటాము. కానీ వీటి కన్నా సహజ సిద్ద పద్ధతులు, ఔషదాలు శక్తి వంతంగా తగ్గిస్తాయి 

Written by - ZH Telugu Desk | Last Updated : Oct 20, 2021, 05:06 PM IST
  • యువతీ, యువకుల యవ్వనంలో మొటిమలు సాధారణం
  • క్రీమ్, ఆర్టిఫీషియల్ సబ్బులతో ఎక్కువ అయ్యే అవకాశం ఉంది
  • సహజ పద్ధతులు, ఆహారాల ద్వారా వీటిని తగ్గించుకోవచ్చు
Natural ways to treat Pimples: యవ్వనంలో కలిగే మొటిమలను తగ్గించే సహజ ఔషదాలు & పద్ధతులు

Natural ways to treat Pimples: యవ్వనంలోనే అసలు  జీవిత అంటే ఏంటి..? జీవిత లక్ష్యం కూడా మనకు ఏర్పడుతుంది. ఈ వయసులోనే జీవిత లక్ష్యాలను ఎలా చేరుకోవాలి, ఎలా సాధించాలి అని ఆలోచిస్తుంటారు. ఈ సమయంలోనే, మొటిమల సమస్యలు కూడా ఎక్కువగా ఉంటుంది. ఫలితంగా మీ లక్ష్య సాధనలో ప్రయత్నించే సమయంలో మొటిమల వలన మీలో కొంత ఆత్మ స్థైర్యం తగ్గే అవకాశం ఉంది. 

ఈ సమయంలో వీటిని తగ్గించుకోటానికి గానూ, వివిధ రసాయనిక క్రీమ్ లను వాడుతుంటారు. కానీ, వీటికి బదులుగా, సహజ పద్దతులను, ఔషదాలను పాటించటం వలన మంచి ఫలితాలను పొందటమే కాకుండా మీ లక్ష్యాల వైపు పూర్తీ దృష్టిని సారిస్తారు. 

Also Read: Mukku Avinash Wedding:పెళ్లి చేసుకున్న ముక్కు అవినాష్.. 'బ్లండర్‌ మిస్టేక్‌' అంటున్న రాంప్రసాద్!

పింపుల్స్ ను చేతి వేళ్లతో  నొక్కటం వలన ముఖంపై మచ్చలు ఏర్పడి, భయట తిరగానికి లేదా పార్టీలకు వెళ్ళటానికి ఇబ్బందికరంగా భావిస్తుంటారు.  వీటిని తగ్గించుకోటానికి చాలా మంది చర్మ వైద్య నిపుణులను కలవటం లేదా మార్కెట్ లో లభించే ఉత్పత్తులను వాడుతుంటారు. ఇలాంటి సమయంలో రసాయనిక క్రీమ్ ల కన్నా, సహజ ఔషదాలు శక్తివంతంగా పని చేస్తాయి. కారణం- మీ చర్మానికి కావలసిన పోషకాల స్థాయిలు సమతుల్య పరచుటలో ఇవి శక్తివంతంగా పని చేస్తాయి. చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరిచే ఔషదాల గురించి కింద తెలుపబడింది.

రోజు ముఖాన్ని కడగండి
రోజు ఉదయాన మరియు రాత్రి పడుకునేపుడు ముఖాన్ని కడగటం వలన రోజులో చేరిన దుమ్ము, ధూళి మరియు హానికర కారకాలు తొలగిపోతాయి. మొటిమలను తగ్గించే సబ్బులను లేదా ఫేస్ వాష్ లను వాడటం వలన మంచి ఫలితాలను పొందుతారు. ఈ ఉత్పత్తులు కూడా అధిక గాడతలు కాకుండా, అల్ప గాడతలు ఉండేలా చూసుకోవాలి. ముఖాన్ని టవల్ తో తుడవకుండా, సహజంగా ఎండనివ్వండి. టవల్ ను వాడటం వలన చర్మ కణ నిర్మానికి ప్రమాదం చేకూరే అవకాశం ఉంది.

నిమ్మకాయ రసం
నిమ్మరసం ఆమ్ల గుణాలను కలిగి ఉన్నందు వలన మొటిమలను తగ్గించుటలో సహజ ఔషదంగా పని చేస్తుంది. చర్మ రంద్రాలలో ఉన్న దుమ్ము ధూళిని తొలగించటమే కాకుండా, సిబం (క్రొవ్వు మరియు శ్లేషపటలము క్షయము కలిసిన మిశ్రమము) గట్టి పడేలా చేస్తుంది. తాజాగా కత్తిరించిన నిమ్మకాయ ముక్కను తీసుకొని నేరుగా ముఖంపై రాసి, కనీసం ఒక గంట పాటూ వేచి ఉండండి. తరువాత నీటితో కడిగివేయండి. అంతేకాకుండా, నిమ్మరసాన్ని, రోజ్ వాటర్ లో కలిపి మొటిమల ప్రభావిత ప్రాంతాలలో వాడటం వలన మంచి ఫలితాలను పొందుతారు.

Also Read: AP Bundh:ఎక్కడికక్కడ టీడీపీ నేతల అరెస్ట్​- పట్టాభి క్షమాపణకు వైసీపీ డిమాండ్​

తేనె
మీ ముఖ చర్మంపై ఉన్న మొటిమలను తొలగించుటలో ఇది శక్తివంతంగా పని చేస్తుంది. ఇది యాంటీ సెప్టిక్ మరియు తేమను అందించే గుణాలను కలిగి ఉంటుంది. ఈ గుణాలను కలిగి ఉన్నందువలన మొటిమలను తగ్గించుటలో శక్తివంతంగా పని చేస్తుంది. తేనెను మొటిమల ప్రభావిత ప్రాంతాలలో పూసి, ఒక గంట వరకు అలానే వదిలేయండి. ఇలా చేయటం వలన కొద్ది రోజులలోనే మీ ముఖంపై ఏర్పడిన మచ్చలు, కొద్ది రోజులలోనే తగ్గటం గమనిస్తారు. తేనెను, గోరువెచ్చని నీటిలో కలిపి ముఖానికి పూసి, కొద్ది సమయం తరువాత చల్లటి నీటితో కడిగివేయటం వలన రంధ్రాల మూసుకుపోతాయి. తేనె మరియు జాజికాయ పొడి కలిపిన మిశ్రమాన్ని ఫేస్ మాస్క్ గా కూడా వాడవచ్చు. కానీ ఈ మిశ్రమాన్ని క్రమంగా వాడటం వలన మంచి ఫలితాలను పొందుతారు.

దోసకాయ
దోసకాయ చల్లబరిచే మరియు ఉపశమనం కలిగించే గుణాలను కలిగి ఉంటుందని అందరికి తెలిసిందే, ఈ రెండు గుణాలు మొటిమలను తగ్గించటంలో ముఖ్య పాత్ర పోషిస్తాయి. దోసకాయను దంచి, ఒక చెంచా యొగ్ హార్ట్ ను కలిపి, ప్రభావిత ప్రాంతాలలో పూయండి. కనీసం, అరగంట లేదా అంతకన్నా ఎక్కువ సమయం పాటు అలానే వదిలేయండి. తరువాత కదిగివేయండి. మొటిమలను తగ్గించుటలో అందుబాటులో ఉన్న సహజ మార్గంగా దీనిని పేర్కొనవచ్చు.

నారింజ పండు తొక్క
నారింజ పండు, ఆమ్ల గుణాలను మరియు విటమిన్ 'C' ని పుష్కలంగా కలిగి ఉంటుంది మరియు మొటిమలను తగ్గించే పరిపూర్ణ చికిత్సగా తెలుపవచ్చు. నారింజ పండు రసం మరియు తొక్క రెండు మొటిమలను తగ్గించుటలో శక్తివంతంగా పని చేస్తాయి. దీనిలో నారింజ పండు తొక్కలను ఎండలో ఆరబెట్టి, పొడిగా చేయండి. దీనికి నీటిని కలిపి ఒక పేస్ట్ లా తయారు చేయండి. ఈ మిశ్రమాన్ని ప్రభావిత ప్రాంతాలలో పూయండి. ఇలా 10 నుండి 15 నిమిషాల పాటూ ఉంచిన తరువాత గోరు వెచ్చని నీటితో కడిగి వేయండి.

Also Read: Salaar fighting scene leaked: సలార్ ఫైటింగ్ సీన్ వీడియో లీక్.. సోషల్ మీడియాలో వైరల్

మొటిమలను తగ్గించుటలో సాధారణంగా వాడే మందుల కన్నా ఈ సహజ ఔషదాలు శక్తివంతంగా పని చేస్తాయి. మొటిమలను తగ్గించుటకు వీటి వాడకంతో పాటూ, ఆరోగ్యకర ఆహార ప్రణాళికతో పాటూ, నూనె ఆధారిత ఆహారాలకు దూరంగా ఉండండి.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News