Monsoon Hair Care: వర్షాకాలంలో జుట్టుకు ఈ మాస్కులు వేయండి.. చుండ్రు మీ దరిదాపుల్లోకి కూడా రాదు..

Monsoon Hair Care Tips:  ఆరెంజ్‌, యోగార్ట్‌ జుట్టును క్లెన్స్‌ చేస్తుంది. జుట్టుకు ఈ రెండిటితో కలిపి జుట్టుకు మాస్క్‌ వేసుకుంటే జుట్టుకు నేచురల్‌ షైన్‌ అందుతుంది.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం. వీటిని పాటించే ముందు వైద్య సలహా తీసుకోవాలి.

Written by - Renuka Godugu | Last Updated : Jul 12, 2024, 03:35 PM IST
Monsoon Hair Care: వర్షాకాలంలో జుట్టుకు ఈ మాస్కులు వేయండి.. చుండ్రు మీ దరిదాపుల్లోకి కూడా రాదు..

Monsoon Hair Care Tips: వర్షాకాలం ముఖ్యంగా చుండ్రు విపరీతంగా వెంటాడుతుంది. దీంతో హెయిర్‌ ఫాల్‌ సమస్య కూడా వేధిస్తుంది. అయితే, ఈ వర్షాకాలంలో కొన్ని రకాల హెయిర్‌ ప్యాక్స్‌ మన జుట్టుకు వేసుకోవడం వల్ల జుట్టులో చుండ్రు పేరుకుపోదు. మెరుస్తూ కూడా కనిపిస్తుంది.

అరటిపండు, తేనె..
పండిన అరటిపండు, తేనె కలిపి బాగా మిక్స్‌ చేయాలి. ఇది జుట్టుకు సహజసిద్ధమైన గ్లో కూడా వస్తుంది. జుట్టు మృదువుగా మారుతుంది. అరటిపండు కుదుళ్లు పొడిబారకుండా కాపాడుతుంది.

బొప్పాయి, యోగార్ట్‌ మాస్క్‌..
బొప్పాయిలో పప్పెయిన్‌ అనే ఎంజైమ్‌ ఉంటుంది. ఇది జుట్టు కుదుళ్లలో డెడ్‌ స్కిన్‌ స్కిన్‌ సెల్స్‌ తొలగిస్తుంది. ఇది కుదుళ్లను శుభ్రం చేసి ఆరోగ్యకరంగా మారుస్తుంది.

అవకాడో, యోగార్ట్‌ మాస్క్‌..
అవకాడో, యోగార్ట్‌ రెండు కలిపి జుట్టుకు రాస్తే ఆరోగ్యంగా మారుతుంది. ఎందుకంటే రెండిటిలో మన జుట్టుకు కావాల్సిన విటమిన్స్‌, ప్రోటీన్స్‌ జుట్టును మృదువుగా, మెరిపించడంలో ప్రేరేపిస్తుంది.

బొప్పాయి, కొబ్బరిపాల మాస్క్‌..
బొప్పాయి గుజ్జు, కొబ్బరి పాలను రెండిటినీ కలిపి జుట్టుకు పట్టించాలి. ఇది జుట్టుకు హైడ్రేషన్‌ అందిస్తుంది. దీంతో ఫ్రీజీ హెయిర్‌ సమస్య ఉన్నవారికి ఇది మంచి లుక్‌ ఇస్తుంది.

కలబంద, లెమన్‌ మాస్క్..
కలబంద, లెమన్ జ్యూస్‌ రెండిటినీ కలిపి జుట్టు అంతటికీ పట్టించడం వల్ల తలపై అదనపు నూనె ఉత్పత్తిని తగ్గిస్తుంది. ఇది జుట్టు బలంగా పొడుగ్గా పెరగడానికి ప్రేరేపిస్తుంది.

ఇదీ చదవండి: నోరూరించే  రొయ్యల కూర ఇలా వండుకుంటే నోట్లో కరిగిపోతుంది అంతే..

మామిడి, గుడ్డు మాస్క్‌..
మామిడిపండు, ఎగ్‌ యోగ్‌ జుట్టును మృదువుగా మారుస్తుంది. ముఖ్యంగా విటమిన్‌, ప్రొటీన్లు పుష్కలంగా ఉంటాయి. ఇది జుట్టు బ్రేకేజీ తగ్గిస్తుంది.

కీవీ, బాదం ఆయిల్‌ మాస్క్..
కీవీ పండును బాగా మ్యాష్‌ చేయాలి. ఇందులోనే విటమిన్ సీ, ఇ ఉంటుంది. జుట్టుకు హైడ్రేషన్‌ అందించడానికి ప్రేరేపిస్తుంది. ఆరోగ్యకరమైన కుదుళ్లకు సహాయపడుతుంది.

ఆరెంజ్‌, యోగార్ట్‌ మాస్క్‌..
ఆరెంజ్‌, యోగార్ట్‌ జుట్టును క్లెన్స్‌ చేస్తుంది. జుట్టుకు ఈ రెండిటితో కలిపి జుట్టుకు మాస్క్‌ వేసుకుంటే జుట్టుకు నేచురల్‌ షైన్‌ అందుతుంది.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం. వీటిని పాటించే ముందు వైద్య సలహా తీసుకోవాలి. ఈ సమాచారాన్ని Zee Media ధృవీకరించలేదు) 

ఇదీ చదవండి: ముఖం పై ట్యాన్ పోవట్లేదా? ఈ ఈజీ హోమ్ రెమిడీ తో చెక్ పెట్టండి..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebookTwitter

Trending News