Male Infertility: మనం తినే ఆహార పదార్ధాల విషయంలో ఎప్పుడూ తగిన జాగ్రత్తలు తీసుకోవల్సిన అవసరముంది. లేకపోతే ముఖ్యంగా పురుషులకు ఇన్‌పెర్టిలిటీ సమస్య తలెత్తవచ్చు. ఆ వివరాలు మీ కోసం..
ఆధునిక పోటీ ప్రపంచం, వివిద రకాల ఆహారపు అలవాట్లు ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తుంటాయి. ముఖ్యంగా ఇన్‌ఫెర్టిలిటీకు దారితీస్తాయి. అందుకే తినే ఆహార పదార్ధాల విషయంలో ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి. జీవనశైలి మారినప్పుడు ఆ ప్రభావం ఆహార పదార్ధాలపై పడినా..ఏవి తినాలి, ఏవి తినకూడదనేది ఆలోచించుకోవాలి. లేకపోతే..సంతాన లేమి సమస్యలు తలెత్తవచ్చు. ముఖ్యంగా మగవాళ్లు తినే ఆహారం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అందుకే మీ డైట్‌లో మార్పులు చాలా అవసరం. పురుషులు సంతాన లేమి సమస్య తలెత్తకుండా ఏ పదార్ధాలు తినకూడదో తెలుసుకుందాం..
ఇన్‌ఫెర్టిలిటీ సమస్య తలెత్తకుండా ఉండేందుకు సాధ్యమైనంతవరకూ స్వీట్స్ పూర్తిగా దూరం పెట్టాలి. స్వీట్స్ కారణంగా బరువు విపరీతంగా పెరుగుతారు. బ్లడ్ షుగర్ స్థాయి కూడా పెరుగుతుంది. ఫలితంగా స్పెర్మ్ క్వాలిటీలో సమస్య ఏర్పడుతుంది. మరోవైపు పేస్ట్రీ, కేక్, చాకొలేట్ బిస్కెట్, ఆర్టిఫిషియల్ స్వీట్స్ దూరంగా పెట్టాలి. ఇక సోడియం స్థాయి ఎక్కువగా ఉండే పదార్ధాల్ని మానేయాలి. ఉదాహరణకు బర్గర్, పిజ్జా, ట్రాన్స్‌ఫ్యాట్ అధికంగా ఉండే పదార్ధాలు తినకూడదు. శరీర బరువును పెంచే పదార్ధాలు మానేయాలి. ఉప్పు ఎక్కువగా తినడం కూడా మంచిది కాదు. దీనివల్ల ఇన్‌ఫెర్టిలిటీ సమస్య రావచ్చు.
మరీ ముఖ్యంగా ధూమపానం స్పెర్మ్ క్వాలిటీపై దుష్ప్రభావం చూపిస్తుంది. స్మోకింగ్ మానేసే పద్ధతులు అవలంభించాలి. టొబాకో, గుట్కా కూడా పూర్తిగా వదిలేయాలి. ఎందుకంటే మేల్ ఇన్‌ఫెర్టిలిటీకు ఇవే ప్రధాన సమస్యలుగా ఉంటాయి.
Also read: Cherry Fruit Benefits: చెర్రీ పండ్లు రోజూ తింటే..ఆరోగ్యంతో పాటు స్థూలకాయ సమస్యకు చెక్
స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook