Lemon And Curd For Hair: ప్రస్తుతం జుట్టు అందాన్ని పెంచేందుకు మార్కెట్‌లో చాలా రకాల ఉత్పత్తులు అందుబాటులో ఉన్నాయి. అంతేకాకుండా చాలా మంది నూతన జీవన శైలి కారణంగా జట్టు సమస్యలతో బాధపడుతున్నారు. అయితే ఈ సమస్యల నుంచి విముక్తి పొందడానికి చాలా రకాల ఇంటి నివారణలు ఉన్నాయి. వాటిని ఉపయోగించి జుట్టు సమస్యలను, వెంట్రుకల అందాన్ని పెంచుకోవచ్చని ఆయుర్వేద నిపుణులు తెలుపుతున్నారు. దీని కోసం ఇంట్లో లభించే నిమ్మకాయ, పెరుగును ఉపయోగించవచ్చని నిపుణులు పేర్కొన్నారు. పెరుగులో ఉండే గుణాలు వెంట్రుకలను మృదువుగా చేస్తాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.
పెరుగు, నిమ్మకాయ వల్ల జుట్టుకు చాలా రకాల ప్రయోజనాలను ఇస్తాయి:
పెరుగు, నిమ్మకాయ జుట్టును మందగా చేస్తాయి:
నిమ్మకాయ, పెరుగు ఇంట్లో చాలా సులభంగా లభిస్తాయి. పెరుగులో విటమిన్ సి, కొవ్వు ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. ఇది జుట్టును ఆరోగ్యంగా ఉంచడానికి ప్రభావవంతంగా పని చేస్తాయి. దీనితో పాటు.. పెరుగులో ప్రోటీన్, కాల్షియం శాతం అధికంగా ఉంటాయి. ఇవి జుట్టుకు ప్రోటీన్లను అందించి.. జుట్టు పెరుగుదలకు దోహదపడుతుంది.
చుండ్రు నుంచి విముక్తి:
పెరుగు, నిమ్మరసం కలిపి జుట్టుకు పట్టించడం వల్ల చుండ్రు సమస్య తొలగిపోతాయి. పెరుగులో యాంటీ ఫంగల్ గుణాలు ఉన్నాయి. చుండ్రు సమస్యలను దూరం చేసేందుకు కృషి చేస్తాయి. దీని కోసం పెరుగు, నిమ్మరసంను బాగా కలిపి తలకు పట్టించి కాసేపు అలాగే ఉంచాలి. ఆ తర్వాత జుట్టు శుభ్రం చేయాలి.
జుట్టు రాలడం వంటి సమస్యలు:
పెరుగు, నిమ్మరసం కలిపి జుట్టుకు అప్లై చేయడం వల్ల వెంట్రుకలు రాలిపోయే సమస్య తొలగిపోతుంది.
(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దీనిని స్వీకరించే ముందు, ఖచ్చితంగా వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)
Also Read: Parrot Viral Video: ఈ చిలక ఆమెతో ఏం మాట్లాడిందో తెలుసా.. నెట్టింట తెగ వైరల్ అవుతున్న వీడియో..!
Also Read: Weight Loss Tips: కీరదోసకాయ వల్ల శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook