Kakarakaya Pachadi Recipe In Telugu: వారంలో ఒక్కరోజైనా కాకరకాయ తినడం వల్ల శరీరానికి అనేక రకాల ప్రయోజనాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇందులో విటమిన్లతో పాటు ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి జీర్ణక్రియను ఆరోగ్యవంతంగా చేసేందుకు ఎంతో సహాయపడుతుంది. ముఖ్యంగా మధుమేహం ఉన్నవారు వారంలో రెండు రోజులైనా కాకరతో చేసిన ఆహారాలు తింటే బోలెడు లాభాలు పొందుతారు. అంతేకాకుండా రక్తంలోని చక్కెర పరిమాణాలను నియంత్రించేందుకు కూడా సహాయపడుతాయి. అయితే కాకరకాయలను చట్నీలా తయారు చేసుకుని తినడం వల్ల విశేష ప్రయోజనాలు కలుగుతాయి. అయితే కాకరకాయలతో చట్నీ ఎలా తయారు చేసుకోవాలో? కావాల్సిన పదార్థాలేంటో పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
కావలసిన పదార్థాలు:
కాకరకాయలు - 1/2 కిలో
నూనె - 5 టేబుల్ స్పూన్లు
ఆవాలు - 1 టేబుల్ స్పూన్
జీలకర్ర - 1/2 టేబుల్ స్పూన్
కారం పొడి - 1 టేబుల్ స్పూన్
ఉప్పు - రుచికి తగినంత
చింతపండు - 50 గ్రాములు
ఇంగువ పొడి - 1/2 టీస్పూన్
అల్లం వెల్లుల్లి పేస్ట్ - 1 టీస్పూన్
పసుపు - 1/2 టీస్పూన్
తయారీ విధానం:
కాకరకాయల చట్నీని తయారు చేసుకోవడానికి ముందుగా వాటిని బాగా శుభ్రం చేసుకుని చిన్న చిన్న ముక్కలుగా కోసుకుని నీటిలో వేసుకుని 10 నిమిషాలు నానబెట్టుకోండి.
ఆ తర్వాత చింతపండును కూడా నీటిలో నానబెట్టి దానిని కూడా బాగా గ్రైండ్ చేసుకోవాల్సి ఉంటుంది.
ఒక బౌల్ పెట్టుకుని అందులో నూనె వేడి చేసుకుని నీటిలో నుంచి తీసి ఆరబెట్టుకున్న కాకర కాయలను అందులో వేసుకుని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేయించుకోవాల్సి ఉంటుంది.
ఇలా వేయించుకున్న తర్వాత మరో బౌల్ పెట్టుకుని అందులో నూనె వేసుకుని ఆవాలు, జీలకర్ర వేసి బాగా వేయించాల్సి ఉంటుంది. అందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం పొడి, ఉప్పు, ఇంగువ పొడి, పసుపు వేసి బాగా వేయించుకోవాల్సి ఉంటుంది.
ఇలా వేయించుకున్న తర్వాత అందులోనే అన్ని వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా చేసుకుని మిక్సీ జార్‌లో వేసుకుని గ్రైండ్ చేసుకోండి.
ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత పచ్చడి చల్లారిన తర్వాత గాజు బాటిల్‌లో నిల్వ చేసుకోండి.
చిట్కాలు:
కాకరకాయలను వేయించుకునే క్రమంలో తప్పకుండా అందులో కాస్త ఉప్పును వేసుకోవాల్సి ఉంటుంది. ఇలా చేస్తే కాకరకాయ నుంచి నీరు ఎగిరిపోతుంది.
పచ్చడి తయారు చేసుకునే క్రమంలో తప్పకుండా కాస్త పసుపును వేసుకోవాల్సి ఉంటుంది.
పచ్చడిలో కాస్త నిమ్మరం వేసుకుంటే చాలా రోజుల పాటు నిల్వగా ఉంటుంది.
ఈ పచ్చడిని క్రమం తప్పకుండా తినడం వల్ల బోలెడు లాభాలు పొందుతారు.
ఇదీ చదవండి: మాజీ మంత్రి ఎన్సీపీ లీడర్ బాబా సిద్ధిఖీ దారుణ హత్య.. సల్మాన్ ఖాన్‌కు ఈ మర్డర్‌తో ఉన్న లింక్ అదేనా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.