Happy World Chocolate Day 2023: ప్రతి సంవత్సరం జూలై 7వ తేదీని ప్రపంచ చాక్లెట్ దినోత్సవంగా జరుపుకుంటారు. ఈ దినోత్సవాన్ని 2009 సంవత్సరం నుంచి జరుపుకోవడం ప్రారంభించారు. చాక్లెట్ తినడం వల్ల కలిగే ప్రయోజనాలపై అవగాహన కల్పించడానికి ఈ దినోత్సవాన్ని జరుపుకుంటారు. ప్రతి పండగలు చాక్లెట్ ఒక భాగం అయిపోయింది. చిన్నపిల్లల నుంచి పెద్దవారి దాకా చాక్లెట్ తినడానికి ఇష్టపడుతున్నారు. చాక్లెట్ లో ఉండే గుణాలు మానసిక ఒత్తిడిని తగ్గించడమే కాకుండా శరీరానికి చాలా రకాల ప్రయోజనాలను కలిగిస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. చాక్లెట్ డే సందర్భంగా దీనిని తినడం వల్ల శరీరానికి ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం..
చాక్లెట్ తినడం కలిగే ప్రయోజనాలు:
డిప్రెషన్ ను తగ్గిస్తుంది:
డార్క్ చాక్లెట్ ప్రతిరోజు తినడం వల్ల డిప్రెషన్ నుంచి సులభంగా ఉపశమనం లభిస్తుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఒత్తిడిని తగ్గించేందుకు కూడా కీలక పాత్ర పోషిస్తుంది. తరచుగా డిప్రెషన్ సమస్యలతో బాధపడుతున్న వారు ప్రతిరోజు డార్క్ చాక్లెట్ తినాలని నిపుణులు సూచిస్తున్నారు.
రక్తపోటును అదుపులో ఉంచుతుంది:
డార్క్ చాక్లెట్‌లో ఉండే ఫ్లేవనాల్స్ శరీరంలోని ఎండోథెలియంను ప్రేరేపిస్తుంది. దీనివల్ల ధమనులకు విశ్రాంతి లభించి రక్తపోటు సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఇందులో ఉండే గుణాలు గుండెపోటు సమస్యల నుంచి కూడా ఉపశమనం లభిస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
Also Read: Salaar Teaser: సలార్ టీజర్ వచ్చేసింది.. పవర్‌ఫుల్ లుక్‌లో ప్రభాస్.. గూస్‌బంప్స్ పక్కా..!
అలసట నుంచి ఉపశమనం:
డార్క్ చాక్లెట్‌లో యాంటీఆక్సిడెంట్స్ అధిక పరిమాణంలో లభిస్తాయి. ఇది శరీరంలోని రక్త ప్రవాహాన్ని పరుగుపరిచి ఆక్సిజన్ లెవెల్స్ ను పెంచేందుకు కీలక పాత్ర పోషిస్తుంది. ముఖ్యంగా మానసిక సమస్యలతో బాధపడుతున్న వారికి డార్క్ చాక్లెట్స్ ను తినడం వల్ల ఉపశమనం కలిగిస్తుంది. అంతేకాకుండా అలసటను తగ్గించేందుకు కూడా సహాయపడుతుంది.
ముడుతలను తగ్గిస్తుంది:
డార్క్ చాక్లెట్ లో ఉండే పోషకాలు చర్మం పై ఉన్న ముడతలను తొలగించేందుకు కీలక పాత్ర పోషిస్తుంది. చాక్లెట్‌లో ఉండే యాంటీ-ఆక్సిడెంట్లు చర్మాన్ని తాజాగా ఉంచేందుకు సహాయపడుతుంది. ముఖంపై తక్షణమైన మెరుపును పొందేందుకు ప్రతిరోజు ఉదయం పూట డార్క్ చాక్లెట్ తో తయారు చేసిన కాఫీని తాగడం మంచిది.
Also Read: Salaar Teaser: సలార్ టీజర్ వచ్చేసింది.. పవర్‌ఫుల్ లుక్‌లో ప్రభాస్.. గూస్‌బంప్స్ పక్కా..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook