Iron Rich Foods: శరీరంలో ఐరన్ లోపం కారణంగా అనేక రకాల అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి. ముఖ్యంగా చాలా మందిలో దీని కారణంగా రక్తహీనతతో పాటు ఇతర వ్యాధులు వస్తున్నాయి. ఈ ఐరన్ లోపం సమస్య అనేది ఎక్కువగా మహిళలు, వయస్సు మళ్లిన వారిలో వస్తున్నాయి. దీని కారణంగా కొంతమందిలో తల తిరగడం, కాళ్లు చల్లగా మారడం, అలసట వంటి సమస్యలు వస్తూ ఉంటాయి. అయితే ఇలాంటి లక్షణాలను ముందుగానే గమనించి పలు రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. ఇదిలా ఉంటే ఈ సమస్యతో బాధపడేవారు వివిధ రకాల ఔషధాలతో కూడిన పటు మందులను వినియోగిస్తున్నారు. ఇక నుంచి వీటిని తినక్కర్లేదు.. కేవలం ఈ గింజలు, డ్రైఫ్రూట్స్ తీసుకోవడం వల్ల సులభంగా మంచి ఫలితాలు పొందుతారు. అయితే ఎలాంటి ఆహారాలు తీసుకుంటే మంచి ఫలితాలు పొందుతారో ఇప్పుడు తెలుసుకుందాం.
గార్డెన్ క్రెస్ సీడ్స్:
ప్రతి రోజు గార్డెన్ క్రేస్ సీడ్స్‌ను తీసుకోవడం వల్ల శరీరానికి బోలెడు లాభాలు కలుగుతాయి. అలాగే దీనిని హలీమ్ కే బీజ్ అని కూడా అంటారు. ఇందులో అధిక మోతాదులో ఐరన్ లభిస్తుంది. కాబట్టి ఐరన్ లోపం వంటి సమస్యలతో బాధపడేవారు తప్పకుండా 17.20% ఐరన్ కలిగి ఈ గింజలను తీసుకోవాల్సి ఉంటుంది.
నల్ల నువ్వులు:
నల్ల నువ్వుల్లో కాల్షియం అధిక పరిమాణంలో లభిస్తుంది. కాబట్టి తరచుగా ఐరన్ లోపం కారణంగా అనారోగ్య సమస్యల బారిన పడితే తప్పకుండా ఈ నల్ల నువ్వులను ఆహారాల్లో వినియోగించాల్సి ఉంటుంది. దాదాపు 100 గ్రాముల నల్ల నువ్వుల గింజల్లో 13.90% ఐరన్ లభిస్తుంది.
Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!
తెల్ల నువ్వులు:
తెల్ల నువ్వుల్లో కూడా అధిక మోతాదులో కాల్షియంతో పాటు ఐరన్ లభిస్తుంది. కాబట్టి ప్రతి రోజు ఆహారాల్లో తప్పకుండా నల్ల నువ్వులను వినియోగించడం వల్ల కొలెస్ట్రాల్ నియంత్రణలో ఉంటుంది. అంతేకాకుండా గుండె సమస్యల నుంచి కూడా విముక్తి కలుగుతుంది. అలాగే ఐరన్ లోపం వంటి సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది.
బ్రౌన్ డేట్స్:
ఎండిన ఖర్జూరాల్లో కూడా శరీరానికి కావాల్సిన ఐరన్ ఎక్కువగా లభిస్తుంది. కాబట్టి ప్రతి రోజు ఐరన్ లోపం వంటి సమస్యలతో బాధపడేవారు తప్పకుండా వీటిని పాలతో తీసుకోవాల్సి ఉంటుంది. వంద గ్రాముల బ్రౌన్ డేట్స్‌లో 4.79 ఐరన్ ఉంటుంది.
ఆప్రికాట్లు:
ఆప్రికాట్లు కూడా ఐరన్ లోపాన్ని తగ్గించేందుకు ప్రభావంతంగా సహాయపడుతుంది. అంతేకాకుండా ఇందులో విటమిన్ ఎ, బితో పాటు సి అధికంగా లభిస్తుంది. కాబట్టి వీటిని ప్రతి రోజు ఆహారాల్లో తీసుకుంటే ఐరన్ లోపం నుంచి విముక్తి కలుగుతుంది.
Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి