How To Improve Immune System: శరీరం ఆరోగ్యంగా ఉండడానికి రోగనిరోధక వ్యవస్థ కూడా కీలక పాత్ర పోషిస్తుంది. బాడీలో రోగనిరోధక వ్యవస్థ బలంగా ఉంటేనే ఇన్ఫెక్షన్లు, వైరస్‌ల నుంచి ఉపశమనం లభిస్తుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. కాబట్టి శరీరంలో రోగనిరోధక శక్తి లోపం సమస్యలతో బాధపడేవారు తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. అంతేకాకుండా జీవనశైలిలో మార్పులు చేర్పులు చేసుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం చాలా మంది అనారోగ్యకరమైన ఆహారాలు కూడా అతిగా తీసుకుంటున్నారు. ఇలా వీటిని తీసుకోడం వల్ల కూడా సులభంగా అనారోగ్య సమస్యలు వస్తున్నాయని నిపుణులు సూచిస్తున్నారు. కాబట్టి తరచుగా అనారోగ్య సమస్యలతో బాధపడేవారు ఈ కింది ఆహారాలకు దూరంగా ఉండడాల్సి ఉంటుంది.
వేయించిన ఆహారాలు:
ఆయిల్ ఫుడ్ ఎక్కువగా తినడం వల్ల శరీరంలో కొలెస్ట్రాల్ పెరగడమే కాకుండా తీవ్ర దీర్ఘకాలిక సమస్యలు వస్తున్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా వీటిని అతిగా తీసుకోవడం వల్ల కూడా రోగనిరోధక వ్యవస్థ దెబ్బతింటుంది. కాబట్టి ఇప్పటికే అనారోగ్య సమస్యలతో బాధపడేవారు అతిగా అనారోగ్యకరమైన ఆహారాలు తీసుకోకపోవడం చాలా మంచిది.
చక్కెర పరిమాణాలు అతిగా ఉండే ఆహారాలు:
అతిగా చక్కెర కలిగిన ఆహారాలు ప్రతి రోజు తీసుకోవడం వల్ల శరీరంలో తెల్ల రక్త కణాలు తగ్గుతాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అయితే దీని కారణంగా శరీరంలో రోగనిరోధక శక్తి బలహీనంగా మారుతుందట.
Also Read: Gaddar Cremation:గద్దర్ అంత్యక్రియల్లో అపశృతి.. తొక్కిసలాటలో సీనియర్ జర్నలిస్ట్ మృతి
ప్రాసెస్డ్ ఫుడ్:
ప్రాసెస్డ్ ఫుడ్ శరీరానికి చాలా హానికరం..ఇందులో సోడియం అధిక పరిమాణంలో లభిస్తాయి. కాబట్టి ప్రతి రోజు వీటిని ఆహారంగా తీసుకుంటే శరీరంలో కొలెస్ట్రాల్ పేరుకుపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. అంతేకాకుండా తీవ్ర దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడే ఛాన్స్ కూడా ఉంది.
కెఫిన్:
కెఫిన్ నిద్రలేమి సమస్యలకు దారి తీసేందుకు కీలక పాత్ర పోషిస్తుంది. కెఫిన్ అధిక పరిమాణంలో ఉండే కాఫీ అతిగా తీసుకోవడం కారణంగా కూడా రోగనిరోధక శక్తి లోపం సమస్యల బారిన పడే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ లోపం బారిన పడకుండా ఉండడానికి తప్పకుండా ఆరోగ్య నిపుణులు సూచించిన మంచి ఆహారాలను ప్రతి రోజు తీసుకోవాల్సి ఉంటుంది.
Also Read: Gaddar Cremation:గద్దర్ అంత్యక్రియల్లో అపశృతి.. తొక్కిసలాటలో సీనియర్ జర్నలిస్ట్ మృతి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి