Relationship tips: వివాహ బంధంలో ఈ పొరపాట్లు చేస్తే ఇబ్బందులు తప్పవు..!

Relationship tips: భార్య-భర్తలు చేసే చిన్న చిన్న పొరపాట్ల వల్ల తమ వైవాహిక జీవితంలో సమస్యలు వస్తుంటాయి. అలాంటి పొరపాట్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

Written by - ZH Telugu Desk | Edited by - ZH Telugu Desk | Last Updated : Jan 16, 2022, 10:50 PM IST
Relationship tips: వివాహ బంధంలో ఈ పొరపాట్లు చేస్తే ఇబ్బందులు తప్పవు..!

Relationship tips: వివాహం అనేది అనేక బాధ్యతలతో కూడుకుని ఉంటుంది. ఇద్దరు వేర్వేరు వ్యక్తులు మధ్య ఏర్పడే బంధమే ఈ వివాహం. పెళ్లైన తర్వాత వేర్వేరు ఆలోచన విధానాలు కలిగిన ఇద్దరు వ్యక్తులు ఒకే చోట కలిసి జీవించాల్సి ఉంటుంది.

అలా వివాహ బంధంలో భార్య, భర్తలు ఇద్దరు తమ బాధ్యతను సక్రమంగా నిర్వహించాలంటే కొన్ని ముఖ్యమైన విషయాలను అర్థం చేసుకోవాలి. ఒకరిపై ఒకరికి నమ్మకం, ప్రేమ వంటివి ఉండాలి. కొన్ని విషయాల్లో చేసే చిన్న చిన్న పొరపాట్లు సంసార జీవితాన్ని నాశనం చేస్తాయి.

మరి ఆ విషయాలు ఏమిటి? అనే వివరాలు ఇప్పుడు పరిశీలిద్దాం.

గొడవలకు పరిష్కారం లేకుంటే..

భార్యా భర్తల మధ్య గొడవలు సర్వ సాధారణం. అయితే ఆ గొడవకు ముగింపు పలకకపోతే కష్టమే. అలాంటి పరిణామాలు భవిష్యత్​పై ప్రతికూల ప్రభావం చూపుతుంది. సమస్యకు పరిష్కారం ఆలోచించకుండా పదే పదే ఇలాంటి గొడవలు పడటం వల్ల.. భార్య, భర్తల మధ్య ప్రేమ అనేది నెమ్మదిగా తగ్గిపోతుంది అని విశ్లేషకులు చెబుతున్నారు.

పరస్పర సహకారం లేకపోవడం..

జీవిత భాగస్వామి చెప్పే ప్రతి విషయానికి "NO" అని చెప్పడం అవతలి వ్యక్తిలో నిరాశను పెంచవచ్చు. అలానే.. ఇంట్లో చిన్న చిన్న పనుల్లో భార్యా భర్తలు ఇద్దరు సహకారం చేసుకోకపోవడం కూడా నిరాశను కలిగించవచ్చు. అదే విధంగా జీవిత భాగస్వామిలో ఒకరు ఏదైనా పని చేస్తే..  అభినందించడం వంటివి చేయకపోవడం కూడా ఇబ్బందులు తెచ్చిపెట్టొచ్చు. ఇలాంటి విషయాలన్ని.. భాగస్వామి.. తనను పట్టించుకోవడం లేదనే భావనను పెంచుతాయి. అందుకే వివాహ బంధంలో పరస్పర సహకారం అనేది చాలా ముఖ్యం.

శృంగారంపై ఆసక్తి చూపకపోవడం..

శృంగారం అనేది కోరిక మాత్రమే కాదు, ఇది భార్య, భర్తల మధ్య సాన్నిహిత్యాన్ని పెంచుతుంది. భాగస్వామిలో ఎవరైనా శృంగారంపై మొగ్గు చూపడం లేదంటే.. ఆ బంధం బలహీనన పడి.. ప్రేమ తగ్గుతుందని అంటున్నారు మానసిక వైద్య నిపుణులు.

ఫీలింగ్స్ పంచుకోవడం..

భార్య, భర్తల్లో.. ఎవరైనా తమ భావాలను తమలోనే దాచుకుని.. పార్ట్​నర్​తో తమ ఫీలింగ్స్ పంచుకోకుంటే.. అవతలి వ్యక్తికి నిరాశ కలగొచ్చు. అవతలి వ్యక్తి తమ జీవిత భాగస్వామి తనను దూరంగా ఉంచుతున్నారు లేదా తనను నమ్మడే లేదనే భావన కలగొచ్చు.

అలా జరగకుండా సమస్యలను కలిసి పరిష్కరించుకోవడం, అన్ని విషయాల్లో భార్య, భర్తలు కలిసి నిర్ణయాలు తీసుకోవడం ఉత్తమమని నిపుణులు అంటున్నారు.

Also read: Chanakya Niti: చానక్యుడి నీతి.. ఇలా చేస్తే శత్రువైనా మీకు సలాం కొట్టాల్సిందే!

Also read: Tips to lose Weight: బరువు తగ్గేందుకు ఏడురోజుల్లో ఏడు టిప్స్, చేసి చూడండి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News