Tea Side Effects: ICMR లేటెస్ట్ రిపోర్ట్.. టీ, కాఫీ తాగేవారికి షాకింగ్ వార్త..

Tea - Coffee Side Effects: ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR), నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ (NIN) టీ , కాఫీ విషయంలో సరికొత్తగా 17 కొత్త మార్గదర్శకాలను జారీ చేశాయి. టీ, కాఫీ వినియోగం ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా నియంత్రించాలి అని వారు సలహా ఇస్తున్నారు.

Written by - Vishnupriya Chowdhary | Last Updated : May 17, 2024, 12:29 PM IST
Tea Side Effects: ICMR లేటెస్ట్ రిపోర్ట్.. టీ, కాఫీ తాగేవారికి షాకింగ్ వార్త..

Caffeine Side Effects: ఉదయం లేవగానే కొందరికి కప్ టీ..మరికొందరికి కప్ కాఫీ తాగకపోతే రోజు మొదలయినట్టే ఉండదు. కొందరైతే లేచిన దగ్గర నుండి రాత్రి పడుకునే దాకా కాఫీ అని, టీ అని కప్ లు కప్ లు తాగేస్తూ ఉంటారు. కానీ అలా తాగడం ఆరోగ్యానికి ఎంత వరకు మంచిది అని మాత్రం ఆలోచించరు.

తాజాగా ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్, నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ వారు తాజాగా విడుదల చేసిన ఒక నివేదిక అందరినీ షాక్ కి గురి చేసింది. కెఫీన్‌ వల్ల కలిగే ఆరోగ్య సమస్యలను వివరిస్తూ ICMR ఒక రిపోర్ట్ విడుదల చేసింది. రోజువారీగా కెఫీన్ తీసుకోవడం మంచిది కాదు అని, ఒకవేళ తీసుకుంటున్నా కూడా రోజుకి 300mgకి మాత్రమే పరిమితం చేయాలని వారు సిఫార్సు చేశారు. 

ఐరన్ డెఫిషియన్సీ సమస్యలకు దూరంగా ఉండాలి అంటే భోజనానికి కనీసం ఒక గంట ముందు, తర్వాత టీ కాఫీలకి దూరంగా ఉండాలని వారు సలహా ఇస్తున్నారు. ఆహారం గురించి చెబుతూ వారు నూనె, చక్కెర, ఉప్పు మితంగా తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది అని, కూరగాయలను ఆహారంలో ఎక్కువగా యాడ్ చేయమని సూచిస్తున్నారు.

టీ, కాఫీ ఎక్కువగా తాగేవాళ్ళు ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ చెబుతోంది. నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ వారితో చేతులు కలిపి ICMR దేశవ్యాప్తంగా 17 కొత్త మార్గసూచకాలను ప్రవేశపెట్టింది. టీ కాఫీ అధికంగా తీసుకోవడం మంచిది కాదు అని హెచ్చరిస్తుంది. 

150 ml కప్ బ్రూడ్ కాఫీలో 80 నుండి 120 mg కెఫీన్ ఉంటుందట. ఇక ఇన్‌స్టంట్ కాఫీలో 50 నుండి 65 mg వరకు కెఫీన్ ఉంటుంది. టీలో సుమారుగా 30 నుండి 65 mg కెఫిన్ ఉంటుంది. ICMR వారు రోజువారీ కెఫిన్ పరిమితిని 300 మి.గ్రా మాత్రమే అని చెప్పారు. కాబట్టి దానికి అనుగుణంగానే ఈ రెండు పానీయాలను తీసుకోవాలి. 

ఈ పానీయాలలో ఉండే టానిన్లు శరీరంలో ఐరన్ ను బంధించి ఇనుము లోపం, రక్తహీనత వంటి పరిస్థితులకు దారితీస్తుంది. అధిక కాఫీ వినియోగం వల్ల రక్తపోటు కూడా పెరుగుతుంది. 

అయితే పాలు లేకుండా టీ తాగడం వల్ల మాత్రం రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. కరోనరీ ఆర్టరీ డిసీజ్, స్టొమక్ క్యాన్సర్ వంటి పరిస్థితులు కూడా తగ్గుతాయట. టీ మరియు కాఫీ తీసుకోవడం ఆపేసి పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, వంటి ఆహారాన్ని తీసుకోవడం చాలా మంచిది వారి వాదన.

Also Read: Hyderabad Rains Live Updates: హైదరాబాద్‌లో భారీ ట్రాఫిక్ జామ్.. నిలిచిపోయిన వాహనాలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News