Ganesh Chaturthi 2022: వినాయకుడికి ఎంతో ఇష్టమైన మోదకాలను.. కేవలం ఇలా 5 నిమిషాల్లో తయారు చేసుకోవచ్చు..

How To Make Modak: భారతీయులంతా వినాయక చవితిని భాద్రపద మాసంలోని శుక్లపక్షం రోజున ఘనంగా జరుపుకుంటారు. ఈ పండుగను దాదాపు పది రోజులు పాటు జరుపుకుంటారు. ఈ పండుగను పురస్కరించుకొని భక్తులంతా తమ ఇళ్లలో వినాయక విగ్రహాన్ని ప్రతిష్టించుకుంటారు.

Last Updated : Aug 28, 2022, 09:41 AM IST
  • వినాయక చవితి రోజునా వినాయకుడికి
  • ఎంతో ఇష్టమైన మోదకాలను..
  • ఇలా 5 నిమిషాల్లో తయారు చేసుకోవచ్చు.
Ganesh Chaturthi 2022: వినాయకుడికి ఎంతో ఇష్టమైన మోదకాలను.. కేవలం ఇలా 5 నిమిషాల్లో తయారు చేసుకోవచ్చు..

How To Make Modak: భారతీయులంతా వినాయక చవితిని భాద్రపద మాసంలోని శుక్లపక్షం రోజున ఘనంగా జరుపుకుంటారు. ఈ పండుగను దాదాపు పది రోజులు పాటు జరుపుకుంటారు. ఈ పండుగను పురస్కరించుకొని భక్తులంతా తమ ఇళ్లలో వినాయక విగ్రహాన్ని ప్రతిష్టించుకుంటారు. అంతేకాకుండా భక్తి నిష్టలతో స్వామిని పూజిస్తారు. ముఖ్యంగా చాలామంది ఈ క్రమంలో ఉపవాసాలు కూడా పాటిస్తారు. అయితే వినాయక చవితి రోజున గణేశుడికి ఇష్టమైన మోదకాలు నైవేద్యంగా సమర్పించడం భారతీయుల ఆనవాయితీ.. ఇవి విఘ్నేశ్వరునికి చాలా ప్రీతికరమైనవిగా శాస్త్రం పేర్కొంది. వినాయక చవితి రోజున మండపాల వద్ద భక్తులంతా ఈ మోదకాలను ఫలహారంగా పంచి పెడుతూ ఉంటారు. అయితే ఈ మోదకాలు చేయడం ప్రస్తుతానికి చాలామందికి తెలియదు. అయితే వీటిని ఎలా తయారు చేయాలో మనం ఇప్పుడు తెలుసుకుందాం..

వినాయకునికి సమర్పించే ఇష్టం ఇష్టమైన నైవేద్యాల్లో బోదకాలు ఒకటి. రకరకాల ప్రాంతాల వారు వీటిని వివిధ రకాలుగా తయారు చేసుకుంటారు. తెలంగాణలో ఒకరకంగా చేసుకుంటే.. ఆంధ్ర ప్రాంతంలో మరోలా చేసుకుంటారు. ముఖ్యంగా చాలామంది చేసుకునే మోదకాల్లో కొబ్బరి మోదకాలు ప్రధానమైనవి. వీటిని బియ్యం పిండిలో కొబ్బరి తురుమును కలిపి తయారు చేసుకుంటారు. అంతే కాకుండా వీటిని చేసే క్రమంలో రోజు వాటర్ ని కూడా వినియోగిస్తారు.

కొబ్బరి మోదకాలకు కావలసిన పదార్థాలు ఇవే:
>>రెండు కప్పుల ఎండు కొబ్బరి తురు
>>కప్పుల పాలు
>>ఒక టీ స్పూన్ ఏలకుల పొడి
>>రోజ్‌ వాటర్
>>రెండు టీ స్పూన్ల ఆవు నెయ్యి

వీటిని ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం..

రుచికరమైన మోదకాలు తయారు చేసుకోవడానికి.. ఒక బౌల్ తీసుకొని అందులో కొబ్బరి తురుము, యాలకుల పొడి, రోజ్ వాటర్, పాలను వేసుకొని మిశ్రమంలో తయారు చేసుకోవాలి.

ఎలా చేసుకోవాలి..?
మార్కెట్లో లభించే మోదకాల అచ్చులను ముందుగానే తీసుకోవాలి. వాటిని శుభ్రంగా కడుక్కొని వాటి నిండా నెయ్యి పూసి.. తయారు చేసుకున్న మిశ్రమాన్ని అందులో పూరించండి. ఇలా చేసిన తర్వాత అచ్చులో నుంచి బయటికి తీసి.. వాటిని ఇడ్లీ కుక్కర్ లోను స్ట్రీమింగ్ చేసుకొని.. వినాయకునికి పూజ చేసుకునే క్రమంలో వాటిని సమర్పించాలి.

Also read:  Diabetes Control Tips: ఆయుర్వేద చిట్కాలతో ఇలా మధుమేహానికి సులభంగా చెక్‌ పెట్టొచ్చు..

Also read:  Diabetes Control Tips: ఆయుర్వేద చిట్కాలతో ఇలా మధుమేహానికి సులభంగా చెక్‌ పెట్టొచ్చు..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News