How To Make Iced Tea: వేసవికాలం మొదలైందంటే చాలు.. టీలు తాగడం మానుకుని చల్లగా ఉండే పానీయాలను తాగేందుకు ఇష్టపడతారు. అయితే చాలా మంది వేసవిలో టీ తాగాలని ఉన్న వేడి వాతావరణం కారణంగా తాగలేకపోతారు. ఎండా కాలంలో కూడా టీలను తాగాలనుకునేవారి ఐస్ టీలను తాగొచ్చని నిపుణులు చెబుతున్నారు. ఇందులో ఉండే గుణాలు పొట్టను ఆరోగ్యంగా ఉంచుతుంది. అంతేకాకుండా దీర్ఘకాలిక వ్యాధులు కూడా సులభంగా దూరమవుతాయి. ఐస్ టీని వేసవి కాలంలో ప్రతి రోజు తాగడం వల్ల కలిగే ప్రయోజనాలేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
వేసవి ఈ ఐస్ టీలను తాగండి:
పైనాపిల్ ఐస్ టీని ప్రతి రోజు తాగడం వల్ల శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. ఇందులో ఉండే గుణాలు శరీరాన్ని హైడ్రెట్ చేయడానికి సహాయపడుతుంది. కాబట్టి దీని కోసం పైనాపిల్ జ్యూస్‌ను బ్లెండర్‌లో వేసి మిశ్రమంలా తయారు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ మిశ్రమంలో ఐస్ క్యూబ్స్ వేసి, నిమ్మరసం కలిపి మిక్స్ చేయాలి. ఇందులోనే గ్రీన్ టీని కలపాల్సి ఉంటుంది. ఇలా ఈ మిశ్రమాన్ని ఓ గ్లాస్‌లోకి తీసుకుని తాగితే చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి.
లెమన్ ఐస్ టీ:
వేసవిలో లెమన్ ఐస్ టీ తాగడం వల్ల కూడా శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. దీని కోసం..పైనాపిల్ జ్యూస్‌ను కూడా వినియోగించాల్సి ఉంటుంది. ఒక గ్లాసులో ఈ జ్యూస్ పోసుకుని అందులో ఐస్ క్యూబ్స్, నిమ్మరసం వేసుకుని గ్రీన్ టీ మిక్స్ చేసుకుంటే లెమన్ ఐస్ టీ తయారైనట్లే.. ఈ టీని ప్రతి రోజులో రెండు సార్లు తీసుకోవడం వల్ల చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి.
వాటర్ మెలోన్ ఐస్ టీ:
భారత్‌లో వేసవిలోని ఎక్కువ తాగే ఐస్ టీలో వాటర్ మెలోన్ ఐస్ టీ ఒకటి. ఈ ఐస్ టీని తాగడం వల్ల కూడా శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఈ టీని తయారు చేసుకోవడానికి ముందుగా పుచ్చకాయను నారింజ గుజ్జుతో కలిపి జ్యూస్‌లా తయారు చేసుకోండి. తర్వాత గ్రీన్ టీ తయారు చేసుకుని అందులో మిక్స్ చేసి గ్లాస్‌లో సర్వ్ చేసుకుని తాగడం వల్ల శరీరానికి, చర్మానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి.
మ్యాంగో ఐస్ టీ:
వేసవిలో మామిడి పండ్లు విచ్చలవిడిగా లభిస్తాయి. దీనితో తయారు చేసిన ఐస్ టీని ప్రతి రోజు తాగడం వల్ల శరీరం హైడ్రెట్‌గా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఈ ఐస్‌టీని తయారు చేసుకోవడానికి మామిడి నుంచి గుజ్జును తీసి మిశ్రమంలా తయారు చేసుకోవాలి. ఇదే మిశ్రమంలో గ్రీన్ టీ పోసి మిక్స్ చేసుకోవాలి. అంతేకాకుండా ఇలా తయారు చేసిన డ్రింక్‌లో తేనె వేసి సర్వ్ చేసుకుని తాగితే మంచి ఫలితాలు పొందుతారు.
(నోట్: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణల, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook