How To increases Digestion Power: మన ఆరోగ్యం జీర్ణక్రియపై ఆధారపడి ఉంటుంది. జీర్ణక్రియ సక్రమంగా పని చేస్తే.. శరీరం ఆరోగ్యంగా, యాక్టివ్‌గా ఉంటుంది. అయితే దీనిక కోసం మీరు ఆహారం తీసుకునే క్రమంలో ప్రత్యేకమైన శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. మంచి ఆహారాలను తీసుకుంటే.. శరీరంలో కొలెస్ట్రాల్ పరిమాణం కూడా నియంత్రణలో ఉంటుంది. ముఖ్యంగా ఆధునిక జీవన శైలిని పాటించడం వల్ల దీర్ఘకాలిక జీర్ణ సమస్యల బారిన పడుతున్నారు. అయితే ఇలాంటి సమస్యలకు చెక్ పెట్టేందుకు పోషకాలున్న ఆహారాలు తీసుకోవాల్సి ఉంటుంది. వీటిలో ముఖ్యంగా ప్రొటీన్లు అధికంగా ఉన్న ఆహారాలను తీసుకుంటే జీర్ణక్రియ సమస్యలు దూరమవుతాయని నిపుణులు తెలుపుతున్నారు.
పొట్ట ఆరోగ్యంగా ఉండేందుకు ఈ చిట్కాలను వినియోగించవచ్చు:
1. ప్రశాంతంగా నిద్ర నుంచి మేల్కొవాలి:
హాయిగా నిద్ర నుంచి మేల్కొవడం వల్ల జీర్ణక్రియ సక్రమంగా ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు. ఎలాంటి అసహ్యకరమైన శబ్దాలు లేకుంగా మేల్కొలపడం వల్ల రోజంతా హాయిగా ఉంటుంది. ముఖ్యంగా జీర్ణక్రియ సమస్యలు దూరమవుతాయి.
ఈ కారణాల వల్లే నొప్పులు మొదలవుతాయి:
>>తక్కువ సౌండింగ్‌తో అలారాన్ని సెట్ చేయండి.
>>రాత్రి త్వరగా నిద్రపోవాలి. లేకపోతే సమస్యలు తప్పవు.
2. తప్పకుండా ఒక గ్లాసు గోరువెచ్చని నీటిని తీసుకోవాలి:
నిద్ర లేచిన వెంటనే ఒక గ్లాసు గోరువెచ్చని నీరు తాగాలి. అంతేకుండా ఇదే క్రమంలో నిమ్మరసం కూడా తీసుకుంటే జీర్ణక్రియ సమస్యలు దూరమవుతాయి. అంతేకాకుండా అల్లం పొడి, తులసి ఆకులు, బే ఆకులు, లవంగాలు, దాల్చిన చెక్క, ఏలకులు గింజలను తీసుకుని నీటిలో మరిగించి ఈ కషయాలను కూడా ఉదయం పూట తీసుకోవచ్చు. ఇలా చేయడం వల్ల జీర్ణ క్రియ మెరుగు పడుతుంది.
3. మనసును ఏకాగ్రతతో ఉంచుకోవాలి:
మనసును ఏకాగ్రతతో ఉంచుకోవడానికి సంగీతం వినడం, యోగా, ధ్యానం మొదలైన కార్యకలాపాలు చేయవచ్చని నిపుణులు తెలుపుతున్నారు. వీటిని ఉదయం పూట వింటే రోజంతా ఏకాగ్రతతో ఉంటుంది. దీంతో జీర్ణక్రియ మెరుగుపడుతుంది.
4. అల్పాహారం తీసుకునే ముందు ఇవి చేయోద్దు:
ఉదయం పూట అల్పాహారం తీసుకునే క్రమంలో కుర్చీపై కూర్చోండి. అంతేకాకుండా టిఫిన్ తీసుకునే క్రమంలో టీవీ, మొబైల్ ఫోన్లు, వార్తాపత్రికలు మొదలైన వాటికి దూరంగా ఉండండి. మీ ఆహారంపై దృష్టి పెట్టండి.
(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దీనిని స్వీకరించే ముందు, ఖచ్చితంగా వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)
Also Read: Naga Chaitanya: ప్రేయసితో పోలీసులకు రెడ్ హ్యాండెడ్ గా దొరికేసిన నాగచైతన్య !
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook