Diabetes Control Tips: రక్తంలో చక్కెర పరిమణాలు ఎక్కువగా పెరగడం వల్ల చాలా మంది మధుమేహం ప్రాణాంతకంగా మారుతోంది. దీంతో గుండె జబ్బులు, కిడ్నీ జబ్బులు ఇలా రకరకాల సమస్యల బారిన కూడా పడుతున్నారు. అంతేకాకుండా కొందరిలో విపరీతమైన కాళ్ల నొప్పులు కూడా వస్తున్నాయి. అయితే ఇలాంటి సమస్యలు రావడానికి ప్రధాన కారణాలు రక్తంలో చక్కెర పరిమాణాలు విచ్చలవిడిగా పెరగడం కారణంగా వస్తున్నాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. కాబట్టి ఇలాంటి సమస్యలతో బాధపడేవారు తప్పకుండా ఆయుర్వేద నిపుణులు సూచించిన పలు రకాల ఇంటి చిట్కాలను పాటించాల్సి ఉంటుంది. అయితే ఆ చిట్కాలేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
మధుమేహతో బాధపడుతున్నవారు ఇలా పాదాల నొప్పులకు చెక్ పెట్టండి:
శారీరక శ్రమ తప్పని సరి:
ప్రస్తుతం చాలా మంది శరీరక శ్రమను తగ్గిస్తున్నారు. అయితే ఇలా చేయడం వల్ల శరీరంలో కొలెస్ట్రాల్ విచ్చలవిడిగా పెరిగిపోయి. తీవ్ర అనారోగ్య సమస్యలతో పాటు, గుండె పోటు సమస్యలు కూడా వస్తున్నారు. అంతేకాకుండా కొందరిలో పాదాల నొప్పి వంటి సమస్యలు కూడా వస్తున్నాయి. కాబట్టి ఈ సమస్యల నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి విశ్వ ప్రయత్నాలు చేయనక్కర్లేదు. ప్రతి రోజూ వ్యాయామాలతో పాటు, వాకింగ్, జిమ్‌లు చేయాల్సి ఉంటుంది. ఇలా చేయడం వల్ల బాడీ ఫిట్‌గా ఉంటుంది. దీంతో మధుమేహం కూడా నియంత్రణలో ఉంటుంది.
రక్తంలో చక్కెరను ఇలా నియంత్రించండి:
మధుమేహంతో బాధపడుతున్నవారు తప్పకుండా చక్కెర పరిమాణాలను నియంత్రించుకోవాల్సి ఉంటుంది. లేకపోతే తీవ్ర అనారోగ్య సమస్యల వచ్చే ఛాస్స్ ఉందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా ఆహారపు అలవాట్లలో మార్పులు చేర్పులు చేసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా అనారోగ్యకరమైన, తిపి గల ఆహారాలు తీసుకోకపోవడం చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు. ఇలా చేయడం వల్ల రక్తంలో చక్కెర పరిమాణాలు సులభంగా నియంత్రణలో ఉంటాయి. అంతేకాకుండా తప్పకుండా వ్యాయామాలు కూడా చేయాల్సి ఉంటుంది.
గోరువెచ్చని నీటిని వాడండి:
పాదాలను కడిగే క్రమంలో తప్పకుండా గోరువెచ్చని నీటిని వినియోగించాల్సి ఉంటుంది. ముఖ్యంగా స్నానానికి కూడా వీటిని వాడడం వల్ల సులభంగా మీరు పాదాల నొప్పుల నుంచి సులభంగా ఉపశమనం పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు.
(నోట్: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)
Also Read: Bandla Ganesh Tweets: మీరు వండర్ ఫుల్, మీరే ఇండియా ఫ్యూచర్ కేసీఆర్.. బండ్లన్న ట్వీట్ల వర్షం!
Also Read: Hero Nani Clarity: నాని నోట బూతు పదం.. అసలు సంబంధమే లేదంటున్నాడే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook