House Flies: వానా కాలంలో ఈగలు రావడం సహజం.. ఇలా చేస్తే చిటికెలో మాయం..!

House Flies Home Remedies: తరచుగా అందరూ ఇంటి కిటికీలు, తలుపులు తెరిచి ఉంచుతారు. దీని వల్ల ఈగలు, దోమలు ఇంటల్లోకి వస్తాయి. కొన్ని సందర్భాల్లో పామలు కూడా వచ్చే అవకావకాశాలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి.

Written by - ZH Telugu Desk | Last Updated : Aug 7, 2022, 01:26 PM IST
  • ఈగలను తరిమికొట్టాడికి..
  • ఆపిల్ సైడర్ వెనిగర్ వినియోగించవచ్చు
  • వీటిని వినియోగిస్తే చిటికెలో మాయం
House Flies: వానా కాలంలో ఈగలు రావడం సహజం.. ఇలా చేస్తే చిటికెలో మాయం..!

House Flies Home Remedies: తరచుగా అందరూ ఇంటి కిటికీలు, తలుపులు తెరిచి ఉంచుతారు. దీని వల్ల ఈగలు, దోమలు ఇంటల్లోకి వస్తాయి. కొన్ని సందర్భాల్లో పామలు కూడా వచ్చే అవకావకాశాలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. వీటి వల్ల తీవ్ర అనారోగ్య సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా వర్షాకాలంలో వీటి తీవ్రత అధికం కావున అందరూ పలు రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. ఈగల వల్ల ఇంట్లో సూక్ష్మ క్రిములు విచ్చలవిడిగా పెరిగే అవకాశాలు అధికం కావున అందరూ పలు రకాల జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. అయితే ఈ సమస్యల నుంచి ఉపశమనం పొందడనికి పలు రకాల చిట్కాలను నిపుణులు సూచిస్తున్నారు. ఆ ఇంటి చిట్కాలేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

ఈగలు వదిలించుకోవడానికి ఇంటి చిట్కాలు ఇవే:

ఆపిల్ సైడర్ వెనిగర్:

ఒక గ్లాసులో యాపిల్ సైడర్ వెనిగర్ తీసుకుని.. మీరు పాత్రలను తోమే.. డిష్‌లో కానీ సోప్ వేయండి. వీటితో పాత్రలను కూడా శుభ్రం చేసుకోవచ్చు. అంతేకాకుండా ఒక గ్లాసులో దీనిని వేసి దానిపై ప్లాస్టిక్‌ మూతను జోడించి.. ఆపై దానికి రంధ్రాలు చేయండి. అయితే ఈ గ్లాసును ఈగలు ఉన్న ప్రదేశంలో పెట్టండి. ఇలా చేస్తే ఈగలు 2 నిమిషాల్లో మటు మాయం అవుతాయి.

ఉప్పు నీరు:
ఈగల నుంచి ఉపశమనం పొందడానికి ఒక గ్లాసు నీటిలో 2 టీస్పూన్ల ఉప్పు తీసుకుని బాగా కలపాలి. ఇప్పుడు ఈ నీటిని స్ప్రే బాటిల్‌లో నింపి ఈగలపై చల్లాలి. అంతే తొందరలోనే ఫలితం పొందుతారు.

పుదీనా, తులసి:
పుదీనా, తులసి మొక్కలు కూడా ఈగలను తరిమికొట్టడానికి కూడా ఉపయోగించవచ్చని నిపుణులు తెలుపుతున్నారు. ఈ మొక్కలను తీసుకుని గ్రైడ్‌ చేసి.. నీటిలో కలుపుకుని ఈగలపై పిచికారీ చేయాలి. ఇలా చేస్తే 5 నిమిషాల్లో ఈగల నుంచి ఉపశమనం పొందవచ్చు.

పాలు, మిరియాలు:
ఈ రెసిపీని సిద్ధం చేయడానికి.. ముందుగా ఒక గ్లాసు పాలలో ఒక టీస్పూన్ నల్ల మిరియాలు, 3 టీస్పూన్ల చక్కెర కలపండి. ఈగలు ఎక్కువగా సంచరించే చోట ఈ పాలను ఉంచండి. ఆ పాలపై వాలి త్వరలోనే అందులో మునిగిపోతాయి.

 

Also Read: మోనోకినిలో షాలిని పాండే హాట్ ట్రీట్.. మంటలు రేపుతున్న అర్జున్ రెడ్డి భామ!

Alos Read: CWG 2022: అదరగొట్టిన భారత అమ్మాయిలు..కామన్వెల్త్‌ ఫైనల్‌కు దూసుకెళ్లిన టీమిండియా..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

 

 

Trending News