Honey Quality Test: తేనె అసలైందో కాదో ఎలా తెలుసుకోవడం, సులభమైన చిట్కాలు ఇవే

Honey Quality Test: తేనె ఆరోగ్యానికి చాలా మంచిది. అయితే మార్కెట్‌లో నకిలీ తేనె బెడద ఎక్కువగా ఉంది జాగ్రత్త. నకిలీ తేనె సేవించడం వల్ల ఆరోగ్యం మాట అటుంచితే..అనారోగ్యం కలుగుతుంది.  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Oct 31, 2022, 06:39 PM IST
Honey Quality Test: తేనె అసలైందో కాదో ఎలా తెలుసుకోవడం, సులభమైన చిట్కాలు ఇవే

తేనెను సహజంగా సర్వ రోగ నివారిణిగా పిలుస్తారు. ఆరోగ్యపరంగా అంతటి అద్భుత గుణాలున్నాయి. అయితే మార్కెట్‌లో లభించే నకిలీ తేనె సేవిస్తే మాత్రం అనారోగ్యం వెంటాడుతుంది. అందుకే ఏది అసలైంది, ఏది కాదనేది ఎలా గుర్తించాలి.

తేనెతో ఆరోగ్యానికి అద్భుతమైన ప్రయోజనాలున్నాయి. ఆయుర్వేదంలో తేనెను ఔషధంగా భావిస్తారు. పంచదారకు బదులుగా తేనె వాడటం వల్ల ఆరోగ్యానికి చాలా మేలు కలుగుతుంది. తేనె ఒరిజినల్ అయితే..చాలా లాభాలున్నాయి. కానీ ప్రస్తుతం మార్కెట్‌లో కల్తీ తేనె ఎక్కువగా లభిస్తోంది. ఫలితంగా ఆరోగ్యంపై దుష్పరిణామాలు కలుగుతున్నాయి. ఈ నేపధ్యంలో తేనె నాణ్యతను పసిగట్టేందుకు కొన్ని టిప్స్ ఉన్నాయి. ఆ టిప్స్ ఏంటో పరిశీలిద్దాం.

తేనె నాణ్యతను ఎలా పసిగట్టడం

1. టిష్యూ పేపర్ టెస్ట్ ద్వారా తేనె అసలైందా కాదా తెలుసుకోవచ్చు. టిష్యూ పేపర్ టెస్ట్‌ను ఇంట్లోనే హాయిగా చేయవచ్చు. ఒక టిష్యూ పేపర్ తీసుకుని..దానిపై కొద్దిగా తేనె వేయాలి. తేనెలలో కల్తీ లేకపోతే...టిష్యూ పేపర్ పైనే నిలబడి ఉంటుంది.

2. స్వీట్ షాప్స్‌లో గులాబ్ జామున్ షీరా టెస్ట్ చేయడం తెలుసు కదా. అదే విధంగా తేనె నాణ్యతను పరీక్షించవచ్చు. దీనికోసం ఒక డ్రాప్ తేనెను బొటనవేలు, వేలుకి మధ్యలో ఉంచాలి. దీంతో స్ట్రింగ్ చేసేందుకు ప్రయత్నించాలి. ఒకవేళ కల్తీ తేనె అయితే స్ట్రింగ్ చేయలేరు. ఒరిజినల్ తేనె అయితే స్ట్రింగ్ చేయవచ్చు. తేనె అసలైంది అయితే బొటనవేలిపై నిలబడుతుంది. నకిలీ అయితే జారిపోతుంది.

3. తేనె నాణ్యతను చెక్ చేసేందుకు మరో మంచి పద్ధతుంది. చిన్న పుల్లముక్కకు దూది అమర్చి..దానికి తేనె రాసి..మండించాలి. దూది వెంటనే కాలిపోతే..తేనె నకిలీ కాదని అర్ధం. కాలేందుకు కాస్త సమయం పడితే..కల్తీ అని అర్ధం.

తేనెతో లాభాలు

తేనె ఆరోగ్యానికి చాలా మంచిది. గోరు వెచ్చని నీటిలో తేనె కలిపి రోజూ పరగడుపున తాగితే పొట్ట చుట్టూ ఉన్న కొవ్వు కరిగించవచ్చు. మరోవైపు తేనెలో కొద్దిగా నిమ్మరసం కలిపి తాగితే అధిక బరువు సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు. తేనె ప్రతిరోజూ తాగడం అలవాటు చేసుకుంటే శరీరానికి ఎనర్జీ కూడా లభిస్తుంది. 

Also read: Hair Care Tips: ఈ పూలతో..మీ జుట్టు మరింత అందంగా నల్లగా.. హెయిర్ ఫాల్ సమస్యకు చెక్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.    

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu  

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News