Water Chestnut For Healthy Weight Loss: ఉదయం పూట అల్పాహారంలో భాగంగా చాలామంది గోధుమ పిండితో తయారు చేసిన ఆహారాలు మాత్రమే తీసుకుంటున్నారు. అయితే ఈ పిండితో తయారుచేసిన ఆహారాలను తీసుకోవడం వల్ల శరీరానికి ఎలాంటి ప్రయోజనాలు కలగవని నిపుణులు చెబుతున్నారు. ఈ పిండికి బదులుగా నీటి చెస్ట్ నట్ పిండిని కూడా వినియోగించవచ్చు. ఈ పిండిలో శరీరానికి కావాల్సిన చాలా రకాల పోషక విలువలు లభిస్తాయి. ముఖ్యంగా క్యాన్సర్, ఊబకాయం వంటి వ్యాధుల నుంచి ఉపశమనం పొందడానికి ఈ పిండి కీలక పాత్ర పోషిస్తుంది. ఈ పిండిని తయారు చేసుకోవడానికి.. వాటర్ చెస్ట్ నట్స్ను మిక్సీలో వేసి గ్రైండ్ చేయాల్సి ఉంటుంది. ఇలా వాటిని గ్రైండ్ చేసి ఆహార పదార్థాలలో వినియోగిస్తే చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. సమంత తప్పకుండా ఈ పిండిని వినియోగించడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం..
వాటర్ చెస్ట్ నట్స్ పిండిని వినియోగించడం వల్ల కలిగే ప్రయోజనాలు:
1. ఈ పిండిని క్రమం తప్పకుండా వినియోగిస్తే శరీరంలో కొలెస్ట్రాల్ పరిమాణం తగ్గుతుంది ముఖ్యంగా చెడు కొలెస్ట్రాల్లో నియంత్రించి శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచేందుకు సహాయపడుతుంది. అంతేకాకుండా ఆకలిని నియంత్రించి శరీర బరువును తగ్గిస్తుంది. కాబట్టి శరీర బరువును వేగంగా తగ్గించుకోవాలనుకునేవారు తప్పకుండా ఈ పిండిని ట్రై చేయండి.
2. వాటర్ చెస్ట్ నట్ ఆహారంలో వినియోగిస్తే శరీరంలో పెరుగుతున్న క్యాన్సర్ కణాలను సులభంగా నియంత్రిస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇందులో ఉండే ఆంటీ యాక్సిడెంట్ల పరిమాణం క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించే అవకాశాలు కూడా ఉన్నాయని నిపుణులు వెల్లడించారు. ఇందులో ఉండే మూలకాలు నిద్రలేమి సమస్యలకు కూడా ప్రభావంతంగా పనిచేస్తాయి. ప్రతిరోజు ఒత్తిడి డిప్రెషన్కు గురవుతున్న వారు తప్పకుండా ఈ పిండితో తయారు చేసిన ఆహార పదార్థాలను తీసుకోవాలి. ఇందులో ఉండే బి6 విటమిన్ పై సమస్యల నుంచి సులభంగా ఉపశమనం కలిగిస్తుంది.
3. ఆధునిక జీవన శైలి కారణంగా చాలామంది రక్తపోటు సమస్యలతో బాధపడుతున్నారు. అయితే ఈ రక్తపోటు సమస్య నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి ఈ పిండితో తయారు చేసిన అల్పాహారాన్ని క్రమం తప్పకుండా ఉదయం పూట తీసుకుంటే మంచి ఫలితాలు పొందుతారని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఇందులో ఉండే విటమిన్ల పరిమాణం శరీర అభివృద్ధికి, అనారోగ్య సమస్యలను దూరం చేయడానికి ప్రభావంతంగా సహాయపడతాయి.
Also Read: Haris Rauf: హరీస్ రవూఫ్ బర్త్ డే.. షాహీన్ అఫ్రిది, షాదాబ్ ఖాన్ ఏ చేశారో చూడండి.. వీడియో వైరల్
Also Read: Haris Rauf: హరీస్ రవూఫ్ బర్త్ డే.. షాహీన్ అఫ్రిది, షాదాబ్ ఖాన్ ఏ చేశారో చూడండి.. వీడియో వైరల్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook