Weight Loss Tips: చలికాలంలో శరీరం బరువు ఎందుకు పెరుగుతుంది, ఏం చేయాలి

Weight Loss Tips: చలికాలం వచ్చిందంటే చాలు అనారోగ్యంతో పాటు శరీరం బరువు కూడా పెరిగిపోతుంటుంది. శీతాకాలంలో బరువు పెరగకుండా ఉండటం, ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కోసం ఏం చేయాలనేది తెలుసుకుందాం..  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Dec 28, 2023, 05:31 PM IST
Weight Loss Tips: చలికాలంలో శరీరం బరువు ఎందుకు పెరుగుతుంది, ఏం చేయాలి

Weight Loss Tips: శీతాకాలం అంటే సహజంగానే అనారోగ్యానికి నిలయం. దీనికి తోడు చలి, బద్దకం కారణంగా శారీరక శ్రమ తప్పిపోవడంతో బరువు పెరుగుతుంటారు. అంతేకాకుండా చలికాలంలో శరీరంలోని మెటబోలిక్ రేట్ మందగిస్తుంది. దాంతో అధిక బరువుకు దారి తీస్తుంది. మరి ఈ పరిస్థితి నుంచి ఎలా ఉపశమనం పొందాలనేది తెలుసుకుందాం..

చలికాలంలో ప్రతి ఒక్కరూ శరీరాన్ని వేడిగా ఉంచుకునేందుకు వివిధ రకాలుగా ప్రయత్నాలు చేస్తుంటారు. వేడి వేడి దుస్తులు ధరిస్తుంటారు. వేడి పానీయాలు తాగుతుంటారు. ఎక్కువ కేలరీలున్న ఆహారం తీసుకుంటుంటారు. అందుకే చలికాలంలో సహజంగా బరువు పెరిగిపోతుంటారు. అయితే కొన్ని చిట్కాలతో అధిక బరువు సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు. 

చలికాలంలో హెల్తీ వెయిట్ కోసం నిర్ణీత సమయంలో వ్యాయామం చేయాలి. రోజూ క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల బరువు తగ్గడమే కాకుండా తిరిగి పెరగకుండా ఉంటుంది. బాడీలో ఉండే అధిక కేలరీలు వేగంగా కరుగుతాయి. హెల్తీ వెయిట్ తీసుకోవడం వల్ల కూడా బరువు నియంత్రించుకోవచ్చు. బయటి తిండి పూర్తిగా మానేయాలి. తినే ఆహారంలో ప్రోటీన్లు, ఫైబర్, విటమిన్లు ఎక్కువగా ఉండేట్టు చూసుకోవాలి. 

జంక్ ఫుడ్స్, ప్రాసెస్డ్ ఫుడ్స్, ప్యాకెట్ ఫుడ్స్, స్వీట్స్ , ఆయిలీ ఫుడ్స్‌కు దూరంగా ఉండాలి. తీసుకునే ఆహారం ఎప్పుడూ బ్యాలెన్స్‌గా ఉండాలి. రోజుకు ఎన్ని కేలరీలు అవసరమో చూసుకుని తినే ఆహారం కేలరీలను లెక్కించుకుని తినాల్సి ఉంటుంది. అందుకే ఇంటి ఆహారం చాలా ప్రయోజనకరం. లంచ్, డిన్నర్‌లో కూరగాయల సలాడ్, తృణ ధాన్యాలు తీసుకోవాలి. పండ్లు, నట్స్, సీడ్స్ డైట్‌లో భాగంగా చేసుకోవాలి. 

అన్నింటికంటే ముఖ్యంగా రోజూ తగిన మోతాదులో నీళ్లు తప్పకుండా తాగాలి. రోజుకు కనీసం 8 గ్లాసుల నీళ్లు తాగాల్సి ఉంటుంది. మరోవైపు రోజూ తగినంత నిద్ర తప్పకుండా ఉండాలి. రాత్రి పూట నిద్ర రోజుకు 7-8 గంటలు తప్పకుండా ఉండాల్సిందేనంటారు ఆరోగ్య నిపుణులు. 

చలికాలంలో సీజన్ మారడం వల్ల చాలామందిలో ఒత్తిడి, డిప్రెషన్ వంటి సమస్యలు ఎదురౌతాయి. ఈ రెండు సమస్యల కారణంగా బరువు పెరిగే అవకాశాలున్నాయి. అందుకే ఈ రెండింటికీ దూరంగా ఉండాలి. దీనికోసం యోగా, మెడికేషన్ అవసరమౌతాయి.

Also read: Coriander Seeds: ధనియాల తీసుకోవడం వల్ల అన్ని రకాల సమస్యలకు చెక్‌!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News