Guava Side Effects: ఈ వ్యాధులు ఉన్నవారు జామ పండును ఎక్కువగా తినకూడదు?

Guava Side Effects: జామపండు ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో ఎన్నో రకాలు పోషకాలు ఉంటాయి. దీనిని అతిగా తినడం వల్ల కలిగే దుష్ప్రభావాలేంటో తెలుసుకుందాం.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Apr 13, 2023, 05:28 PM IST
Guava Side Effects: ఈ వ్యాధులు ఉన్నవారు జామ పండును ఎక్కువగా తినకూడదు?

Side Effects Of Guava:  పేదవాడి ఆపిల్ గా పిలిచే జామ పండు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. ఈ పండు అన్ని సీజన్ ల్లో లభిస్తుంది. ఇందులో ఫైబర్, ప్రొటీన్, విటమిన్ సి, పొటాషియం, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. అంతేకాకుండా ఇందులో ఫోలేట్, బీటా కెరోటిన్ కూడా ఉంటుంది. ఇది ఎన్నో రకాల వ్యాధులను దూరం చేస్తుంది. అయితే ఈ పండు తినడం వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయో..  దీనిని అతిగా తీసుకోవడం అన్నే నష్టాలు కూడా ఉన్నాయి. జామపండు తినడం వల్ల కలిగే దుష్ప్రభావాలు ఏంటో తెలుసుకుందాం. 

1. జలుబు, దగ్గు ఉన్నవారు
జలుబు, దగ్గు ఉన్నవారు జామపండు తినకూడదు. ఎందుకంటే ఇది వ్యాధి లక్షణాలను పెంచుతుంది. దీనిని ముఖ్యంగా రాత్రిపూట అస్సలు తినకూడదు. 
2. జీర్ణవ్యవస్థపై చెడు ప్రభావం
జామ పండు తినడం వల్ల మీ జీర్ణక్రియ మెరుగుపడుతుంది. ఇది మలబద్ధకాన్ని దూరం చేస్తుంది.  దీనిని అధికంగా తీసుకోవడం వల్ల ఇది మీ జీర్ణవ్యవస్థపై చెడు ప్రభావం చూపుతుంది. ఇందులో ఉండే సహజ చక్కెర కడుపు ఉబ్బరం సమస్యను కూడా కలిగిస్తుంది. 
3. వాపుతో బాధపడుతున్న వ్యక్తులు
జామకాయలో ఫ్రక్టోజ్ మరియు విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. దీనిని తినడం వల్ల శరీరంలో విటమిన్ సి ఎక్కువగా చేరుతుంది. వాపు సమస్యలు ఉన్నవారు జామకాయను అస్సలు తినకూడదు. ఎందుకంటే దీనిని తింటే వాపు పెరుగుతుంది. 

Also Read: Lemon Benefits: నిమ్మకాయే కదా అని తీసిపడేయకండి.. చిన్నదే కానీ.. బోలెడు బెనిఫిట్స్!

4. మధుమేహ రోగులు
జామ అనేది తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ కలిగిన పండు. అందుకే వైద్యులు మధుమేహ వ్యాధిగ్రస్తులను ఈ పండు తినమని సూచిస్తారు. అయితే దీనిని పరిమితంగా తీసుకుంటేనే ప్రయోజనరంగా ఉంటుంది. లేకపోతే మీ సమస్యను పెంచుతుంది. 
రోజుకు ఎన్ని జామపళ్లు తినాలి?
రోజూ ఒకటి లేదా రెండు జామపండు తినడం ఆరోగ్యానికి మేలు చేస్తుంది. లంచ్ లేదా డిన్నర్ కు కొంచెం ముందు దీనిని తినడం మంచిది. అంతేకాకుండా వ్యాయామానికి ముందు కూడా దీనిని తినవచ్చు వైద్య నిపుణులు సూచిస్తున్నారు. 

(Disclaimer: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు మరియు సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దీనిని స్వీకరించే ముందు వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)

Also read: Guava Health Benefits: జామపండుతో బోలెడన్ని ప్రయోజనాలు.. తెలిస్తే ఆశ్చర్యపోతారు!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News