Best time to eat curd: పెరుగు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇందులో కాల్షియం, ప్రోటీన్ పుష్కలంగా ఉంటాయి. అంతేకాకుండా మన శరీరానికి ఉపయోగపడే బ్యాక్టీరియా కూడా అందులో లభిస్తుంది. దీనిని రకరకాలుగా తింటారు. కొందరు పెరుగులో ఉప్పు వేసుకుంటే, మరికొందరు చక్కెరు వేసుకుని తింటారు. అయితే పెరుగు ఎప్పుడు తినాలనేది చాలా మందికి ఉన్న డౌట్. ఇప్పుడు కర్డ్ ఎప్పుడు తీసుకోవాలి, దీని వల్ల కలిగే ప్రయోజనాలేంటో తెలుసుకుందాం.
పెరుగు ఎప్పుడు తినాలి?
పగటిపూట పెరుగు తినడం ఆరోగ్యానికి మంచిదని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా మధ్యాహ్న సమయంలో కర్డ్ ను తీసుకోవడం హెల్త్ కు చాలా ప్రయోజనకరంగా ఉంటుందని వారు చెబుతున్నారు. ఎందుకంటే ఇది జీర్ణక్రియలో సహాయపడే ఆరోగ్యకరమైన గట్ మైక్రోబయోమ్‌ను పెంచడంలో సహాయపడుతుంది.
ఎప్పుడు తినకూడదు?
రాత్రిపూట పెరుగు తినడం మానుకోండి. ఎందుకంటే ఇది తీసుకోవడం వల్ల అజీర్తి ఏర్పడుతుంది. అంతేకాకుండా నిద్రకు ఆటంకం కలుగుతుంది. ఖాళీ కడుపుతో పెరుగు తినడం వల్ల అసిడిటీ వస్తుంది.అందుకే పెరుగు ఏ సమయంలో తినాలనే విషయంలో పోషకాహార నిపుణుడి సలహా తీసుకోవడం మంచిది.
పెరుగు తినడం వల్ల కలిగే ప్రయోజనాలు
** పెరుగులో విటమిన్ బి తక్కువగా ఉంటుంది మరియు జీర్ణవ్యవస్థకు మేలు చేసే బ్యాక్టీరియాను కలిగి ఉంటుంది.
** పెరుగులో ప్రోటీన్ అధికంగా ఉంటుంది, ఇది బరువు తగ్గడానికి సహాయపడుతుంది.
** పెరుగులో ఉండే ప్రోబయోటిక్స్ రోగనిరోధక శక్తిని పెంపొందిస్తాయి.
Also Read: What is Menopause: మెనోపాజ్ అంటే ఏంటి? దాని లక్షణాలు ఏంటి?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook