Benefits of Curry Leaves: పరిగడుపున కరివేపాకు తింటే చాలు.. ఈ 5 రకాల వ్యాధులు అస్సలు దరిచేరవు!

Benefits of Curry Leaves: కరివేపాకు వంటకు రుచిని ఇవ్వడమే కాకుండా ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. దీనిని ఉదయాన్నే ఖాళీ కడుపుతో తినడం వల్ల ఎన్నో రకాల వ్యాధులు దూరమవుతాయి. 

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Mar 14, 2023, 06:51 PM IST
Benefits of Curry Leaves: పరిగడుపున కరివేపాకు తింటే చాలు.. ఈ 5 రకాల వ్యాధులు అస్సలు దరిచేరవు!

Benefits of Curry Leaves: భారతీయ వంటకాల్లో రుచి కోసం కరివేపాకును ఉపయోగిస్తాం. ముఖ్యంగా సౌత్ ఇండియన్ వంటకాల్లో ఎక్కువగా ఈ కర్రీ లీవ్స్ ను వాడుతుంటారు.  అయితే కరివేపాకు వల్ల కూడా ఎన్నో ఆరోగ్యకర ప్రయోజనాలు ఉన్నాయి. ఇందులో భాస్వరం, కాల్షియం, ఇనుము, రాగి, విటమిన్లు మరియు మెగ్నీషియం వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. దీన్ని ఉదయాన్నే ఖాళీ కడుపుతో తినడం వల్ల ఎన్నో వ్యాధులు దూరమవుతాయి. కరివేపాకు తినడం వల్ల కలిగే అద్భుతమైన ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందాం. 

కరివేపాకు ప్రయోజనాలు

1. కళ్లకు మంచిది
కరివేపాకు ఆకుల్లో విటమిన్ ఏ పుష్కలంగా ఉంటుంది. ఇది కంటిచూపును మెరుగుపరచడంలో సహాయపడుతుంది. అంతేకాకుండా అంధత్వం వచ్చే ప్రమాదాన్ని నివారిస్తుంది.

2. డయాబెటిస్‌కు చెక్
కరివేపాకులో రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించే హైపోగ్లైసీమిక్ లక్షణాలు ఉన్నందున మధుమేహ రోగులు తరచుగా దీనిని నమలడం మంచిది.

3. జీర్ణక్రియ మెరుగు
కర్రీ లీవ్స్ ను ప్రతిరోజూ ఉదయం ఖాళీ కడుపుతో నమలితో మీ జీర్ణక్రియ మెరుగుపడుతుంది. అంతేకాకుండా మలబద్ధకం, ఎసిడిటీ, ఉబ్బరం వంటి ఉదర సంబంధిత సమస్యలను దూరం చేస్తుంది. 

4. ఇన్ఫెక్షన్ నుండి రక్షణ
కరివేపాకులో యాంటీ ఫంగల్ మరియు యాంటీబయాటిక్ లక్షణాలు ఉన్నాయి. ఇది అనేక రకాల ఇన్ఫెక్షన్లను రాకుండా అడ్డుకుంటుంది. 

5. బరువు తగ్గిస్తుంది
కరివేపాకును నమలడం వల్ల బరువు మరియు పొట్ట కొవ్వు తగ్గుతుంది, ఎందుకంటే ఇందులో ఇథైల్ అసిటేట్, మహానింబైన్ మరియు డైక్లోరోమీథేన్ వంటి పోషకాలు అధిక మెుత్తంలో ఉంటాయి. 

Also read: Benefits Of Sapota: సపోటా పండుతో షాకింగ్ బెనిఫిట్స్.. తెలిస్తే వదలరు..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link - https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x